Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
షాక్: కోడలి పొట్టి డ్రెస్సులు.. అత్తమామలు ఆత్మహత్య!

షాక్: కోడలి పొట్టి డ్రెస్సులు.. అత్తమామలు ఆత్మహత్య!

Tupaki.com 1 week ago

విన్నంతనే షాక్ కు గురి చేసే ఉదంతంగా దీన్ని చెప్పాలి. సామాజికంగా వస్తున్న మార్పుల వేళ.. సమాజంలో ఎలాంటి విషాదాలు చోటు చేసుకుంటాయన్న దానికి నిదర్శనంగా ఈ ఘటనను చెప్పాలి.

హర్యానాలోని పానిపట్ జిల్లాలో చోటు చేసుకున్న ఒక విషాద ఉదంతం నోట మాట రానివ్వని రీతిగా మారింది. సోషల్ మీడియాలో తమ ఉనికిని చాటుకునేందుకు పలువురు ఎంతలా తపిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో ఈ పిచ్చ పీక్స్ కు చేరటమే కాదు.. పలు కుటుంబాల్లో కొత్త చిచ్చుకు కారణమవుతోంది. ఇప్పుడు చెప్పే విషాదం కూడా ఆ కోవకు చెందిందే.

పొట్టి డ్రెస్సులతో కోడలు చేసే ఇన్ స్టా రీల్స్ .. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన అత్తమామల తీరుతో మొదలైన పంచాయితీ.. చివరకు కోడలి తీరుకు తీవ్రంగా వేదనకు గురయ్యారు. ఈ ఉదంతంలోకి వెళితే.. హర్యానాలోని నారా గ్రామానికి చెందిన 46 ఏళ్ల రాజేష్, 44 ఏళ్ల సుమన్ దంపతులు. వీరికి ఆశీష్ అనే కొడుకు ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా తనకు పరిచయమైన ఢిల్లీకి చెందిన స్నేహ అనే యువతిని ప్రేమించిన ఆశీష్ గత ఏడాది జనవరిలో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు.

ఇక్కడివరకు అంతా సజావుగానే సాగినా.. ఇక్కడే కల్చరల్ తేడాలు మొదలయ్యాయి. అబ్బాయి గ్రామీణ ప్రాంత నేపథ్యంలో పెరిగిన కుటుంబానికి చెందిన వాడు కాగా.. అమ్మాయి ఢిల్లీ లాంటి కాస్మో సిటీలో పెరిగారు. ఆమెకు సోషల్ మీడియాలో రీల్స్ చేయటం హబీ. ఆమె జీవనవిధానం.. ఆమె ధరించే డ్రెస్సుల విషయంపై అత్తమామలు అభ్యంతరం వ్యక్తం చేసేవారు. ఈ క్రమంలో అత్త - కోడలకు మధ్య పలుమార్లు వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. చివరకు అవి కాస్తా కుటుంబ కలహాలుగా మారాయి.

ఈ నేపథ్యంలో స్నేహకు మద్దతుగా ఆమె తల్లిదండ్రులు.. సోదరి కూడా కలవటంతో ఆశీష్ తల్లిదండ్రులకు పెద్ద ఇబ్బందిగా మారింది. అత్తమామల అభ్యంతరాలకు స్పందనగా వారి మీద భౌతికదాడికి పాల్పడినట్లుగా కోడలి మీద ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తీవ్ర మనోవ్యధకు గురైన రాజేష్ దంపతులు విషం తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే.. వీరిని అపస్మారక స్థితిలో గుర్తించిన స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి చేర్చారు. అప్పటికే వీరి ప్రాణాలు పోయాయి. ఈ నేపథ్యంలో రాజేష్ సోదరుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా స్నేహ.. ఆమె తల్లిదండ్రులు.. సోదరిపైనా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ప్రస్తుతానికి ఈ నలుగురు పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. స్థానిక మీడియాతో పాటు.. జాతీయ మీడియాలోనూ ఈ ఉదంతం పెద్ద ఎత్తున రావటంతో ఇప్పుడు ఈ విషాద ఉదంతం వైరల్ గా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu