Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తండ్రికి కన్నీటి వీడ్కోలు.. ప్రదీప్ రావత్ వారసుడు ఇతడే!

తండ్రికి కన్నీటి వీడ్కోలు.. ప్రదీప్ రావత్ వారసుడు ఇతడే!

Tupaki.com 2 weeks ago

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కు సంబంధించిన ఒక ఎమోషనల్ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఇన్ స్టాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో ప్రదీప్ రావత్ కుమారుడు తన తండ్రికి కన్నీటి నివాళి అర్పిస్తూ వీడ్కోలు పలకడం స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ హృదయవిదారక దృశ్యాన్ని చూసిన అభిమానులు, సినీ ప్రేమికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.

ప్రదీప్ రావత్ కేవలం బాలీవుడ్ చిత్రాలకే పరిమితం కాకుండా దక్షిణ భారత సినిమాలోనూ అత్యంత గుర్తింపు పొందిన నటుడు. ముఖ్యంగా తెలుగులో `సై` చిత్రంలో బిక్షు యాదవ్ పాత్రతో పాటు, ఛత్రపతి, గజినీ వంటి సినిమాల్లో విలన్‌గా తన విలక్షణ నటనతో ప్రేక్షకుల మనస్సులలో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన నటించిన ప్రతికూల పాత్రలు ఇప్పటికీ భారతీయ సినిమాలో ప్రత్యేకం.

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన కొద్ది సమయానికే విపరీతమైన స్పందనను రాబట్టింది. కామెంట్ సెక్షన్‌లో వేలాది మంది అభిమానులు `ఓం శాంతి` అని ప్రార్థిస్తూ భావోద్వేగ సందేశాలను పోస్ట్ చేస్తున్నారు. నెటిజన్లు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ తమ అభిమానాన్ని, విచారాన్ని సానుభూతి రూపంలో వ్యక్తం చేస్తున్నారు.

సామాజిక మాధ్యమాలలో అభిమానుల స్పందనలు రకరకాలుగా కొనసాగుతున్నాయి. కొందరు నెటిజన్లు ఆయన ఐకానిక్ పాత్రలను గుర్తుచేసుకుంటుండగా.. మరికొందరు సినీ ప్రముఖులు ఎంతమంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారనే విషయాలపై ఆరా తీస్తున్నారు. సినీ రంగంలో ప్రదీప్ రావత్ అందించిన సేవలు, ఆయన పోషించిన గుర్తింపు పొందిన పాత్రలు ఎప్పటికీ అభిమానుల గుండెల్లో నిలిచిపోతాయి.

ప్రదీప్ రావత్ నాలుగేళ్ల క్రితమే క్యాన్సర్‌ను జయించినా ఇటీవల అది మళ్లీ తిరగబెట్టడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గత నెల రోజులుగా ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడిన ఆయన, ప్లేట్‌లెట్ల సంఖ్య గణనీయంగా పడిపోయి పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. చివరి రోజుల్లో ఆయన పడిన వేదన అభిమానులను, చలనచిత్ర రంగాన్ని తీవ్రంగా కలచివేస్తోంది.

ఆయన మృతి చెందడానికి కొన్ని నెలల ముందు హోలీ పండుగ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వేడుకలో ఫొటోగ్రాఫర్లతో సరదాగా ముచ్చటిస్తూ ఎంతో ఆరోగ్యంగా కనిపించిన ఆయన ఆ తర్వాత క్యాన్సర్ తిరగబెట్టడంతో ఆసుపత్రి పాలై బయటి ప్రపంచానికి దూరమయ్యారు. ఆ సంతోషకరమైన క్షణాలే ఆయన చివరి జ్ఞాపకాలుగా మిగిలిపోవడంతో.. తమ అభిమాన నటుడిని తలుచుకుని ప్రేక్షకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu