Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలుగు అమ్మాయిలు ఎందుకు వద్దన్నారంటే..

తెలుగు అమ్మాయిలు ఎందుకు వద్దన్నారంటే..

Tupaki.com 1 week ago

కికు యనమల, కాశిష్ ఖాన్ జంటగా నటించిన సర్వైవల్ సస్పెన్స్ థ్రిల్లర్ 'కికు చిరంజీవి'. హీరో గుండె కుడివైపు ఉండే 'డెక్స్ట్రోకార్డియా' అనే విభిన్నమైన పాయింట్ కి సైకో కిల్లర్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి శుభ సాయి వెంకట్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

కికు ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దీప్తి నడిమింటి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 28న థియేటర్లలో విడుదలైంది.

ఈ సినిమా రిలీజ్ కు ముందు నుంచే హీరోయిన్ కాశిష్ ఖాన్ వ్యవహారం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. షూటింగ్ సమయంలో, ఆ తర్వాత ప్రమోషన్స్ విషయంలో ఆమె నుంచి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని, పేమెంట్స్ విషయంలోనూ ఆమె ప్రవర్తన సరిగా లేదని నిర్మాత దీప్తి నడిమింటి గతంలో బహిరంగంగానే ఆరోపణలు చేశారు. ఈ కామెంట్స్ అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

అయితే అసలు ఈ సినిమాకు ఒక తెలుగు అమ్మాయిని కాకుండా నార్త్ హీరోయిన్ ను ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనే విషయంపై నిర్మాత దీప్తి మరో క్లారిటీ ఇచ్చారు. తెలుగు అమ్మాయిల గురించి, కొత్త టీమ్ తో పనిచేయడానికి వాళ్లు ఎందుకు భయపడతారో ఆమె చాలా ప్రాక్టికల్ గా వివరించిన తీరు ఆసక్తికరంగా మారింది.

ఒక తెలుగు అమ్మాయిగా, తెలుగు నిర్మాతగా తన మొదటి ప్రాధాన్యత ఎప్పుడూ తెలుగు హీరోయిన్లకే ఉంటుందని దీప్తి క్లారిటీ ఇచ్చారు. కానీ 'కికు చిరంజీవి' సినిమాలో ఉన్న ఒక రొమాంటిక్ సాంగ్ హీరోయిన్ సెలక్షన్ కు పెద్ద అడ్డంకిగా మారిందని ఆమె తెలిపారు. ఆ రొమాంటిక్ సన్నివేశాలు చేయడానికి చాలామంది తెలుగు అమ్మాయిలు ఇబ్బంది పడ్డారని, తాము చేయలేమని తేల్చి చెప్పేశారని దీప్తి వెల్లడించారు.

'బేబీ' సినిమాలో వైష్ణవి చైతన్య లాంటి తెలుగమ్మాయిలు బోల్డ్ గా చేశారు కదా అని ఒక ప్రశ్న ఎదురవగా.. దీప్తి చాలా జెన్యూన్ గా బదులిచ్చారు. ఆ సినిమాకు ఉన్న బ్యానర్, హీరో నేపథ్యం వేరని ఆమె గుర్తుచేశారు. కానీ తమ సినిమా విషయానికి వస్తే హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అంతా కొత్తవాళ్ళే కావడంతో.. ఇలాంటి కొత్త టీమ్ తో రొమాంటిక్ సీన్స్ చేస్తే తమ ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని తెలుగమ్మాయిలు ఆలోచిస్తారని ఆమె అసలు రీజన్ చెప్పారు.

ఇన్ని ఇబ్బందులు ఎదురైనా సరే తన తర్వాతి సినిమాలో కచ్చితంగా నూటికి నూరు శాతం తెలుగు హీరోయిన్ కే అవకాశం ఇస్తానని దీప్తి ధీమాగా చెప్పారు. ఒకవేళ ఆ సినిమాలో కూడా రొమాంటిక్ సీన్స్ ఉంటే పరిస్థితి ఏంటి అని అడగ్గా.. తాను కథను మాత్రమే నమ్ముతానని, కథ డిమాండ్ చేస్తే దానికి తగ్గట్లుగానే ముందుకు వెళ్తానని ఆమె క్లారిటీ ఇచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu