Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
షర్ట్‌లెస్ పిక్‌పై మాజీ ప్రియురాలి క్రేజీ కామెంట్స్!

షర్ట్‌లెస్ పిక్‌పై మాజీ ప్రియురాలి క్రేజీ కామెంట్స్!

Tupaki.com 5 days ago

బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ - బాక్సాఫీస్ స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వయసుతో సంబంధం లేకుండా నిరంతరం బాడీ ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ యువ హీరోలకు సైతం గట్టి పోటీనిస్తుంటారు.

తాజాగా సల్మాన్ ఖాన్ సోషల్ మీడియా హ్యాండిల్‌లో పంచుకున్న ఓ షర్ట్‌లెస్ ఫోటో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. సిక్స్ ప్యాక్ అబ్స్‌తో ఉన్న పిక్‌ను చూసిన నెటిజన్లు, అభిమానులు ఆయన ఫిట్‌నెస్‌కు ఫిదా అవుతు న్నారు. ఈ నేపథ్యంలో సల్మాన్ మాజీ ప్రియురాలు చేసిన ఓ కామెంట్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

సల్మాన్ ఖాన్ షేర్ చేసిన లేటెస్ట్ హాట్ పిక్‌పై మాజీ గర్ల్‌ఫ్రెండ్ మాజీ మిస్ ఇండియా సంగీతా బిజ్లానీ ఎంతో ఆసక్తికరంగా స్పందించారు. ఈ వయసులో కూడా సల్మాన్ ఇంతటి పర్‌ఫెక్ట్ బాడీ షేప్‌ను మెయింటైన్ చేయడంపై ప్రశంసలు కురిపించారు. ఇద్దరు గతంలో సుదీర్ఘ కాలం పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్న సంగతి తెలిసిందే. పెళ్లి పీటల వరకు వెళ్లిన బంధం కొన్ని కారణాల వల్ల బ్రేకప్‌తో ముగిసినా? ఇప్పటికీ వారి మధ్య మంచి స్నేహబంధం కొనసా గుతోందని సంగీతా బిజ్లానీ చేసిన తాజా కామెంట్స్ మరోసారి నిరూపించాయి.

ఈ ఫోటో చూసిన ఇండస్ట్రీ వర్గాలు - నెటిజన్లు సల్మాన్ ఖాన్‌కు 60 ఏళ్లు అంటే నమ్మలేకపోతున్నామంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సాధారణంగా ఆరు పదుల వయసులో శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడం ఎవరికైనా పెద్ద సవాలే. కానీ సల్మాన్ మాత్రం నిత్యం జిమ్‌లో కఠినమైన వర్కవుట్లు చేస్తూ క్రమశిక్షణతో కూడిన డైట్ పాటిస్తూ ఫిజిక్‌ను ఇరవై ఏళ్ల యువకుడిలా ఉంచుకోవడం పట్ల నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వయసు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమేనని సల్మాన్ నిరూపించారని అభిమానులు కొనియాడుతున్నారు.

సినిమా సెలబ్రిటీల పర్సనల్ లైఫ్‌లో బ్రేకప్స్ అయిన తర్వాత ఒకరినొకరు శత్రువులుగా చూసుకోవడం లేదా దూరంగా ఉండటం చూస్తుంటాం. కానీ సల్మాన్ ఖాన్, సంగీతా బిజ్లానీల విషయంలో మాత్రం సీన్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా సల్మాన్ ఖాన్ ఇంట్లో జరిగే ప్రతీ ఫ్యామిలీ ఈవెంట్‌లోనూ, పండగ వేడుకల్లోనూ సంగీతా బిజ్లానీ ప్రత్యేక అతిథిగా కనిపిస్తూనే ఉన్నారు. పాత చేదు జ్ఞాపకాలను పక్కన పెట్టి, ఒకరినొకరు గౌరవించుకుంటూ మెచ్యూర్డ్‌గా ప్రవర్తించే వీరి బాండింగ్ బాలీవుడ్‌లో ఎప్పుడూ రేర్ కాంబినేషన్‌గా నిలుస్తుంది.ప్రస్తుతం సల్మాన్ ఖాన్ రాబోయే యాక్షన్ ఎంటర్‌టైనర్స్ -భారీ బడ్జెట్ చిత్రాల షూటింగ్స్‌తో బిజీగా గడుపుతున్నారు. ఈ వయసులోనూ స్క్రీన్ ప్రెజెన్స్ కోసం ఆయన పడుతున్న శ్రమ, మెయింటైన్ చేస్తున్న ఎనర్జీ లెవెల్స్ చూసి తోటి నటీనటులు సైతం ఇన్‌స్పైర్ అవుతుంటారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu