Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తారక్ జగమొండి..ఎంత మొండోడు అంటే!

తారక్ జగమొండి..ఎంత మొండోడు అంటే!

Tupaki.com 2 days ago

పాత్రల కోసం ప్రాణం పెట్టే నటులు చాలా మందే ఉంటారు. కానీ దర్శకుడు అనుకున్న విజన్‌ను స్క్రీన్‌పై తీసుకురావడం కోసం శరీరాన్ని సైతం మైనంలా కరిగించే నటులు కొందరే ఉంటారు.

ఆ కోవకే చెందుతారు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `డ్రాగన్` సినిమా టీజర్‌లో తారక్ సరికొత్త మేకోవర్ చూసి అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ లుక్ వెనుక ఉన్న అసలైన కష్టాన్ని, తారక్‌లోని జగమొండితనాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తాజాగా పంచుకున్నారు. సాధారణంగా ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరోల క్యారెక్టరైజేషన్ పవర్‌ఫుల్‌గా, రఫ్‌గా ఉంటుంది. ఈ సినిమా కథా నేపథ్యం ప్రకారం తారక్ లుక్ మరింత షార్ప్‌గా, స్లిమ్‌గా ఉండాలని నీల్ భావించారు.

ఇందులో భాగంగానే ఎన్టీఆర్‌ను కొంచెం బరువు తగ్గాల్సిందిగా కోరారు నీల్. దర్శకుడు ఒక మాట అడగడమే ఆలస్యం.. తారక్ దాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. తన పాత్రకు వంద శాతం న్యాయం చేయాలనే పట్టుదలతో రంగంలోకి దిగారు. పాత్ర కోసం తారక్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. కఠినమైన డైట్ నియమాలను పాటిస్తూ, జిమ్‌లో గంటల తరబడి శ్రమించారు. నాలుగు నెలల స్వల్ప వ్యవధిలోనే ఏకంగా 15 కిలోల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ క్రమంలో ఆయన చూపించిన అంకితభావం, క్రమశిక్షణ చూసి చిత్ర యూనిట్ ముక్కున వేలేసుకుంది. డ్రాగన్ టీజర్‌లో కనిపిస్తున్న ఆ షార్ప్ లుక్, ఎనర్జీ వెనుక నాలుగు నెలల సుదీర్ఘ నిరంతర శ్రమ దాగి ఉందనే విషయం వివరాలతో స్పష్టమవుతోంది.

అయితే తారక్ ఈ స్థాయిలో బరువు తగ్గడం వెనుక మరో ఆసక్తికర విషయాన్ని కూడా ప్రశాంత్ నీల్ పంచుకున్నారు. క్యారెక్టర్ డిమాండ్ మేరకు తారక్ బాగా స్లిమ్‌గా మారిపోవడంతో? ఆయన వ్యక్తిగత స్టాఫ్‌తో పాటు కొందరు అభిమానులు కూడా లోలోపల దర్శకుడిని తిట్టుకున్నారట. అంతలా ఉన్న హీరోను ఇలా మార్చేశారేంటి అని వారు భావించారట. కానీ ఇప్పుడు స్క్రీన్‌పై తారక్ లుక్‌కు వస్తోన్న భారీ రెస్పాన్స్ చూశాక ఆ తిట్లే ప్రశంసలుగా మారిపోయాయని నీల్ నవ్వేసారు. నటుడిగా ఎన్టీఆర్ ప్రతిభ గురించి అందరికీ తెలిసిందే. కానీ క్యారెక్టర్ కోసం ఇంతలా కష్టపడే మొండి నటుడిని తాను ఎక్కడా చూడలేదని ప్రశాంత్ నీల్ తారక్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

తారక్ లాంటి జగమొండి నటుడు దొరకడం ఏ దర్శకుడికైనా అదృష్టమని ఆయన చూపించే ఈ డెడికేషనే సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుందని నీల్ అభిప్రాయపడ్డారు. దర్శకుడి నమ్మకాన్ని నిలబెట్టడం కోసం ఎంతటి రిస్క్ అయినా తీసుకోవడానికి తారక్ సిద్ధపడతారని ఈ సంఘటన మరోసారి నిరూపించింది. సరికొత్త మేకోవర్ డ్రాగన్ సినిమాపై అంచనాలను స్కై హైకి తీసుకెళ్లింది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రంలో తారక్ మునుపెన్నడూ లేని సరికొత్త గెటప్‌లో, ఊరమాస్ అవతారంలో కనిపించబోతున్నారని టీజర్ తో అర్దమైంది. పాత్ర కోసం హీరో పడ్డ జగమొండి కష్టం థియేటర్లలో ప్రేక్షకులకు ఏ స్థాయి పూనకాలను తెప్పిస్తుందో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu