Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సేనా గళం...పవన్ మార్క్ భారీ వ్యూహం !

సేనా గళం...పవన్ మార్క్ భారీ వ్యూహం !

Tupaki.com 1 week ago

నసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఆయన సేనా గళం పేరుతో కొత్త వింగ్ ని పార్టీలో ప్రారంభించారు. అంతే కాదు కమిటీలను కూడా ప్రకటించారు.

ఇదిపుడు సంచలన పరిణామంగా మారింది. ఒక ట్రెడిషనల్ పార్టీలో ఈ తరహా వింగ్ ఏర్పాటు అన్నది కొత్త వ్యూహమే అని అంటున్నారు అంతే కాదు భవిష్యత్తు రాజకీయాన్ని ముందే ఊహించి తీసుకున్న నిర్ణయం అని తెలివైన ఎత్తుగడ అని కూడా అంటున్నారు. కాస్తా విడమరచి చెప్పాలంటే నిజం చెప్పాలి అంటే ఏపీలో ఉన్న ఇతర రాజకీయ పార్టీల కంటే ఆయన తనదైన ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు.

కీలక పరిణామాలు :

జెన్ జీ తరాన్ని దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన సేనా గళం కమిటీల ద్వారా ఏపీ రాజకీయాలు కొత మలుపు తిరుగుతాయని భావిస్తున్నారు. అలాగే దీనివల్ల ఏపీ రాజకీయాల్లో కీలకమైన పరిణామాలు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయని కూడా అంటున్నారు. ప్రస్తుతం చూస్తే దేశంలో జెన్ జీ హవా సాగుతోంది. వీరే రేపటి రాజకీయాన్ని శాసించబోతున్నారని కూడా అర్థం అవుతుంది. ఉదాహరణ కావలిస్తే పొరుగున ఉన్న తమిళనాడులో విజయ్ ఘన విజయం సాధించడం వెనక జెన్ జీ గ్యాంగ్ ఉందని పెద్ద ఎత్తున విశ్లేషణ వినిపించాయి. ఈ నవ యువతరాన్ని ఒడిసి పట్టుకుంటే రాజకీయంగా తిరుగులేని శక్తిగా మారవచ్చు అని ఇప్పటికే విజయ్ తన టీవీకే పార్టీ ద్వారా తమిళనాడులో నిరూపించారు. విజయ కోసం, ఆయన నాయకత్వం కోసం, ఆయన అధికారం కోసం జెన్ జీ తరం అక్కడ ఉర్రూతలూగింది. వారు సృష్టించిన సరికొత్త సునామి సైతం దేశవ్యాప్తంగా చర్చకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో అందరి ఆలోచనలు జెన్ జీ వైపుగా సాగాయి. కానీ వారి శక్తిని రాజకీయంగా పదునైన ఆయుధంగా వాడుకోవాలని ఆలోచన మాత్రం జనసేన చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

యూత్ అట్రాక్షన్ గా :

ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెండి తెర మీద పవర్ స్టార్. ఆయనను చూస్తేనే అభిమాన గణం ఉత్సాహం ఉరకలు వేస్తుంది. అలా పవన్ కళ్యాణ్ అంటే ఎటు యువత పెద్ద ఎత్తున ఆకర్షిస్తారు. అయితే అది సినీ అభిమానం. దానిని పార్టీ సిద్ధాంత పరంగా మార్చి క్షేత్రస్థాయిలో మలచుకుంటే జనసేనకు బలమైన పునాదులు పడతాయని అవి చిరకాలం నిలుస్తాయని పవన్ కళ్యాణ్ వ్యూహరచన చేస్తున్నారు. అందులో భాగమే జనసేనలో సేనా గళం. అంటే రానున్న కాలంలో జనసేనలో ఇది జెన్ జీ గళంగా పెద్ద ఎత్తున వినిపిస్తుంది అన్నమాట. ఈ జెన్ జీ సునామీని ఏపీ రాజకీయాల్లో జనసేనకు అనుకూలంగా వినియోగించుకోవాలని ఆ పార్టీ వ్యూహకర్తలు సైతం అభిప్రాయపడుతున్నారు.

సానుకూలంగా మార్చుకుంటూ :

ఇక్కడొక విషయం ఉంది. తమిళనాడులో విజయ్ సాధించిన ఘన విజయం జనసేన పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడేలా చేస్తుందని అంతా అనుకున్నారు. జనసేన ప్రత్యర్ధులు అయితే విజయ్ తో పోల్చి పవన్ మీద చేసిన విమర్శల ద్వారా మరింత కృంగదీయాలని అనుకున్నారు. కానీ ఇపుడు జనసేన నాయకత్వం ఈ పోలికనే తమకు సానుకూలంగా వినియోగించుకోవడానికి చూడడం విశేషం. విజయ్ సాధించిన విజయాల వెనక ఉన్న జెన్ జీ శక్తిని ఏపీలో కూడా జంఝామారుతంగా బలంగా వీచేలా చేసుకోవాలని పవన్ కళ్యాణ్ ఉద్దెశ్యం పడుతున్నట్లుగా తోస్తోంది. ఆ విధంగా జనసేనలో సేనా గళం ద్వారా భారీ వ్యూహరచన చేసినట్లుగా కనిపిస్తోంది. . ఇది నిజంగా విజయవంతమైతే జనసేనకు తిరుగు లేదని చెప్పవచ్చు. అసలే యువతరం ఎక్కువగా ఆకర్షించే పార్టీ జనసేన అన్నది తెలిసిందే. ఇప్పుడు వారిని పార్టీలో కీలకం చేస్తూ జెన్ జీ తరాన్ని ముందుకు తోస్తూ ఆ పార్టీ చేస్తున్న ప్రయోగాలు ముందు ముందు ఏపీలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చూడాల్సిందే. ఏది ఏమైనా జనసేళలో సేనా గళం మాత్రం సంచలంగా మారే అవకాశాలు అధికంగా ఉన్నాయని అంటున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu