Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రిసెప్షన్ లో భర్తను నోరెళ్ల బెట్టేలా చేసిన నటి!

రిసెప్షన్ లో భర్తను నోరెళ్ల బెట్టేలా చేసిన నటి!

Tupaki.com 1 week ago

గ్ర కథానాయికగా.. కోట్లాది మంది కలల రాకుమారిగా వెలిగిపోతున్న సమయంలోనే నటి మాధురీ దీక్షిత్ పెళ్లి సంచలన నిర్ణయంతో ఎన్నో హృదయాలను గాయ పరిచారు. 1999లో అమెరికాకు చెందిన కార్డియోవాస్కులర్ సర్జన్ డాక్టర్ శ్రీరామ్ నేనేను వివాహం చేసుకుని గ్లామర్ ప్రపంచానికి దూరంగా సాదాసీదా జీవితాన్ని గడపడానికి అమెరికాకు వెళ్ళిపోయారు.

అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే? పెళ్లి సమయానికి మాధురికి భారతదేశంలో ఉన్న క్రేజ్ కానీ, ఆమె స్టార్‌డమ్ కానీ డాక్టర్ నేనేకు అస్సలు తెలియదుట. ఆమె సినిమాలు కూడా ఆయన ఒక్కటి కూడా శ్రీరామ్ చూడలేదుట.

ఓ ఇంటర్వ్యూలో మాధురీ దీక్షిత్ వైవాహిక జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. లండన్‌లో పుట్టి, అమెరికాలో పెరగడం వల్ల శ్రీరామ్ నేనేకు హిందీ సినిమాలపై పెద్దగా అవగాహన ఉండేది కాదుట. పెళ్లి తర్వాత భర్తకు, ఆయన తల్లికి తన సినిమాను, ఒక పాటను చూపించడానికి మాధురి ప్రయత్నించినప్పుడు శ్రీరామ్ ఎంతో సున్నితంగా తిరస్కరించారుట. `మనం ఈ సినిమా చూడటం ఆపేసి, బయటకు వెళ్లి మరేదైనా చేద్దామా? అంటూ శ్రీరామ్ సినిమా చూడటానికి నిరాకరించినట్లు మాధురి నవ్వుతూ గుర్తు చేసుకున్నారు.

శ్రీరామ్ నేనేకు బాలీవుడ్ చిత్రాల పట్ల ఆసక్తి లేకపోయినా? మాధురి నటించిన క్లాసిక్ చిత్రం `దేవదాస్` మాత్రం ఆయనకు ఎంతో నచ్చిందని పేర్కొన్నారు. అయితే తన భార్య భారతదేశంలో ఎంతటి భారీ స్టార్ అనే విషయం ఆయనకు పెళ్లి రిసెప్షన్ సమయంలోనే మొదటిసారి అర్థమైంది. రిసెప్షన్‌కు వచ్చిన వేలాది మంది అభిమానులను, ప్రముఖులను చూసి శ్రీరామ్ ఆశ్చర్యపోయారు. అప్పుడు మాధురి ఆయనతో.. `ఈ క్యూ ఇక్కడితో అయిపోలేదు.. అది రోడ్డు అవతలి వరకు ఉంది` అని చెప్పినప్పుడు ఆయన నోరెళ్లబెట్టారని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే? బాలీవుడ్ ప్రముఖులతో నిండిపోయిన ఆ రిసెప్షన్ వేడుకలో డాక్టర్ నేనేకు తెలిసిన ఏకైక భారతీయ నటుడు అమితాబ్ బచ్చన్ మాత్రమే. చిన్నతనంలో ఆయన `అమర్ అక్బర్ ఆంటోనీ` సినిమా చూడటం వల్ల బిగ్ బిని మాత్రమే గుర్తుపట్టగలిగారుట. మిగిలిన అగ్ర నటీనటులు ఎవరైనా? ఆయనకు ఒక సాధారణ అతిథుల్లాగే కనిపించారుట. మహారాష్ట్రీయ కుటుంబ నేపథ్యం కావడం అక్కడ చదువుకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కూడా ఆయనకు సినిమాలతో పెద్దగా పరిచయం లేదని మాధురి వివరించారు.

స్టార్‌డమ్ అనే ఫిల్టర్ లేకుండా మాధురీని సాధారణ వ్యక్తిగా ఇష్టపడే భాగస్వామి దొరకడమే తన అదృష్టమని మాధురి భావించారు. ఎవరైనా తనను కలిస్తే సినిమాల్లో తన పాత్రలను బట్టి ఒక అంచనాకు వచ్చేస్తారని కానీ శ్రీరామ్ విషయంలో ఎలాంటి ముందస్తు అంచనాలు లేకపోవడం తనకు ఎంతో ఊరటనిచ్చిందన్నారు. అందుకే కెరీర్ పీక్స్‌లో ఉన్నా మాధురీ దీక్షిత్ ధైర్యంగా సినిమాలను వదిలి డెన్వర్‌లో సాధారణ గృహిణిలా ఇద్దరు పిల్లల తల్లిగా ప్రశాంతమైన జీవితాన్ని గడపగలుగుతున్నారు. గ్లామర్ వెలుగుల వెనుక పరిగెత్తే ప్రపంచంలో మాధురి-శ్రీరామ్ నేనేల బంధం ఎంతో ఆదర్శవంతమైనది. అయితే 2011లో ఇద్దరు ఇండియాకు తిరిగొచ్చారు.ప్రస్తుతం మాధురి సెకండ్ ఇన్నింగ్స్‌తో సినిమాల్లో బిజీగా ఉన్నారు. డాక్టర్ నేనే కూడా ఆమె కెరీర్‌కు పూర్తి మద్దతుగా నిలుస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu