Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సరైన డేట్‌ కే 'జన నాయగన్'.. ఫ్యాన్స్‌ కు డబుల్ ఫెస్టివల్?

సరైన డేట్‌ కే 'జన నాయగన్'.. ఫ్యాన్స్‌ కు డబుల్ ఫెస్టివల్?

Tupaki.com 3 days ago

కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు సీఎం దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం జన నాయగన్ విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా సెన్సార్ సమస్యలు, రాజకీయ చర్చలు, రిలీజ్ డేట్‌ పై అనేక ఊహాగానాల మధ్య నిలిచిపోయిన ఆ సినిమా ఇప్పుడు మళ్లీ ట్రాక్‌ లోకి వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.

ముఖ్యంగా జూన్ 22 రిలీజ్ డేట్ ఫైనల్ అయ్యే అవకాశాలు కనిపిస్తుండటంతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

హెచ్ వినోత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ పొలిటికల్ యాక్షన్ డ్రామా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఎన్నికలకు ముందే దాదాపు అన్ని పనులు ముగిసినా, సెన్సార్ ఇష్యూస్ విడుదలను ఆలస్యం చేశాయి. కొన్ని డైలాగులు, సీన్లకు సంబంధించిన అంశాలపై అభ్యంతరాలు రావడంతో సినిమా రివైజింగ్ కమిటీకి వెళ్లినట్లు సమాచారం. ఇప్పుడు ఆ కమిటీ నుంచి గ్రీన్ సిగ్నల్ రానుండడంతో విడుదలకు లైన్ క్లియర్ అయినట్లే.

ఈ వీకెండ్‌ లోగా మేకర్స్‌ కు సెన్సార్ సర్టిఫికేట్ అందే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఆ వెంటనే కొత్త రిలీజ్ డేట్‌ ను అధికారికంగా ప్రకటించేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. జూన్ 22న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. దీంతో ఫ్యాన్స్ కు డబుల్ ఫెస్టివల్ అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.

డబుల్ ఫెస్టివల్ ఎందుకంటే.. జూన్ 22న విజయ్ బర్త్ డే. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది మొదటి పుట్టినరోజు కావడం విశేషం. అందుకే అభిమానులు ఈసారి బర్త్‌ డేను మరింత గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. అదే రోజు జన నాయగన్ విడుదలైతే పొలిటికల్ విక్టరీ, సినిమా ఫెస్టివల్ రెండూ కలిసి అభిమానులకు డబుల్ ట్రీట్‌ లా మారే అవకాశముంది. అందుకే మేకర్స్ కూడా ఆ డేట్‌ పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక విజయ్‌ కు సంబంధించిన మరో ఆసక్తికర విషయం కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యమంత్రిగా మారిన తర్వాత ఆయన పేరుకు ముందు దళపతి బదులు ముఖ్యమంత్రి అనే ట్యాగ్ వేయాలని నిర్మాతలు భావించినట్టు సమాచారం. అయితే విజయ్ మాత్రం ఆ ప్రపోజల్ ను తిరస్కరించారట. తనను ఈ స్థాయికి తీసుకొచ్చింది సినిమా ప్రేక్షకులే కాబట్టి, అభిమానులు ప్రేమగా పిలిచే దళపతి అనే ట్యాగ్‌ ను అలాగే కొనసాగించాలని స్పష్టం చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

అంతేకాదు, పొలిటికల్ ఇమేజ్ దృష్ట్యా కొన్ని పవర్‌ ఫుల్ డైలాగులు, ఇంట్రడక్షన్ ఎలిమెంట్స్ మార్చాలన్న సూచనలకు కూడా విజయ్ అంగీకరించలేదని చెబుతున్నారు. సినిమా అనేది సినిమా గానే ఉండాలని, పొలిటికల్ ప్రమోషన్ స్టేజ్ గా కనిపించకూడదనే ఉద్దేశంతో ఆయన నిర్ణయం తీసుకున్నారన్న చర్చ జరుగుతోంది. అయితే కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఆ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మరి జూన్ 22 నే ఫైనల్ డేట్‌ గా ప్రకటిస్తారా? లేక మార్పు ఉంటుందా? అన్నది వేచి చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu