Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సీనియర్ హీరోల జోడీలు - వెంకీ మామ డిఫరెంట్ రూట్!

సీనియర్ హీరోల జోడీలు - వెంకీ మామ డిఫరెంట్ రూట్!

Tupaki.com 2 days ago

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోల చిత్రాలకు హీరోయిన్లను ఎంపిక అన్నది ఎప్పుడూ పెద్ద టాస్క్. మారుతోన్న కాలంతో పాటు కథలు మారుతున్నా?

60 ప్లస్ వయసున్న అగ్ర హీరోల సరసన గ్లామర్ పరంగా, పర్‌ఫార్మెన్స్ పరంగా సెట్ అయ్యే జోడీలను వెతకడం సవాలుగా మారుతోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో సీనియర్ హీరోల తదుపరి ప్రాజెక్టులలో కథానాయికల ఎంపిక ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. కొందరు హీరోలు కలిసొచ్చిన పాత జోడీల వైపే మొగ్గు చూపుతుండగా? మరికొందరు మాత్రం సరికొత్త కాంబినేషన్లతో ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.

ఈ జాబితాలో ముందుగా నందమూరి బాలకృష్ణ గురించి చెప్పుకోవాలి. బాలయ్య తాజా చిత్రాల కోసం ప్రయోగాలకు వెళ్లకుండా ఇప్పటికే అలవాటైన, బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ రేట్ ఉన్న సీనియర్ హీరోయిన్లనే ప్రిఫర్ చేస్తున్నారు. లేడీ సూపర్‌స్టార్ నయనతార లేదా బాలీవుడ్ వెర్సటైల్ నటి విద్యాబాలన్ వంటి పరిచయమున్న నటీమణులతోనే స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సీనియర్ భామలైతేనే బాలయ్య ఇమేజ్‌కు, ఆయన చేసే హుందాతనమైన పాత్రలకు పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతారని దర్శకులు భావిస్తున్నారు.

మరోవైపు కింగ్ అక్కినేని నాగార్జున రూట్ కూడా ఇలాగే ఉంది. 90వ దశకంలో నాగార్జున - టబు కాంబినేషన్ వెండితెరపై ఎంతటి మ్యాజిక్ క్రియేట్ చేసిందో తెలిసిందే. `నిన్నే పెళ్లాడుతా`, `ఆవిడా మా ఆవిడే` వంటి క్లాసిక్ హిట్స్ తర్వాత ఈ క్రేజీ కాంబో మళ్లీ ఇన్నాళ్లకు తెరపైకి రానుండటం హాట్ టాపిక్‌గా మారింది. ఇద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ ఐకానిక్ కావడంతో మరోసారి వింటేజ్ జోడీని వెండితెరపై చూడటానికి అక్కినేని అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే.. దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టులో హీరోయిన్ ఎంపిక పూర్తయినట్లు తెలుస్తోంది. గతంలో `ఖైదీ నెంబర్ 150`, `ఆచార్య` చిత్రాలలో చిరు సరసన మెరిసిన చందమామ కాజల్ అగర్వాల్ కే కొత్త సినిమాలో మరోసారి అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. సీనియర్ హీరోల లీగ్‌లో కాజల్ కు క్రేజ్ ఉండటం, మెగాస్టార్‌తో మంచి సింక్ ఉండటంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఇలా సీనియర్ స్టార్లందరూ సేఫ్ జోన్‌లో పాత జోడీల వైపు వెళ్తుంటే విక్టరీ వెంకటేష్ మాత్రం పూర్తిగా భిన్నమైన రూట్ ఎంచుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కోసం వెంకీ కోసం ఏకంగా కీర్తి సురేష్ తో జతకడుతున్నారని సమాచారం. ఇప్పటి వరకూ కీర్తి ఏ సీనియర్ స్టార్ తోనూ నటించలేదు. తొలిసారి వెంకీతోనే ఆ ఛాన్స్ తీసుకుంటుంది. దీంతో వెండి తెరపై ఈ కాంబినేషన్ ఎలా ఎంటుంది? అన్నది ఆసక్తికరంగా మారింది. సీనియర్ హీరోల చిత్రాలలో హీరోయిన్ల ఎంపిక గ్లామర్ కోసమే కాదు. కథా బలం కూడా నటి ఎంపికలో అత్యంత కీలకమైందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu