Wednesday, 05 Aug, 10.05 am Tupaki.com

మూవీ న్యూస్
శృంగార నాయిక నుంచి అది కొట్టేసిందట

దీపం ఉండగానే చక్కబెట్టుకోవాలి! వరుస సినిమాలతో జోరు చూపించినప్పుడే వాణిజ్య ప్రకటనల ఆఫర్లు అందిపుచ్చుకోవాలి. క్రేజు మసకబారక ముందే ఏదైనా! సినిమా ఆఫర్ అయినా.. బ్రాండ్ ప్రమోషన్ అయినా కొన్నాళ్ల వరకే ఆ జోరు. ఈ సూత్రాన్ని బాగా అవగతం చేసుకుంది ఆ సౌత్ స్టార్ హీరోయిన్. అందుకే ఇప్పుడు ఓ లోదుస్తుల కంపెనీ ఆఫర్ ని కాదనలేకపోయిందట.అయితే శృంగార నాయికగా పాపులరైన ముంబై బ్యూటీ పూనమ్ పాండే నుంచి ఆ ఆఫర్ ని కొట్టేసిందట. దీంతో పూనమ్ యాడ్ అండోర్స్ మెంట్ దోచేసిన సౌత్ క్వీన్ అంటూ ముంబై మీడియాలో ఠాంఠాం మోగుతోంది. పూనమ్ పాండే గత ఏడాది కాలంగా ఓ ఇన్నర్ వేర్ బ్రాండ్ కి ప్రచారం చేస్తోంది. ఇప్పుడు ఆ ఛాన్స్ సౌత్ కి చెందిన ప్రముఖ కథానాయిక దక్కించుకుంది.

ఇంతకీ ఆ ఆఫర్ కొట్టేసింది ఎవరు? అన్నది ఆరా తీస్తే ఓ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. పూనమ్ ఆఫర్ కొట్టేసింది ఫలానా స్టార్ హీరోయిన్ అని టాక్ వినిపిస్తోంది. ఈ కాంట్రాక్టుతో ఆ అమ్మడికి బాగానే ముడుపులు అందుతున్నాయట. బ్రేక్సలెంట్ అనే ఇన్ వోర్ బ్రాండ్ కి సదరు హాట్ హీరోయిన్ సైన్ చేసిందన్నది ఓ గుసగుస. సీకే బ్రాండ్ కి దిశాపటానీ ఎంతగా పాపులారిటీ పెంచిందో అలానే బ్రేక్సలెంట్ కి ఈ బ్యూటీ అంతే పెద్ద ప్లస్ అవుతుందేమో చూడాలి. ఇదే నిజమైతే .. సోషల్ మీడియాల్లో తుఫాన్ స్పీడ్ తో ఈ అమ్మడికి కూడా ఫాలోవర్స్ పెరగడం ఖాయమే. ఇంతకీ ఎవరీ సౌత్ క్వీన్ అనేది ఇంకా సస్పెన్స్. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu
Top