Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్వేచ్ఛగా జీవించాలి అంటూ కియారా అద్వానీ వ్యాఖ్యలు.. నెట్టింట రచ్చ రచ్చ!

స్వేచ్ఛగా జీవించాలి అంటూ కియారా అద్వానీ వ్యాఖ్యలు.. నెట్టింట రచ్చ రచ్చ!

Tupaki.com 1 week ago

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సినిమాల కంటే ఎక్కువగా తన వ్యక్తిగత అభిప్రాయాలతో వార్తల్లో నిలిచే కియారా..

తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో చేసిన వ్యాఖ్యలతో పెద్ద చర్చకు తెరలేపింది. ఫ్యామిలీ, పెళ్లి, పిల్లల పెంపకం వంటి విషయాలపై ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పిల్లల జీవిత నిర్ణయాలు వాళ్లవే కావాలంటూ ఆమె చెప్పిన మాటలు యూత్‌లో ఒక వర్గానికి నచ్చగా, మరికొందరిలో తీవ్ర వ్యతిరేకతను రేకెత్తిస్తున్నాయి.

రీసెంట్ గా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న కియారాకు ఫ్యామిలీ లైఫ్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా ఆమె చాలా ఓపెన్‌గా రియాక్ట్ అయ్యారు. తన కూతురు జీవితాన్ని స్వేచ్ఛగా అనుభవించాలని, ఆమె ఎవరితోనైనా డేటింగ్ చేయాలనుకుంటే అది తన సెలెక్షన్ అని, పెళ్లి చేసుకోవాలా వద్దా అనేది కూడా పూర్తిగా తన డెసిషనే అని కియారా తెలిపింది. ప్రతి రిలేషన్‌షిప్ మనిషికి ఏదో ఒక పాఠం నేర్పుతుందని, జీవితం అనుభవాల ద్వారా పరిపక్వతను అందిస్తుందని కియారా అభిప్రాయపడ్డారు. తప్పులు చేయకుండా ఎవరూ ఎదగరని, మనం చేసే నిర్ణయాలే మనల్ని మనుషులుగా తీర్చిదిద్దుతాయంటూ ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీశాయి.

అయితే ఈ వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి మిక్డ్స్ రెస్పాన్స్ వస్తోంది. ఒక వర్గం మాత్రం కియారా ఆలోచనలను ప్రోగ్రెసివ్‌గా అభివర్ణిస్తోంది. పిల్లలపై తమ అభిప్రాయాలను రుద్దకుండా, వాళ్ల నిర్ణయాలను గౌరవించడం మంచి తల్లిదండ్రుల లక్షణమంటూ పలువురు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. కొత్త తరం ఆలోచనలకు ఇది ప్రతిబింబమని, వ్యక్తిగత స్వేచ్ఛపై ఓ స్టార్ హీరోయిన్ ఇంత ఓపెన్‌గా మాట్లాడటం అభినందనీయమని కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు, సంప్రదాయ కుటుంబ విలువలను ప్రాధాన్యంగా భావించే వర్గం మాత్రం కియారా వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శిస్తోంది. భారతీయ సంస్కృతిలో ఇలాంటి భావజాలం సరైనదేనా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఒక తల్లి తన పిల్లల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యంగా ఉందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఇప్పటికే ఈ పాడ్‌కాస్ట్ వీడియోకు లక్షల్లో వ్యూస్ రావడంతో వివాదం మరింత పెరిగింది. ముఖ్యంగా యూత్‌, కుటుంబ విలువలు, వ్యక్తిగత స్వేచ్ఛల మధ్య ఉన్న భావజాల తేడాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అయితే వివాదాల మధ్య కూడా కియారా తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పడం వల్ల మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం కియారా వరుస బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా కొనసాగుతోంది. పెళ్లి తర్వాత కూడా కెరీర్‌లో అదే జోష్‌ను కొనసాగిస్తున్న కియారా, యాక్టింగ్ తో పాటూ తన వ్యక్తిగత అభిప్రాయాలను కూడా నిర్భయంగా వ్యక్తపరచడం వల్ల తరచూ ఆమె పేరు డిస్కషన్స్ లో ఉంటుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu