Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్టార్ హీరోయిన్ సీక్రెట్ పెళ్లి? ఈ మంగళసూత్రం నిజమేనా?

స్టార్ హీరోయిన్ సీక్రెట్ పెళ్లి? ఈ మంగళసూత్రం నిజమేనా?

Tupaki.com 2 days ago

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, నటి - పార్లమెంట్ సభ్యురాలు కంగనా రనౌత్ నిరంతరం ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. తాజాగా కంగన మెడలో మంగళసూత్రం ధరించి ఉన్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వైరల్ అయ్యాయి.

ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు -అభిమానలోకం ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కంగనా ఎవరికీ చెప్పకుండా రహస్యంగా పెళ్లి చేసుకుందా? అంటూ నెట్టింట పెద్ద ఎత్తున చర్చలు, పుకార్లు మొదలయ్యాయి. గత కొన్ని రోజులుగా క్వీన్ వివాహం గురించి రకరకాల వార్తలు వస్తున్న సమయంలో ఈ మంగళసూత్రం ఫోటోలతో ఆ రూమర్లకు మరింత ఆజ్యం పోసినట్లయింది.

ఈ వైరల్ ఫోటోల వెనుక ఉన్న అసలు నిజాన్ని పరిశీలిస్తే.. కంగనకు నిజంగా పెళ్లి కాలేదనే విషయం స్పష్టమవుతోంది. కంగనా రనౌత్ మెడలో మంగళసూత్రం ధరించడానికి పెళ్లితో సంబంధం లేదు. నిజానికి కంగన నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ సెట్స్‌లో భాగంగా ఈ గెటప్‌ను ధరించారు. వెండితెరపై తను పోషిస్తున్న ఒక వివాహిత పాత్ర కోసం కథ డిమాండ్ మేరకు మేకప్ రూమ్‌లో భాగంగా ఈ మంగళసూత్రాన్ని, సాంప్రదాయ వస్త్రధారణను కొనసాగించాల్సి వచ్చింది. అయితే ఆ షూటింగ్ విరామ సమయంలో తీసిన ఫోటోలు కాస్తా బయటకు రావడంతో కంగనకు పెళ్లయిందంటూ ఒక సెక్షన్ లో తప్పుడు ప్రచారం సాగింది.

ప్రస్తుతం కంగనా రనౌత్ రాజకీయాలతో పాటు సినిమాల్లోనూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. పలు క్రేజీ ప్రాజెక్టులకు సంతకాలు చేసారు. లైఫ్ కీలక మలుపులో తన పెళ్లి వార్తలపై గతంలోనే స్పందిస్తూ.. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా అందరికీ చెప్పిన తర్వాతే వివాహం చేసుకుంటానని స్పష్టం చేశారు. కేవలం సినిమా కాస్ట్యూమ్స్ ఆధారంగా చేసుకొని సోషల్ మీడియాలో కథనాలు అల్లేయడం ఎంతవరకు సమంజసమని సన్నిహత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఈ రోజుల్లో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై సామాజిక మాధ్యమాల్లో రూమర్లు రావడం చాలా సర్వసాధారణంగా మారిపోయింది. ముఖ్యంగా కంగనా రనౌత్ లాంటి పాపులర్ స్టార్స్ ఏం చేసినా అది క్షణాల్లో ట్రెండింగ్‌గా మారుతుంది. ఒక నటిగా విభిన్న పాత్రలు పోషించే క్రమంలో రకరకాల గెటప్స్ వేయడం సహజం. కానీ డిజిటల్ మీడియా యుగంలో కనీస వాస్తవాలను తెలుసుకోకుండా.. కేవలం క్లిక్స్ కోసం ఫోటోలను తప్పుగా చిత్రీకరిస్తూ కథనాలను ప్రచారం చేయడం సెలబ్రిటీల ప్రైవసీని ఇబ్బందుల్లోకి నెడుతోంది. ఈ మంగళసూత్రం వివాదంతో మరోసారి గాసిప్ రాయుళ్ల అత్యుత్సాహం బయటపడింది.

కంగనా రనౌత్ మంగళసూత్రం ధరించిన ఫోటోల వెనుక ఉన్నది కేవలం సినిమా షూటింగ్ ముచ్చట మాత్రమే కానీ ఇది నిజ జీవితం కాదు. ఆమె అభిమానులు ఈ పుకార్లను నమ్మాల్సిన అవసరం లేదని తేలిపోయింది. కంగనా తన తదుపరి చిత్రం గురించి పెద్ద ప్రకటన చేస్తుందని అభిమానులు వేచి చూస్తున్నారు. ఇప్పటికైనా సోషల్ మీడియా వేదికలు ఇటువంటి సెన్సేషనల్ వార్తలను వ్యాప్తి చేసే ముందు పూర్తి సత్యాలను నిర్ధారించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu