Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'సేయోన్'లో SK రగ్డ్ లుక్.. కమల్ ప్లాన్ ఏంటి?

'సేయోన్'లో SK రగ్డ్ లుక్.. కమల్ ప్లాన్ ఏంటి?

Tupaki.com 6 days ago

చాలా కష్టపడి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు హీరో శివకార్తికేయన్. అతని సినిమాలో కాంటెంట్ రెగ్యులర్ గా అయితే ఉండదని ఆడియెన్స్ లో ఒక నమ్మకాన్ని ఏర్పరచుకున్నాడు.

అలాగని వెండితెరకు ఎక్కువగా గ్యాప్ తీసుకోవడం లేదు. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా అదే స్పీడ్ .మెయింటైన్ చేస్తున్నాడు. ఒక సినిమా తేడా కొట్టినా మళ్ళీ వెంటనే మరో సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.

ఇక ఇతని కొత్త సినిమాపై గత కొన్ని రోజులుగా అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఫైనల్ గా ఆ న్యూ ప్రాజెక్టు 'సేయోన్' పై అఫీషియల్ గా మరో క్లారిటీ ఇచ్చారు. షూటింగ్ ఈరోజు స్టార్ట్ అయింది. రూరల్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌ని శివకుమార్ మురుగేసన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ కాంబో ఇంతకు ముందు 'తాయ్ కిజవి' చేసింది. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టడమే కాదు, శివకార్తికేయన్ స్వయంగా నిర్మించాడు.

ఇప్పుడు మళ్లీ అదే టీమ్, కానీ ఈసారి డైరెక్టర్ హీరోగా కలుస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ వెనక ఉన్న పెద్ద సపోర్ట్ కమల్ హాసన్. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై సినిమాను నిర్మిస్తున్నాడు. 'అమరన్' తర్వాత శివకార్తికేయన్‌తో కమల్‌కి ఇది రెండో సినిమా. అందుకే బడ్జెట్, స్కేల్ మీద కాంప్రమైజ్ లేదని తెలుస్తోంది. టీమ్ ప్లాన్ ప్రకారం బ్రేక్ లేకుండా ఒకే షెడ్యూల్‌లో షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నారు.

లొకేషన్ మార్పులు, గ్యాప్‌లు వల్ల ఫ్లో దెబ్బతినకుండా ఇలా డిసైడ్ అయ్యారు. విలేజ్ నేటివిటీ మిస్ కాకుండా సెట్‌లోనే కంటిన్యూటీ మెయింటైన్ చేస్తారు. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే సినిమా టోన్ అర్థమవుతుంది. శివకార్తికేయన్ దట్టమైన గడ్డం, సీరియస్ చూపుతో కనిపిస్తున్నాడు. మొహం పక్కనే పెద్ద మంట ఉంది. దీన్ని బట్టి ఇది సాఫ్ట్ కథ కాదు, హార్డ్‌కోర్ యాక్షన్ డ్రామా అని చెప్పొచ్చు.

గతంలో లవర్ బాయ్, కామెడీ రోల్స్ చేసిన SK ఇప్పుడు పూర్తిగా మాస్‌ని టార్గెట్ చేస్తున్నాడు. మావీరన్, అమరన్ లాంటి సినిమాల తర్వాత ఈ ట్రాన్స్ఫర్మేషన్ కావాలనే చేస్తున్నట్టు కనిపిస్తోంది. మ్యూజిక్ సంతోష్ నారాయణన్ అందిస్తున్నాడు. 'కబాలి', 'కాలా' లాంటి రా సౌండ్ ఇచ్చిన అతను, ఈసారి పల్లెటూరి కథకు ఎలాంటి ట్యూన్స్ ఇస్తాడో చూడాలి.

DOP వివేక్ విజయకుమార్, యాక్షన్ సుప్రీమ్ సుందర్ టీమ్‌లో ఉన్నారు. అంటే విజువల్స్, ఫైట్స్ రెండూ గ్రౌండెడ్‌గా, రియలిస్టిక్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. 'సేయోన్' మీద ఇప్పటికే బజ్ మొదలైంది. షూటింగ్ మొదలైన రోజే పోస్టర్‌తో టెంపర్ సెట్ చేశారు. ఇక కంటెంట్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందో థియేటర్‌లో తేలాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu