Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టాలీవుడ్ కి కొత్త కథానాయికల ఎంట్రీ!

టాలీవుడ్ కి కొత్త కథానాయికల ఎంట్రీ!

Tupaki.com 1 week ago

రిశ్రమకు ఏటా కొత్త నటీమణుల రాక సర్వసాధారణం. కానీ 2026 సంవత్సరం మాత్రం అత్యంత క్రేజీ డెబ్యూలకు వేదిక కాబోతోంది. ఈ ఏడాది టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న వారిలో వారసత్వంతో పాటు ప్రతిభ ఉన్న ముద్దుగుమ్మలు ఎక్కువగా ఉండటం విశేషం.

వీరి ఎంట్రీతో టాలీవుడ్ కథానాయికల కొరత తీరుతుందని నిర్మాతలతో పాటు ప్రేక్షకులు కూడా ఆశాభావంతో ఉన్నారు. ముఖ్యంగా బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రషా తడాని టాలీవుడ్ ఎంట్రీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఆమె గ్లామర్ , స్టైలిష్ లుక్స్‌తో సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.

సూపర్ స్టార్ కృష్ణమనవడు రమేష్ బాబు తనయుడు జయకృస్ణ హీరోగా పరిచయం అవుతోన్న `శ్రీనివాస మంగాపు రం` సినిమాతో రషా పరిచయం అవుతోంది. ఇప్పటికే అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న బ్యూటీకి తొలి సినిమా సక్సెస్ అయితే మంచి పేరొస్తుంది. దీంతో కొత్త అవకాశాలకు తిరుగుండదు. అలాగే చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన సారా అర్జున్ పాన్ ఇండియాలో ఇప్పుడు ఎంత సంచలనమో చెప్పాల్సిన పనిలేదు. `ధురంధర్` విజయంలో అమ్మడు భాగం కావడంతో? మంచి పేరొచ్చింది. ప్రస్తతుం హిందీ పరిశ్రమలో మంచి అవకాశాలు వస్తున్నాయి.

అలాగే `యూఫోరియా` వంటి సినిమాతో తెలుగులోనూ ఇదే ఏడాది లాంచ్ అయింది. ఈ సినిమా అనుకున్నంతగా సక్సస్ కాలేదు. కానీ సారాకి మాత్రం టాలీవుడ్ లో మంచి భవిష్యత్ కనిపిస్తుంది. మరో సెన్సేషన్ ఇమాన్వి ఇస్మా యిల్. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తోన్న `ఫౌజీ` సినిమాతో ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే ఇమ్మాన్వీ తెలుగు కుర్రాళ్లలో గుండెల్లో గుడి కట్టేసుకుంది. `పౌజీ` హిట్ అయితే అమ్మడి రేంజ్ అంతకంతకు రెట్టింపు అవుతుంది. అలాగే కన్నడలో 'సప్త సాగరదాచే ఎల్లో' సినిమాతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన రుక్మిణి వసంత కూడా 2026లో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.

అమ్మడి నేచురల్ యాక్టింగ్ , ఎక్స్‌ప్రెషన్స్‌కు ఇప్పటికే తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. గ్లామర్ పాత్రల కంటే పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలకే ఆమె ప్రాధాన్యత ఇస్తుండటం విశేషం. ఇప్పటికే కొన్ని తెలుగు సినిమా లకు సైన్ చేసింది. ఇలా కొత్త హీరోయిన్ల రాకతో టాలీవుడ్‌లో సరికొత్త పోటీ నెలకొనబోతోంది. వీరంతా గ్లామర్ కే పరిమితం కాకుండా బలమైన పాత్రలతో తమకంటూ ప్రత్యేక ముద్ర వేయాలని చూస్తున్నారు. 2026 చివరికల్లా వీరిలో ఎవరు? బలంగా నిలదొక్కుకుంటారో చూడాలి. అలా ఎదిగిన నాయిక అటుపై సీనియర్లతో పోటీ పడాల్సి ఉంటుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu