మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌లలో ఒకటైన `భారతీయుడు 3` విడుదలపై కోలీవుడ్ సహా టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. దర్శకుడు శంకర్ అండ్ కో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నెలలో థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే అదే సమయానికి బాక్సాఫీస్ వద్ద పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ ఉన్న సినిమాలు క్యూ కడుతుండటం ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తిని మరింత పెంచుతోంది.
ఇదే మార్చి- ఏప్రిల్ సీజన్లో బాక్సాఫీస్ బరిలో దిగేందుకు `స్పిరిట్`, `వారణాసి`, `ఫోర్స్` వంటి ప్రతిష్టాత్మక చిత్రాలు సిద్ధమవుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈ రేంజ్ సినిమాలతో పోటీ పడటం ఏ సినిమాకైనా కత్తి మీద సామే చెప్పాలి. ఈ నేపథ్యంలో శంకర్ ఇలాంటి భారీ చిత్రాల మధ్య `ఇండియన్ 3`ని నేరుగా పోటీకి దింపుతారా? లేక ఎలాంటి రిస్క్ లేకుండా సేఫ్ జోన్ ఎంచుకుని సరైన సోలో రిలీజ్ డేట్‌ను వెతుక్కుంటారా? అనేది ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
`భారతీయుడు 2 ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోవడం.. బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన తెచ్చుకోవడం శంకర్‌కు గట్టి ఎదురుదెబ్బే తగిలింది. కానీ ఆ సినిమా ముగింపులో ` ఇండియన్3` కోసం శంకర్ ఇచ్చిన లీడ్స్, చూపించిన విజువల్స్ , ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. మొదటి భాగం `భారతీయుడు` సృష్టించిన మ్యాజిక్‌ను.. ఆ నాటి భావోద్వేగాలను శంకర్ మూడో భాగంతో మళ్లీ రిపీట్ చేయగలడనే పాజిటివ్ యాంగిల్ తెరపైకి వస్తోంది.
కమల్ హాసన్ నటన, శంకర్ టేకింగ్, విజిలెంజ్ కాన్సెప్ట్ ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకునేవే. `ఇండియన్ 2`లో నిరాశపరిచిన అంశాలను సరిదిద్దుకుని... కంటెంట్ ..డ్రామాపైనే శంకర్ పూర్తి దృష్టి పెట్టారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. సేనాపతి పాత్రలో కమల్ హాసన్ చూపించే మేథస్సు, యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాపై అంచనాలను నిలబెడుతున్నాయి. మొదటి భారతీయుడి స్థాయిని ఇండియన్ 3 గుర్తుచేస్తే మాత్రం బాక్సాఫీస్ రికార్డులు తల్లకిందులవడం ఖాయం. అందులో ఎలాంటి సందేహం లేదు.
మరోవైపు భారీ బడ్జెట్ సినిమాలైన `స్పిరిట్`, `వారణాసి` లాంటి చిత్రాలు కూడా అదే సీజన్‌ను టార్గెట్ చేయడం వల్ల థియేటర్ల విభజన, కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. శంకర్ ఈ పోటీని తట్టుకుని నిలబడాలంటే? ప్రమోషన్ల వ్యూహం చాలా బలంగా ఉండాలి. పోటీ తీవ్రంగా ఉన్నా? సినిమాకు పాజిటివ్ టాక్ కనుక వస్తే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి పెద్ద సినిమానైనా ఎదుర్కొనే సత్తా ` ఇండియన్ 3`కి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అంతిమంగా `భారతీయుడు 3` విడుదల వ్యూహం శంకర్ కెరీర్‌కు అత్యంత కీలకంగా మారింది. కంఫర్ట్ జోన్లో సేఫ్‌గా వెళ్లాలా లేక బాక్సాఫీస్ వార్‌లో సంచలనం సృష్టించాలా? అన్న దానిపై త్వరలోనే పూర్తి స్పష్టత రానుంది. `భారతీయుడి`ని మరిపించేలా శంకర్ ఈసారి ఎలాంటి అద్భుతం చేస్తారో? చూడాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

