Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టాలీవుడ్‌లో ఎదుగుతోన్న చిన్న హీరోయిన్లు!

టాలీవుడ్‌లో ఎదుగుతోన్న చిన్న హీరోయిన్లు!

Tupaki.com 5 days ago

టాలీవుడ్ నిరంతరం సరికొత్త ప్రతిభను, గ్లామర్‌ను సాదరంగా ఆహ్వానిస్తూనే ఉంటుంది. ఒకప్పుడు అగ్ర కథానాయి కలుగా వెలిగిన భామలు సీనియర్లుగా ప్రమోట్ అవ్వడంతో?

ప్రస్తుతం టాలీవుడ్‌లో కొత్త తరం నటీమణుల హవా మొదలైంది. చిన్న చిత్రాలతో కెరీర్ ప్రారంభించి నటన .. అందంతో యువత మనసు దోచుకుంటోన్న పలువురు యంగ్ హీరోయిన్లు స్టార్ స్టేటస్ అందుకోవడానికి పోటీ పడుతున్నారు. ఈ రేసులో కయాదు లోహర్, నయన్ సారిక, సాక్షి వైద్య, రుక్మిణి వసంత వంటి భామలు వరుస క్రేజీ ప్రాజెక్టులతో టాలీవుడ్‌లో మోస్ట్ బిజీగా మారుతున్నారు.

సరికొత్త తరం కథానాయికలలో కయాదు లోహర్, నయన్ సారికలు డిఫరెంట్ లుక్స్ , యాక్టింగ్ స్కిల్స్‌తో ట్రేడ్ వర్గాల దృష్టిని ఆకర్షిస్తున్నారు. కయాదు లోహర్ కమర్షియల్ హంగులతో పాటు నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుని మేకర్స్ దృష్టిలో పడుతున్నారు. నయన్ సారిక ఇటీవల కాలంలో చిన్న , మధ్య తరహా బడ్జెట్ చిత్రాలలో విజయాలను అందుకుని లక్కీ హీరోయిన్‌గా మారుతోంది. గ్లామర్ ప్రదర్శనకే పరిమితం కాకుండా తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా పాత్రలను పండించడంలో భామలు చూపిస్తున్న చొరవ వారిని రేసులో ముందుకు తీసుకెళ్తోంది.

అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా నటించిన `ఏజెంట్` చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మోడల్ కమ్ యాక్ట్రెస్ సాక్షి వైద్య కెరీర్ గ్రాఫ్ ఇప్పుడు ఊహించని మలుపు తిరుగుతోంది. తొలి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయా లు సాధించకపోయినా? అమ్మడిలో స్క్రీన్ ప్రెజెన్స్, రాయల్ లుక్స్‌కు టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు ఫిదా అవుతున్నారు. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక చిత్రంలో సాక్షి వైద్య పేరును హీరోయిన్‌గా పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఈ మెగా ప్రాజెక్ట్ గనుక అధికారికంగా ఓకే అయితే సాక్షి కెరీర్ టాప్ గేర్‌లోకి వెళ్లడం ఖాయం.

కన్నడ చిత్ర పరిశ్రమ నుండి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి తక్కువ కాలంలోనే సెన్సేషన్‌గా మారిన నటి రుక్మిణి వసంత్. కన్నడలో `సప్త సాగరదాచే ఎల్లో` చిత్రంతో నటనకు గానూ విమర్శకుల ప్రశంసలు అందుకున్న హోమ్లీ బ్యూటీ టాలీవుడ్ క్రేజీ ఆఫర్లను సొంతం చేసుకుంటోంది. ఇప్పటికే గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న భారీ చిత్రంలో హీరోయిన్‌గా ఛాన్స్ అందుకుంది. ఎన్టీఆర్ వంటి మాస్ హీరో సినిమాలో ఛాన్స్ రావడం అంటే టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ లీగ్‌లోకి చేరిపోవడమే.

ఇలా కొత్త తరం హీరోయిన్ల దూకుడు టాలీవుడ్‌లో సరికొత్త హెల్తీ కాంపిటీషన్‌ను తీసుకొస్తుంది. ఒకప్పుడు బాలీవుడ్ , కోలీవుడ్ నుండి వచ్చే స్టార్ హీరోయిన్లపైనే ఆధారపడే టాలీవుడ్ మేకర్స్ ఇప్పుడు కంటెంట్‌కు సరిపోయే సరికొత్త ముఖాల కోసం వెతుకుతున్నారు. యంగ్ బ్యూటీస్ కూడా కథల ఎంపికలో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. పెద్ద హీరోల ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నారు. స్టార్ ఇమేజ్ అందుకోవడానికి కావాల్సిన గ్లామర్, పర్ఫార్మెన్స్, డెడికేషన్ వీరిలో పుష్కలంగా కనిపిస్తుండటంతో నిర్మాతలు సైతం భారీ బడ్జెట్లను పెట్టడానికి వెనుకాడటం లేదు. ఇలా కయాదు లోహర్, నయన్ సారిక, సాక్షి వైద్య, రుక్మిణి వసంతలు లీడింగ్ పొజిషన్‌లో ఉన్నారు. మరి ఈ గోల్డెన్ ఛాన్సులను యంగ్ హీరోయిన్లు ఎలా ఉపయోగించుకుంటారు? రాబోయే రోజుల్లో టాలీవుడ్ ను ఏలే స్టార్ హీరోయిన్లుగా ఎవరు నిలుస్తారు అనేది ఆసక్తికరం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu