Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టాలీవుడ్ హీరోయిన్ల సక్సెస్ గ్రాఫ్!

టాలీవుడ్ హీరోయిన్ల సక్సెస్ గ్రాఫ్!

Tupaki.com 1 week ago

గ్లామర్ ప్రపంచంలో నిలదొక్కుకోవడం అనేది ఒక ఎత్తు అయితే.. అగ్రస్థానానికి చేరుకోవడం అనేది మరో ఎత్తు. టాలీవుడ్‌లో ప్రతిభ, అందం పుష్కలంగా ఉన్నా? స్టార్ హోదా అందుకోవడం అంత సులభం కాదని కొందరు భామలకెరీర్ గ్రాఫ్ చూస్తే అర్థమవుతుంది.

చిత్ర పరిశ్రమలో రాణించాలంటే బాహ్య సౌందర్యం మాత్రమే ఉంటే సరిపోదు. సరైన సమయంలో సరైన సక్సెస్ కూడా కలిసి రావాలని సమీకరణాలు నిరూపిస్తున్నాయి. ఎంతో క్రేజ్ ఉన్నా? బాక్సాఫీస్ వద్ద సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న కథానాయికల సంఖ్య టాలీవుడ్‌లో తక్కువేమీ కాదు.

ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సింది భాగ్యశ్రీ బోర్డ్సే, కావ్య తాపర్, సాయి మంజురేకర్ వంటి నటీమణుల గురించి. వీరు పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటి నుండి వరుసగా క్రేజీ ప్రాజెక్టులలో అవకాశాలు అందుకుంటూనే ఉన్నారు. స్టార్ హీరోల సరసన పెద్ద నిర్మాణ సంస్థల్లో నటిస్తున్నా? ఈ భామలకు ఆశించిన స్థాయిలో కమర్షియల్ హిట్లు మాత్రం దక్కడం లేదు. నటన పరంగా మార్కులు వేయించుకుంటున్నా? నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటం తో కెరీర్ ఎదుగుదలకు కొంత బ్రేక్ తప్పడం లేదు. అయినా? ప్రయత్నాలను ఆపకుండా వరుస కథలను వింటున్నారు.

మరోవైపు నభా నటేష్ `ఇస్మార్ట్ శంకర్` వంటి బ్లాక్‌బస్టర్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నా? ఆ సక్సెస్‌ను లాంగ్ రన్ లో కొనసాగించలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన చిత్రాలు నిరాశపరచడం, మధ్యలో జరిగిన ప్రమాదం ఆమె కెరీర్ వేగాన్ని తగ్గించాయి. ప్రస్తుతం సరికొత్త మేకోవర్‌తో రీఎంట్రీ ఇఇస్తోంది నభా. గ్లామర్ రోల్స్‌తో పాటు పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలపై దృష్టి పెట్టింది. తదుపరి ప్రాజెక్ట్ ద్వారా పూర్వ వైభవాన్ని అందుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది. మాస్ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న డింపుల్ హయాతి కన్నడ ఇండస్ట్రీ నుండి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఆషిక రంగనాథ్ ల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు.

డింపుల్ హయాతి గ్లామర్ షో - డ్యాన్స్ స్కిల్స్‌తో కుర్రకారును ఆకట్టుకుంటున్నా? ఆమె ఖాతాలో ఒక్క పక్కా కమర్షియల్ హిట్ పడటం లేదు. ఆషికా రంగనాథ్ హోమ్లీ లుక్, యాక్టింగ్ పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నా? స్టార్ లీగ్‌లోకి వెళ్ళడానికి అవసరమైన బిగ్ బ్రేక్ కోసం నిరీక్షిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం నటీమణులంతా తదుపరి చిత్రాలపైనే ఆశలను పెట్టుకున్నారు. కథల ఎంపికలో గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ గ్లామర్ బొమ్మలుగా మిగిలిపోకుండా కథలో ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటున్నారు. టాలీవుడ్‌లో ఒక్క సరైన హిట్ పడితే చాలు హీరోయిన్ల జాతకాలే మారిపోతాయనేది జగమెరిగిన సత్యం. అందుకే 2026లో రాబోయే చిత్రాల ఫలితాల కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు.

ఇండస్ట్రీలో లక్ అనేది ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పడం కష్టం. పూజా హెగ్డే, రష్మిక మందన్న వంటి స్టార్ హీరోయిన్లు కూడా కెరీర్ ప్రారంభంలో వరుస పరాజయాలను చూసినవారే. కాబట్టి ఇప్పుడున్న యువ నటీమణులు ఒక విజయంతో స్టార్‌డమ్ అందుకోవడం సాధ్యమే. నిరంతర కృషి, పట్టుదలతో పాటు సరైన కథను ఎంచుకుంటే కథానాయికలు కూడా టాలీవుడ్ తదుపరి టాప్ లీగ్‌లో నిలబడతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu