Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణలో పవన్ ఎంట్రీపై ప్రొఫెసర్‌.. హాట్ కామెంట్స్‌!

తెలంగాణలో పవన్ ఎంట్రీపై ప్రొఫెసర్‌.. హాట్ కామెంట్స్‌!

Tupaki.com 2 weeks ago

తెలంగాణలో పార్టీ పెడతామని.. పోటీ చేస్తామని.. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రొఫెసర్ నాగేశ్వర్ కీలక కామెంట్స్ చేశారు.

ఊహించని విధంగా ప్రొఫెసర్ స్పందించారు.. కేంద్ర మంత్రి అమిత్‌షాతో పవన్‌, నాదెండ్ల మనోహర్ భేటీపై నాగేశ్వర్ చేసిన విశ్లేషణ అనంతరం జనసేన వర్సెస్ తెలంగాణ రాజకీయాల మధ్య వివాదాలు చోటు చేసుకున్నాయి. నాగేశ్వర్‌కు అండగా.. అక్కడి జర్నలిస్టు సంఘాలు కూడా మీడియా సమావేశాలు పెట్టి.. పవన్‌పై తీవ్ర విమర్శలు చేశాయి.

ఈ క్రమంంలో సహజంగానే ప్రొఫెసర్.. తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తారని, ఆయనకు తెలంగాణలో ఏం పని అని ప్రశ్నిస్తారని అనుకున్నారు. కానీ.. దీనికి భిన్నంగా ప్రొఫెసర్ నాగేశ్వర్.. పవన్ వ్యాఖ్యలను స్వాగతించారు. దేశంలో ఏ రాష్ట్రంలో పార్టీ పెట్టినా.. ఎవరైనా దేశంలో ఎక్కడైనా పోటీ చేసేందుకు అవకాశం ఉందని.. రాజ్యాంగం దీనిని అనుమతిస్తుందని తెలిపారు. పవన్ కల్యాణ్ పార్టీకి కూడా తెలంగాణలో పోటీ చేసేందుకు అర్హత, అవకాశం వంటివి పుష్కలంగా ఉన్నాయన్నారు. అంతేకా దు.. పవన్ కల్యాణ్ పార్టీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరే రిజిస్టర్ అయిందని, ఏపీలో కాదని గుర్తు చేశారు.

తెలంగాణ ప్రజల సమస్యలపైనా.. కేంద్రం నుంచి రావాల్సిన పథకాలు, హామీలను ప్రశ్నించేందుకు పవన్ కల్యాణ్ అయితే.. సరైన నాయకుడని ప్రొఫెసర్ వ్యాఖ్యానించారు. కేంద్రంలోని బీజేపీతో పవన్ కల్యాణ్‌కు మంచి అవినాభావ సంబంధాలు ఉన్నాయని గుర్తు చేశారు. ప్రధాని మోడీ కూడా.. పవన్ కాదు.. తుఫాన్ అంటూ మెచ్చుకున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సమస్యలను పరిష్కరించేందుకు, తెలంగాణ ప్రజల సమస్యలపై గళం వినిపించేందుకు పవన్ వస్తానంటే.. స్వాగతించాల్సిందేనని ఇతర పార్టీలకు కూడా ప్రొఫెసర్ సూచించారు.

రాజ్యాంగం భావప్రకటనా స్వేచ్ఛతో పాటు.. రాజకీయ స్వేచ్ఛ కూడా ఇచ్చిందని ప్రొఫెసర్ తెలిపారు. ఇప్పటికే రెండు ఎన్నికల్లో పవన్ తెలంగాణలో పోటీ చేశారని గుర్తు చేశారు. 2023 ఎన్నికల్లోనూ.. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పవన్ పార్టీ తరఫున ఎంతో మంది పోటీ చేశారని గుర్తు చేశారు. ఓటు బ్యాంకు ఉందా? లేదా? వస్తుందా? రాదా? అనేది పార్టీపరంగా చేపట్టే కార్యక్రమాలు.. ప్రజల్లో కల్పించే విశ్వసనీయతపైనే ఆధారపడి ఉంటాయన్నారు. తెలంగాణలోనే కాదు.. దేశంలో ఎక్కడైనా ఏ పార్టీ అయినా.. పోటీ చేసేందుకు రాజ్యాంగం అనుమతి ఇచ్చిందని తెలిపారు. పవన్‌ను తాను మనస్పూర్తిగా స్వాగతిస్తున్నానని ప్రొఫెస్‌ర్ వ్యాఖ్యానించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu