Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సీనియర్ హీరోల ఫిట్నెస్ మంత్రం!

సీనియర్ హీరోల ఫిట్నెస్ మంత్రం!

Tupaki.com 1 week ago

టాలీవుడ్ వెండితెరపై దశాబ్దాలుగా ఏలుతోన్న సీనియర్ హీరోలు వయసు పెరుగుతున్నా? తమ ఫిట్నెస్‌తో నేటి తరం యంగ్ హీరోలకు గట్టి పోటీనిస్తున్నారు. సాధారణంగా అరవై ఏళ్లు దాటిన తర్వాత విశ్రాంతి తీసుకోవాలని భావిస్తారు.

కానీ తెలుగు స్టార్ హీరోలు మాత్రం అందుకు భిన్నంగా సరికొత్త మేకోవర్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యప రుస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి అప్ కమింగ్ చిత్రాల కోసం ఏకంగా 14 కేజీల బరువు తగ్గారు. దీంతో బాస్ మరింత స్మార్ట్ లుక్ లోకి వచ్చేసారు. 70 ఏళ్ల వయసులో అన్నయ్య చూపిస్తున్న అంకితభావం చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

మరోవైపు నవయువకుడులా కనిపించే కింగ్ నాగార్జున ఫిట్నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రమం తప్పకుండా యోగా, కఠినమైన డైట్ పాటిస్తారు. తన సినిమాల్లో యాక్షన్ సీక్వెన్స్‌లను కూడా ఎంతో సునాయాసంగా చేసేస్తుంటారు. ఆయన ఫిట్నెస్ రహస్యం ఏంటని అడిగితే? `క్రమశిక్షణ కలిగిన జీవనశైలి అని ఒక్క మాటలో చెబుతారు. సెట్స్ లో ఉన్న సినిమా సహా కొత్త ప్రాజెక్టుల కోసం నాగ్ బాడీ లాంగ్వేజ్‌ను మరింత షార్ప్‌గా మార్చుకుంటున్నారు. అలాగే నటసింహం బాలకృష్ణ కూడా మాస్ ఇమేజ్‌ను కాపాడుకుంటూనే లుక్ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇటీవల ఆయన సినిమాల్లో కనిపిస్తున్న ఎనర్జీకి కారణం ఆయన పాటిస్తున్న ప్రత్యేక వర్కవుట్లు ఆహార నియమాలే. భారీ డైలాగులు చెప్పడంలోనే కాదు. డాన్స్‌లు , ఫైట్లలో కూడా యంగ్ హీరోలకు దీటుగా కనిపించి సత్తా చాటుతున్నారు. విక్టరీ వెంకటేష్ కూడా లుక్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బేసిక్ గానే ఫిట్ నెస్ ప్రియుడైన వెంకీ ఇప్పుడు మరింత కేరింగ్ తో వ్యవహరిస్తున్నారు. యాక్షన్ ఓరియెంటెడ్ పాత్రల కోసం జిమ్‌లో కఠినంగా శ్రమిస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తోన్న `ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 వంటి సినిమాల కోసం ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చుకున్నట్లు సమాచారం.

ఈ సినిమాలో మరింత స్లిమ్ గా కనిపించనున్నారని వార్తలొస్తున్నాయి. ఇలా సీనియర్ హీరోలందరూ ఇలా పాత్రలు సహా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం పరిశ్రమకు సానుకూల సంకేతం. సీనియర్ హీరోల ఫిట్నెస్ ప్రయాణం వెనుక నిపుణులైన ట్రైనర్లు , పోషకాహార నిపుణుల పర్యవేక్షణ తప్పక ఉంటుంది. షూటింగ్ షెడ్యూల్స్ ఎంత బిజీగా ఉన్నా? ఉదయాన్నే వర్కవుట్స్ తప్పనిసరి. గ్లామర్ కోసం మాత్రమే కాకుండా? స్టామినాను పెంచుకోవడానికి ఈ నయా స్టార్లు చేస్తోన్న ప్రయత్నాలు యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. స్టార్‌డమ్ అనేది కేవలం నటనతోనే కాదు. శారీరక దృఢత్వంతో కూడా ముడిపడి ఉంటుందని నిరూపిస్తున్నారు. వయసు అనేది అంకె మాత్రమేనని టాలీవుడ్ సీనియర్ గ్యాంగ్ మరోసారి చాటిచెబుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu