Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రక్షించే అధికారి నుంచే లైంగిక వేధింపులు.. ప్రముఖ నటి ఆగ్రహం!

రక్షించే అధికారి నుంచే లైంగిక వేధింపులు.. ప్రముఖ నటి ఆగ్రహం!

Tupaki.com 1 week ago

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఎక్కువగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. నిజానికి అన్ని రంగాలలో ఈ సమస్య ఉన్నప్పటికీ సినిమా ఇండస్ట్రీ అంటేనే పబ్లిక్ కాబట్టి ఈ రంగానికి చెందిన ప్రతి విషయం కూడా ఇట్టే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది.

అందులో భాగంగానే సెలబ్రిటీలు కూడా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో లేదా అవకాశాల కోసం వెతుకులాటలో ఉన్నప్పుడు ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొని ఉంటారు. పైగా సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా మీడియా ముందు చెప్పుకుంటున్న విషయం తెలిసిందే.

వాస్తవానికి సోషల్ మీడియా అనేది ఎంతవరకు అయితే సెలబ్రిటీలకు ఉపయోగపడుతుందో.. అంతే ఇబ్బందులను కూడా కలుగజేస్తోంది. ముఖ్యంగా సెలబ్రిటీలను ఈ సోషల్ మీడియా ద్వారా కూడా వేధిస్తున్న నెటిజన్స్ లేకపోలేదు. కొంతమంది అభిమానుల పేరిట, మరి కొంతమంది నెటిజన్స్ పేరిట ఇలా వారిపై లైంగిక దూషణలకు దిగుతూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అలా ఎవరి నుంచైనా ఇబ్బందులు ఎదురైతే పోలీసులను ఆశ్రయిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అలాంటిది రక్షించే పోలీసు నుంచే ఇబ్బందులు ఎదురైతే ఎవరికి చెప్పుకోవాలి అంటూ ఒక నటి ఆవేదన వ్యక్తం చేసింది.

మరి ఆమె ఎవరు ? అసలేం జరిగింది ? అనే విషయానికి వస్తే.. ఆమె ఎవరో కాదు ప్రముఖ కన్నడ నటి సింగర్ చైత్ర జె ఆచార్. సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్స్ ను, ఫాలోవర్స్ ను ఆకట్టుకుంటున్న ఈమె ఇటీవల కూడా కొన్ని ఫోటోలను షేర్ చేయగా.. అందులో ఒక వ్యక్తి.." నువ్వు హీరోయినా? లేక సెక్స్ వర్కరా ?" అని ఇన్స్టా లో.మెసేజ్ పంపడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది చైత్ర. ఇక అతడి ప్రొఫైల్లో ఉన్న వ్యక్తి పోలీసు యూనిఫామ్ ధరించడంతో బెంగళూరు పోలీసులను ట్యాగ్ చేస్తూ చర్యలు తీసుకోవాలని కోరింది.

ఈ విషయం తెలిసిన నెటిజన్స్.. రక్షించే అధికారే ఇలా ఆడవారిపై అసభ్యకరంగా కామెంట్లు చేస్తే.. ఇక ఎవరిని ఆశ్రయించాలి?" అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఎట్టకేలకు తన బండారం కాస్త బయటపడటంతో సదరు వ్యక్తి క్షమాపణలు చెబుతూ మళ్లీ మెసేజ్లు పంపించాడు . ఇక ఆన్లైన్ వేధింపులను చైత్ర ధైర్యంగా ఎదురించడంపై ఆమెపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా అన్యాయం జరుగుతోందని తెలిస్తే ధైర్యంగా ప్రశ్నించగలగాలి అని అప్పుడే ఇలాంటివి జరగకుండా ఉంటాయి అంటూ అభిమానులు ఈమెకు అండగా నిలుస్తున్నారు. ప్రస్తుతం చైత్ర తీసుకున్న ఈ నిర్ణయం అందరిని మెప్పిస్తోంది.

చైత్ర జె ఆచార్ విషయానికి వస్తే..కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ఈమె గాయని కూడా.. 2019లో వచ్చిన మహిరా అనే చిత్రంతో నటిగా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇక బెంగళూరులో జన్మించిన సప్త సాగర దాచేఎల్లో, టోబీ, బ్లింక్ వంటి విజయవంతమైన చిత్రాలలో తన అద్భుతమైన నటనతో విపరీతమైన ప్రేక్షకులను సొంతం చేసుకుంది. నటనతో పాటు గాయనిగా కూడా మంచి పేరు సొంతం చేసుకున్న ఈమె కొన్ని పాటలను కూడా పాడింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu