Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సన్‌సెట్ లైట్‌లో సిమ్రాన్ చౌదరి గ్లామర్ షో వైరల్!

సన్‌సెట్ లైట్‌లో సిమ్రాన్ చౌదరి గ్లామర్ షో వైరల్!

Tupaki.com 1 week ago

న్‌సెట్ వెలుగులో మెరిసిపోతున్న అందం, కళ్ళతోనే కట్టిపడేసే అభినయం.. వెరసి సిమ్రాన్ చౌదరి లేటెస్ట్ ఫోటోషూట్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

బ్లష్ పింక్ డ్రెస్‌లో దేవకన్యలా మెరిసిపోతున్న ఈ ముద్దుగుమ్మ, తన గ్లామర్‌తో కుర్రకారు గుండెల్లో మంటలు పుట్టిస్తోంది. అటు సినిమాలతో, ఇటు సోషల్ మీడియా పోస్టులతో ఫుల్ బిజీగా ఉన్న ఈ 'ఈ నగరానికి ఏమైంది' బ్యూటీ గురించి మరిన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..

సన్‌సెట్ వెలుగులో సిమ్రాన్ సోయగం:

నటి సిమ్రాన్ చౌదరి సోషల్ మీడియాలో షేర్ చేసిన తాజా ఫోటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సూర్యాస్తమయం వేళ బంగారు రంగు వెలుగులో ఆమె మరింత ప్రకాశవంతంగా కనిపిస్తోంది. ఇక బ్లష్ పింక్ మ్యాక్సీ డ్రెస్‌లో చాలా సింపుల్‌గా, అంతే ఎలిగెంట్‌గా కనిపిస్తూ తన సహజ సిద్ధమైన అందాన్ని ప్రదర్శించింది. ఈ ఫోటోలు చూసిన వారెవరైనా సరే.. 'షీ ఈజ్ ఇన్ బ్లూమ్' అనాల్సిందే!

డిజైనర్ దుస్తుల్లో దేవకన్యలా..:

ఈ ప్రత్యేకమైన ఫోటోషూట్ కోసం సిమ్రాన్ ప్రముఖ డిజైనర్ 'నేహా రాజు' రూపొందించిన స్టైలిష్ అవుట్‌ఫిట్‌ను ఎంచుకుంది. మినిమల్ మేకప్, వదిలేసిన జుట్టుతో ఆమె లుక్ చాలా రిఫ్రెషింగ్‌గా ఉంది. ప్రముఖ ఫోటోగ్రాఫర్ సుజన ఈ ఫోటోలను అత్యద్భుతంగా క్లిక్ మనిపించారు. ఆమె ఇచ్చే గ్రేస్‌ఫుల్ ఎక్స్‌ప్రెషన్స్ చూసి అభిమానులు మంత్రముగ్ధులవుతున్నారు.

తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ క్రేజ్:

సిమ్రాన్ చౌదరి గురించి మనందరికీ తెలిసిందే. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన 'ఈ నగరానికి ఏమైంది' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తన మొదటి సినిమాతోనే యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఆ తర్వాత 'సెహరి' వంటి చిత్రాల్లో నటించి, తన నటనతో మంచి ప్రశంసలు అందుకుంది. అందం, అభినయం రెండు కూడా ఆమెకు ఆఫర్లు క్యూ కట్టటానికి ఓ దరి వేసాయి అంతం లో ఆశ్చర్యం లేదు.

మిస్ ఇండియా టు మూవీ స్టార్:

సిమ్రాన్ కేవలం నటి మాత్రమే కాదు, ప్రొఫెషనల్ మోడల్ కూడా. ఆమె 'మిస్ ఇండియా తెలంగాణ 2017' రన్నరప్‌గా నిలిచింది. మోడలింగ్ రంగంలో ఉన్న అనుభవంతో కెమెరా ముందు చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తుంది. గత ఏడాది క్రితం 'లవ్ మీ' సినిమాతో అలరించిన ఈ భామ, ప్రస్తుతం మరిన్ని క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతోంది.

వనవీర మూవీ కోసం వెయిటింగ్:

ఇటీవల జనవరి లో రిలీజ్ ఐన చిత్రం 'వనవీర' లో సిమ్రాన్ చౌదరి ఇందు అనే పవర్ ఫుల్ పాత్రలోనటించి మెప్పించింది. ఈ సినిమాతో సిమ్రాన్ తన కెరీర్‌లో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటుంది.

సిమ్రాన్ చౌదరి గ్లామర్‌కే కాకుండా, భిన్నమైన పాత్రల్లోనూ తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. లేటెస్ట్ ఫోటోషూట్‌తో ఫ్యాషన్ ప్రియులకు కొత్త గోల్స్ ఇస్తూనే, సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu