Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
షర్మిల సైలెంట్ కాదు.. వైలెంటే.. !

షర్మిల సైలెంట్ కాదు.. వైలెంటే.. !

Tupaki.com 4 days ago

టీవల కాలంలో తన సోదరుడిపై దూకుడు తగ్గించిందని.. ఇకపై.. పార్టీపరంగానే దృష్టి పెడుతుందని.. వైసీపీపై పెద్దగా విమర్శలు చేయబోదని భావించిన షర్మిల..

తాజాగా వైసీపీకి భారీ షాకే ఇచ్చారు. నిజానికి ఇటీవల కాలంలో షర్మిల దూకుడు తగ్గించిన విషయం వాస్తవమే. రాష్ట్రస్థాయి సమస్యలను ఎక్కువగా ప్రస్తావించారు. అమరావతికి నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు హైటు వంటి అంశాలను ప్రధానంగా ఇటీవల కాలంలో ఆమె ప్రస్తావించారు.

దీంతో వైసీపీ నాయకులు, శ్రేణులు కూడా.. `అక్క`ఇక, మా జోలికి రాదులే` అని అనుకున్నారు. కానీ.. అలా అయితే.. షర్మిల ఎలా అవుతుందని అనుకున్నారో.. ఏమో..వైసీపీ నాయకులకు, ముఖ్యంగా జగన్‌కు షాకిస్తూ.. షర్మిల దూసుకువచ్చారు. తాజాగా వైసీపీ నుంచి కొందరు క్షేత్రస్థాయి కార్యకర్తలు, దిగువ శ్రేణి నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. పార్టీ కండువాలు కప్పారు. వారి స్థాయి ఏంటి? పెద్ద వారా? చిన్నవారా? అనేది పక్కన పెడితే.. కాంగ్రెస్‌లో చేరికలు వైసీపీని ఇరుకున పెట్టాయి.

అంతేకాదు.. ఈ సందర్భంగా షర్మిల చేసిన వ్యాఖ్యలు కూడా.. అందరినీ విస్మయానికి గురి చేశాయి. గతంలోనూ ఈ విషయాన్ని ఆమె ప్రస్తావించినా.. ఇప్పుడు మరింత సూటిగా.. సుత్తి లేకుండా స్పందించే సరికి.. అందరూ విస్మయానికి గురయ్యారు. వైఎస్ రాజశేఖరరెడ్డి వారసత్వాన్ని మరోసారి షర్మిల తెరమీ దికి తెచ్చారు. తద్వారా.. తన మనసులోని మాటను కూడా ఆమె చెప్పారు. ప్యాలెస్‌లో పడుకుంటేనో.. బటన్‌లు నొక్కితేనో.. వైఎస్‌కు వారసులు కారంటూ.. పరోక్షంగా జగన్‌పై సూటి విమర్శలే గుప్పించారు.

అంతేకాదు.. వైఎస్ వారసులు అంటే.. ప్రజల మధ్య ఉండాలని.. ప్రజల కోసం తపించాలని.. వారి కోసం జీవించాలని వ్యాఖ్యానించారు. తద్వారా మరోసారి వైఎస్ వారసత్వాన్ని షర్మిల ప్రధాన అస్త్రంగా చేసు కున్నారు. ఇక, పాదయాత్రపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. పాదయాత్రలు చేస్తే ముఖ్యమంత్రులు కాలేరని వ్యాఖ్యానించారు. ఇది నేరుగా జగన్‌ను ఉద్దేశించే కావడం గమనార్హం. వచ్చే ఏడాది పాదయాత్ర ప్రారంభి స్తున్న దరిమిలా.. జగన్‌ను ఉద్దేశించి షర్మిల ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం. సో.. మొత్తంగా షర్మిల సైలెంట్ అయితే.. కాదు, వైలెంటేనని తేలిపోయింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu