Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సీఎం విజయ్ స్పెషల్ ఫోకస్.. ఆ ఎలివేషన్ నచ్చలేదా?

సీఎం విజయ్ స్పెషల్ ఫోకస్.. ఆ ఎలివేషన్ నచ్చలేదా?

Tupaki.com 1 week ago

మిళనాడు పాలిటిక్స్ లో సంచలనం సృష్టించిన హీరో విజయ్ ఇప్పుడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా తన సినీ జర్నీతో సంబంధించిన నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్నారు.

ఆయన చివరి చిత్రం జన నాయగన్ మూవీపై ప్రస్తుతం భారీ చర్చ నడుస్తోంది. ఇప్పటికే సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. అయితే సెన్సార్‌, విడుదలకు సంబంధించిన కొన్ని అడ్డంకుల కారణంగా సినిమా రిలీజ్ లేట్ అవుతుండటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ప్రస్తుతం ఆ చిత్రం రివైజింగ్ కమిటీ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో క్లియర్ సిగ్నల్ వచ్చేలా విజయ్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ కు వెళ్లిన నిర్మాత వెంకట్‌ ను వెంటనే చెన్నైకి రావాలని విజయ్ కోరినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో నిర్మాత తన ఫారిన్ టూర్ ను మధ్యలో ముగించుకుని తిరిగి వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.

అయితే విజయ్ రాజకీయాల్లో విజయం సాధించిన తర్వాత ఆయన అభిమానుల్లో జన నాయగన్ పై ఆసక్తి మరింత పెరిగింది. ముఖ్యంగా సీఎం హోదాలో ఉన్న విజయ్ చివరి సినిమాగా ఇది వస్తుండటంతో అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అదే సమయంలో టైటిల్ కార్డులో కూడా సీఎం హోదాను చూపించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. ఆ తర్వాత తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్ నటించిన జన నాయగన్ అంటూ టైటిల్ కార్డు పెట్టినట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఆ వీడియోలో పోలీస్ గెటప్‌ లో విజయ్ నడుచుకుంటూ వస్తుండగా, కొత్త టైటిల్ కార్డు కనిపించడం అభిమానుల్లో జోష్ నింపింది. "భారత్‌ లో తొలిసారి ఓ నటుడికి సీఎం టైటిల్ కార్డు" అంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఫుల్ హ్యాపీగా ఫీలయ్యారు. పొలిటికల్ విక్టరీతోపాటు సినిమాకు కూడా అదే రేంజ్ ఎలివేషన్ రావాలని ఫ్యాన్స్ భావించారు.

అయితే ఇప్పుడు ఆ విషయంలో ఆసక్తికరమైన ట్విస్ట్ బయటకు వస్తోంది. భారీ ఎలివేషన్లు, సీఎం హోదా ప్రస్తావనలు టైటిల్ కార్డులో అవసరం లేదని విజయ్ సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. గౌరవనీయ ముఖ్యమంత్రి వంటి పదాలు లేకుండా, కేవలం దళపతి విజయ్ అని టైటిల్ కార్డు ఉండాలని ఆయన కోరినట్లు సమాచారం.

దీంతో ఇది విజయ్ వ్యక్తిత్వానికే ఎగ్జాంపుల్ అని కొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. సీఎం అయినా కూడా తన స్టార్ ఇమేజ్‌ ను మరీ ఎక్కువగా చూపించకుండా ఉండాలని చూస్తున్నారని అన్నారు. అయితే జన నాయగన్ విడుదల తేదీపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీ స్థాయికి చేరుకోగా, టైటిల్ కార్డు చుట్టూ నడుస్తున్న చర్చ మూవీపై మరింత హైప్ తీసుకొచ్చింది. అయితే చివరికి విజయ్ ఏ నిర్ణయం తీసుకున్నారు? అసలు టైటిల్ కార్డు ఎలా ఉండబోతోంది? అన్నది సినిమా విడుదల రోజునే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu