Wednesday, 05 Aug, 9.34 am Tupaki.com

మూవీ న్యూస్
#సుశాంత్.. ఒకరిని రేప్ చేసి.. ఇంకొకరిని హత్య చేసి!

యువహీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య అనంతర పరిణామాల గురించి తెలిసిందే. ఒక సెక్షన్ సుశాంత్ కి ఆయన కుటుంబ సభ్యులకు మద్ధతు పలుకుతుంటే.. మరో సెక్షన్ మాత్రం బాలీవుడ్ మాఫియాగా పిలవబడుతున్న సినీపెద్దలకే అండగా నిలుస్తున్నారు. బాలీవుడ్ చరిత్రలో ఎన్నడూ లేనంత గొప్ప డిబేట్ రన్ అవుతోంది. ఎవరు అపరాధి? ఎవరు నిరపరాధి? అన్నది అటుంచితే ఇందులో రెండు రాష్ట్రాల రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. పలు పొలిటికల్ పార్టీల నడుమ ఆరోపణలు ప్రత్యారోపణలతో అట్టుడికిపోతోంది.ఈ కేసు రోజుకోరకంగా కొత్త మలుపు తీసుకుంటోంది. సుశాంత్ ని హత్య చేశారని ఆరోపిస్తూ సిబిఐ దర్యాప్తు చేయాలని ఒక విభాగం ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా మహారాష్ట్రకు చెందిన భాజపా నాయకుడు నారాయణ్ రాణే చేసిన సంచలన ఆరోపణలు వేడెక్కిస్తున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్పుత్ హత్య కేసులో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ప్రమేయం బయట పడిందని ఆయన ఎదురు దాడి చేశారు. ఇది హత్య.. ఆత్మహత్య కాదని ఆరోపించారు. సుశాంత్ మేనేజర్ దిషా సాలియన్ పై అత్యాచారం చేసి హత్య చేశారు. దిశా ప్రైవేట్ భాగాలపై గాయాలైనట్టు ఓ నివేదిక చూపిస్తోందని షాకింగ్ ఆరోపణలు చేశారు.

ఒకరిని రేప్ చేసి చంపేస్తే.. ఇంకొకరిని హత్య చేసి చంపేశారన్నది ఆయన ఆరోపణ. ఈ కేసు వ్యవహారంలో సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిని.. ఆమె కుటుంబాన్ని విచారించాలని .. సీబీఐ దర్యాప్తు సాగాలని డిమాండ్ చేశారు. ముంబై పోలీసులు కొందరు బలవంతుల్ని పెద్దల్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని.. నిజాల్ని దాచేసి కవచంలా మారారని ఆరోపించారు. ఇక ఇదే తరహా వాదాన్ని బలపరుస్తూ రిపబ్లిక్ టీవీ అర్నాబ్ గోస్వామి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును సీబీఐకి బదలాయించాలన్న డిమాండ్ అంతకంతకు పెరుగుతోంది.
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu
Top