Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
షాపింగ్ చేశాక బ్యాగ్ మోయలేకపోతున్నారా? అయితే మీకో శుభవార్త!

షాపింగ్ చేశాక బ్యాగ్ మోయలేకపోతున్నారా? అయితే మీకో శుభవార్త!

Tupaki.com 3 days ago

షాపింగ్ చేయడం అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు.. ఈ మధ్యకాలంలో ఎన్ని ఈ -కామర్స్ సంస్థలు అందుబాటులోకి వచ్చిన సరే.. భాగస్వామితో లేదా స్నేహితులతో లేదా నచ్చిన వారితో కలిసి బయటకు వెళ్లి నచ్చిన వస్తువులను షాపింగ్ చేయడం అంటే ఆ మజాయే వేరు..

అందుకే ఎన్ని షాపింగ్ సైట్స్ అందుబాటులోకి వచ్చినా సరే.. బయటకు వెళ్లి కచ్చితంగా షాపింగ్ చేయాలని కోరుకునేవారు కూడా చాలామంది ఉంటారు. మరి షాపింగ్ చేయడం ఒక ఎత్తు అయితే ఆ షాపింగ్ చేసిన వస్తువులను ఇంటికి తీసుకురావడం మరో ఎత్తు.. అందుకే ఈ వస్తువులను తీసుకెళ్లడానికి ఎవరైనా ఒకరు తోడుగా ఉంటే బాగుండు అని కోరుకునేవారు కూడా లేకపోలేదు.

అలాంటి వారి కోసమే ఇప్పుడు ఒక కొత్త సర్వీస్ అందుబాటులోకి వచ్చింది . "మీరు షాపింగ్ చేయండి.. మీ వస్తువులను మేము జాగ్రత్తగా మీ ఇంటికి తీసుకొస్తాం" అంటూ ఒక కొత్త ట్రెండ్ పుట్టుకొచ్చింది. ప్రస్తుతం ఈ విషయం అంతటా పాకి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ఈ మధ్యకాలంలో ఈ - కామర్స్ సంస్థలు అందుబాటులోకి వచ్చిన తర్వాత.. కొత్త కొత్త ట్రెండ్ లో కూడా పుట్టుకొస్తున్నాయి. బిజీ బిజీ లైఫ్ స్టైల్ లో మనకంటూ ఒక సమయాన్ని కేటాయించుకోవడం ఒక ఎత్తు అయితే.. ఇంటిని శుభ్రపరచుకోవడం, వంట చేయడం మరో ఎత్తు . అందుకే ఇలాంటి వారికోసం ఇంటిని శుభ్రం చేయడం , వండడం లాంటి సేవలు అందుబాటులోకి వచ్చాయి. అలాగే ఇప్పుడు క్యారీ బ్యాగ్ సర్వీస్ కూడా అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా బరువైన సంచి పట్టుకుంటే అలసిపోతామేమో అని భయపడే సుకుమారుల కోసం ఈ కొత్త కల్చర్ పుట్టుకొచ్చిందని చెప్పాలి.

ముఖ్యంగా మార్కెట్లో క్యారీ బ్యాగ్ మోసే సర్వీస్ ఢిల్లీలో అందుబాటులోకి రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. పైగా మీరు షాపింగ్ చేయండి.. మీ బ్యాగ్స్ మేము మోస్తాం అంటూ వచ్చిన ఈ సర్వీస్ చూసి కొందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సేవలు మెట్రో నగరాలలో ఊపందుకుంటున్న నేపథ్యంలో కొంతమంది నిపుణులు హెచ్చరిస్తున్నారు. సర్వీసులనేవి మనకి అనుకూలంగా ఉండాలే కానీ మనుషుల్ని మరింత సున్నితంగా మార్చేయకూడదు అని హెచ్చరిస్తున్నారు. ఇంత సున్నితంగా సుకుమారంగా జీవిస్తే భవిష్యత్తులో మరిన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు అంటూ హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా ఉద్యోగానికి ఏది అనర్హం కాదు అని ఇలాంటి సర్వీస్ లు నిరూపిస్తుంటే వీటివల్ల ఇబ్బందులు తప్పవు అని నిపుణులు చెబుతున్నారు. చూస్తుంటే రాను రాను ఇంకెలాంటి సర్వీస్ లు అందుబాటులోకి వస్తాయో తెలియాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu