Thursday, 21 Jan, 9.11 pm Tupaki.com

మూవీ న్యూస్
సుశాంత్ సింగ్ నాశనం ఎలా మొదలైందో పూస గుచ్చిన కంగన!

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం వెనక బాలీవుడ్ మాఫియా హస్తం ఉందని.. బలవంతులు అతడి మరణానికి కారకులయ్యారని తొలి నుంచి ఆరోపిస్తున్నారు కంగన రనౌత్. సుశాంత్ ది ముమ్మాటికీ హత్యేనని ఆరోపించింది క్వీన్. అంతేకాదు నేడు సుశాంత్ సింగ్ ప్రథమ జయంతి (35 వ బర్త్ డే) సందర్భంగా అభిమానులంతా విషెస్ తెలియజేస్తే కంగన మాత్రం ఒకసారి తిరిగి తనదైన శైలిలో విరుచుకుపడింది.ఈసారి కూడా సుశాంత్ సింగ్ మరణం వెనక బాలీవుడ్ సినీపెద్దలు ఉన్నారని కంగన ఆరోపిస్తూ వరుస ట్వీట్లతో మోతెక్కించారు.

నేను ఈ మరణం గురించి తగినంతగా చెప్పాను. కానీ అది సరిపోదు. సుశాంత్ హత్య కాలక్రమం ఎలా ఉందంటే..

1) ఇక్కడ నిర్మాత ఆదిత్య చోప్రాతో కలిసిపోవాలి. లేదంటే కష్టమే. కానీ సుశాంత్ వారి దుష్ట పెట్టుబడిదారుల ఒప్పందాలకు కట్టుబడి ఉండటానికి నిరాకరించాడు. చోప్రా అతనిని నాశనం చేస్తానని శపథం చేశాడు.

2) KJO (కరణ్ జోహార్) .. చోప్రా నేపాటిజం ప్రేమకు కట్టుబడి ఉన్నారు.
బ్లాక్ బస్టర్ ధోనిలో నటించిన తర్వాత సుశాంత్ కు ఫ్రాంచైజ్ ఇస్తానని వాగ్దానం చేసిన తరువాత అతనిని తన చేతుల్లోకి తీసుకోవాలని కరణ్ జోహార్ నిర్ణయించుకున్నాడు. దీని గురించి కలతకు గురై తాను గుండెలు బాదుకున్నానని సుశాంత్ సింగ్ ఆవేదన చెందారు.

3) మాఫియా పిఆర్ ఒకరు అతన్ని అత్యాచార హీరో అని .. మాదకద్రవ్యాల బానిస అని పిలుస్తూ అతనిపై అసహ్యకరమైన అపవాదు ప్రచారం చేయడం ప్రారంభించాడు.

4) అప్పుడే మహేష్ భట్ తన జీవితంలోకి ప్రవేశించి... అతను నిరాశకు గురైనందున `పర్వీన్ బాబీ` మార్గంలో వెళ్ళడానికి కట్టుబడి ఉండండి! అని సుశాంత్ ని ప్రలోభ పెట్టారు. భట్ సాబ్ అణగారిన ప్రజలందరూ పర్వీన్ బాబీ మార్గంలో వెళితే మీ కుమార్తె షాహీన్ కూడా ఆ విధంగా వెళ్ళాలి. ఆమె నిరాశ నిస్పృహలకు డిప్రెషన్ కి రాయబారి... అంటూ కంగన టీమ్ వరుస ట్వీట్లతో మోతెక్కించింది. ఓవరాల్ గా సుశాంత్ ని అడ్డు పెట్టుకుని చోప్రాల్ని కరణ్ జోహార్ ని భట్స్ ని ఏకి పారేసింది క్వీన్. అయితే కంగన చెబుతున్నట్టు ఇవన్నీ నిజాలేనా కాదా? అన్నదానికి మద్ధతు కూడగట్టడంలో సఫలమవుతుందా? అన్నది కూడా చూడాలి.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu
Top