Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'రమణి కళ్యాణం' ట్రైలర్.. పక్కా ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్

'రమణి కళ్యాణం' ట్రైలర్.. పక్కా ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్

Tupaki.com 4 days ago

మధ్యకాలంలో ప్రేక్షకులు భారీ యాక్షన్‌, హంగామా కంటే మనసుకు దగ్గరయ్యే కథలకే ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉండే క్లీన్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్స్ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.

అలాంటి సమయంలో రమణీ కళ్యాణం మంచి ఫీల్‌గుడ్ సినిమాలా కనిపిస్తోంది. ఇప్పటికే టీజర్‌, టైటిల్ సాంగ్‌తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా, ఇప్పుడు ట్రైలర్‌తో అంచనాలను మరింత పెంచేసింది.

"కోల్పోయిన ప్రతి వారి దగ్గర ఒక కథ ఉంటుంది" అనే డైలాగ్‌తో మొదలయ్యే ట్రైలర్ మొదటి క్షణం నుంచే కథలోకి తీసుకెళ్లింది. సంజన RJ & సింగర్. తనకి చుపులేదు.. మరోవైపు నడవలేని స్థితిలో ఉంటాడు రాజ్. ఈ రెండు పాత్రల మధ్య ప్రేమ కథని చాలా ఎంటర్టైనింగ్ అలాగే ఎమోషనల్ గా చెప్పారు డైరెక్టర్ విజయ్ ఆదిరెడ్డి.

ఈ కథని నేచురల్‌గా చూపించిన తీరు ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచింది. ఎక్కడా బలవంతపు డ్రామా లేకుండా, చిన్న చిన్న ఎమోషనల్ మూమెంట్స్‌తో కథను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది.

సూర్య వశిష్ట, దీప్షిక చంద్రన్ కెమిస్ట్రీ చాలా సహజంగా అనిపించింది. ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు, సంభాషణలు ట్రైలర్‌కు మంచి ఫీల్ తీసుకొచ్చాయి. ముఖ్యంగా సైలెంట్ ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి.

కోర్ట్ ఫేం రామ్ జగదీష్ రాసిన డైలాగ్స్ ట్రైలర్‌కు మరో బలం. కొన్ని మాటలు నేరుగా హార్ట్‌ను టచ్ చేసేలా ఉన్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu