Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్టాలిన్ యూటర్న్‌.. విజయ్ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు

స్టాలిన్ యూటర్న్‌.. విజయ్ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు

Tupaki.com 5 days ago

మిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ సర్కారు ఏక్షణమైనా కుప్పకూలిపోవచ్చని అన్నారు. నిజానికి సుస్థిర ప్రభుత్వ ఏర్పాటును ఆహ్వానించింది తానేనని, కానీ, గత వారం రోజులుగా రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న పనులు..

నేతల్లో అప్పుడే పెరుగుతున్న అసంతృప్తిని గమనిస్తే.. ఈ ప్రభుత్వం అతి త్వరలోనే కూలిపోతుందని తెలుస్తోందని వ్యాఖ్యానించారు. ఇదే జరిగితే.. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు.

అంతేకాదు.. ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. కార్యకర్తలు , నాయకులు రెడీగా ఉండాలని స్టాలిన్ డీఎంకే కార్యవర్గానికి పిలుపునిచ్చారు. ఈ దఫా డీఎంకేకే ప్రజలు పట్టం కట్టడం ఖాయమని తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో డీఎంకే 59 స్థానాలకు పరిమితమై.. ప్రధాన ప్రతిపక్ష హోదాను దక్కించుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు.. విజయ్ ప్రభుత్వ ఏర్పాటు విషయంలోనూ స్టాలిన్ తెరవెనుక చక్రం తిప్పారన్న వాదన ఉంది. ఆయన ప్రోద్బలంతోనే సీపీఐ, సీపీఎం, ఐయూఎంఎల్ వంటి డీఎంకే కూటమి పార్టీలు విజయ్‌కు మద్దతు తెలిపాయని అంటున్నారు.

దీంతో విజయ్ 120 మంది ఎమ్మెల్యేల మద్దతుతో తమిళనాట కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ, ఇంతలోనే స్టాలిన్ యూటర్న్ తీసుకోవడం గమనార్హం. అయితే.. ఆయన ఎందుకు ఇలా వ్యాఖ్యానించారు ? నిండా మూడు శుక్రవారాలు కూడా గడవకుండానే విజయ్ ప్రభుత్వం కూలిపోతుందని ఎందుకు అన్నారు? అనే విషయాలను మాత్రం ఆయన చెప్పలేదు. కానీ, ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే.. తనకు అదే అనుమానం కలుగుతోందన్నారు. విజయ్ ప్రభుత్వం ఏ క్షణంలో అయినా కూలిపోతుందని పదే పదే చెప్పడం గమనార్హం.

మరోవైపు.. తాజాగా ఎన్నికల్లో డీఎంకే ఓటమికి గల కారణాలను అన్వేషించేందుకు 36 మందితో కూడిన ప్రత్యేక కమిటీని స్టాలిన్ నియమించారు. ఇది క్షేత్రస్థాయిలో పర్యటించి.. ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంటుంది. వారి ఆలోచనల మేరకు పార్టీలో ను.. విధానపరమైన నిర్ణయాల్లోనూ మార్పులు తీసుకుంటామని స్టాలిన్ చెబుతున్నారు. డీఎంకే ఓటమికి పూర్తిగా తానే బాధ్యత తీసుకుంటున్నట్టు స్టాలిన్ ఇప్పటికే ప్రకటించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu