Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సింగిల్ ఫాదర్ గా సవాళ్లు ఎదుర్కోంటున్న నటుడు!

సింగిల్ ఫాదర్ గా సవాళ్లు ఎదుర్కోంటున్న నటుడు!

Tupaki.com 1 week ago

కప్పుడు యూత్‌లో భారీ క్రేజ్ సంపాదించుకున్న నటుడు ఇమ్రాన్ ఖాన్ గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్నా? వ్యక్తిగత జీవిత విశేషాలతో తరచూ వార్తల్లో నిలుస్తోన్న సంగతి తెలిసిందే.

భార్య అవంతిక మాలిక్‌తో విడిపోయిన తర్వాత ఇమ్రాన్ కుమార్తె ఇమారా బాధ్యతలను ఒంటరిగానే చూసుకుంటున్నారు. తండ్రి అయినా? తల్లిలా బిడ్డ అన్ని బాద్యతలు నెరవర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో సింగిల్ ఫాదర్ గా సమాజంలో తాను ఎదుర్కొంటున్న సున్నితమైన సవాళ్లు, పెంపకంలో ఎదురవుతోన్న విచిత్రమైన పరిస్థితుల గురించి ఇమ్రాన్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు.

ఒంటరి తండ్రిగా తన కుమార్తె స్నేహితుల తల్లుల నుండి ఎదురయ్యే ఓ వింతైన హిస్టీరియా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సాధారణంగా పిల్లలు ఒకరి ఇంటికి ఒకరు వెళ్లి ఆడుకునే ప్లే-డేట్స్ అనేవి నగర సంస్కృతిలో కనిపిస్తుంది. అయితే ఇమ్రాన్ ఖాన్ కుమార్తె ఇమారాతో కలిసి ఆడుకోవడానికి ఇతర పిల్లలను తన ఇంటికి పంపించేటప్పుడు వారి తల్లులు చాలాసార్లు వెనుకడుగు వేస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ఈ సందేహం వెనుక ఉన్న సామాజిక మానసిక స్థితిని ఇమ్రాన్ విశ్లేషించారు. సమాజంలో సింగిల్ మదర్ (ఒంటరి తల్లి) ఇల్లు అయితే పిల్లలను పంపడానికి తల్లులు ఎంతో సురక్షితంగా భావిస్తారు.

కానీ అదే ఒంటరి తండ్రి ఇల్లు అనగానే అక్కడ పురుషులు మాత్రమే ఉంటారనే అభద్రతా భావం , అపనమ్మకం వారిలో తలెత్తుతుందని అన్నారు. ఆ ఇంట్లో పిల్లలను చూసుకోవడానికి ఏ మహిళా నమ్మకస్థురాలు లేదా కేర్‌టేకర్ లేకపోతే, తమ పిల్లలను పంపడానికి తల్లులు అంత సులువుగా ఒప్పుకోరని ఇమ్రాన్ ఖాన్ ప్రాక్టికల్ అనుభవాన్ని పంచుకున్నారు. తన ఇంట్లో కుమార్తెను చూసుకోవడానికి పూర్తి స్థాయి మహిళా నాని , కేర్‌టేకర్ ఉన్నా? ఆ తల్లుల మనసులోని సందేహాన్ని తాను పూర్తిగా తొలగించలేకపోయానని ఇమ్రాన్ పేర్కొన్నారు.

ఒక పురుషుడిగా తండ్రిగా తన కుమార్తెకు ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటున్నా? సమాజం నిర్మించుకున్న కొన్ని రకాల పాత ఆలోచనా విధానాలు కారణంగా ఒంటరి తండ్రులు ఇలాంటి సామాజిక వివక్షను , ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోందని అభిప్రాయపడ్డారు. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన తర్వాత తన పూర్తి సమయాన్ని కుమార్తె ఎదుగుదల కోసమే కేటాయించానని ఒక కూతురికి తండ్రిగా ఉండటం తనకు ఎన్నో కొత్త విషయాలను నేర్పిందని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. పిల్లల పెంపకంలో తల్లి పాత్ర ఎంత ముఖ్యమో? తండ్రి పాత్ర కూడా అంతే కీలకమన్నారు.

అయితే సమాజం ఒంటరి తండ్రిని చూసే కోణంలో ఇంకా మార్పు రావాల్సి ఉందన్నారు. ఇమ్రాన్ పంచుకున్న విషయాలు సోషల్ మీడియాలో ఆధునిక పేరెంటింగ్ , సామాజిక దృక్పథాలపై సరికొత్త చర్చకు దారితీశాయి. సినీ గ్లామర్‌కు దూరంగా సాధారణ తండ్రిగా ఇమ్రాన్ ఖాన్ సాగిస్తున్న ఈ ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది. సెలబ్రిటీ హోదా లో ఉన్నా? ఒంటరి తండ్రిగా ఆయన ఎదుర్కొంటున్న ప్రాక్టికల్ ఇబ్బందులను ధైర్యంగా పంచుకోవడం విశేషం. సమాజంలో సింగిల్ పేరెంటింగ్ పట్ల ఉన్న అపోహలు వీడి బాధ్యతను , నిబద్ధతను గౌరవించే రోజులు రావాలని అంతా కోరుకుంటున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu