Dailyhunt
తెలుగులో అవకాశాలొచ్చినా మాతృభాషపై మమకారంతో!

తెలుగులో అవకాశాలొచ్చినా మాతృభాషపై మమకారంతో!

Tupaki.com 0 months ago

తెలుగు సినిమాల్లో అవకాశాల కోసం బాలీవుడ్ హీరోలే ఎదురు చూస్తున్నారు. చిన్న చిన్న ఆర్టిస్టులు సైతం టాలీవుడ్ లో ఎప్పుడు అవకాశం వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు.

కోలీవుడ్ నటులు కూడా తెలుగులో అవకాశాలు వస్తే కాదనకుండా పని చేస్తున్నారు. అలాగే మాలీవుడ్ , కన్నడ పరిశ్రమల నుంచి తెలుగులో అవకాశం వచ్చిందంటే? నో చెప్పరు. పారితోషికం డిమాండ్ చేయకుండా పని చేస్తుంటారు. కానీ మాలయాళ నటుడు టివినో థామస్ మాత్రం సొంత పరిశ్రమకు ఇచ్చిన ప్రాధాన్యతో పావు వంతు కూడా తెలుగు సినిమాకు ఇవ్వడం లేదని ఆయన మాటల్ని బట్టి తేలిపోయింది.

తెలుగు లో వస్తోన్న భారీ ఆఫర్లను టివినో థామస్ సున్నితంగా తిరస్కరించడం ఫిలిం నగర్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. కేవలం భాషాభిమానమే కాదు, తనను నమ్ముకున్న మలయాళ దర్శక నిర్మాతలకు అన్యాయం చేయకూడదనేది టివినో థామస్ ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. మలయాళ సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న టొవినోకు తెలుగులో ఇప్పుడిప్పుడే ఇమేజ్ ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ యాక్షన్ చిత్రం `డ్రాగన్` లో కీలక పాత్ర కోసం టివినో థామస్ ను సంప్రదించారు.

అయితే డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో పాటు మలయాళంలో తను అంగీకరించిన ప్రాజెక్టులు దెబ్బతినకూడదనే కారణంతో ఈ క్రేజీ ఆఫర్‌ను ఆయన వదులుకున్నారు. ఒక పాన్-ఇండియా స్టార్‌గా ఎదిగే అవకాశం ఉన్నప్పటికీ తన మూలాలను మర్చిపోకుండా ఉండటం ఆయన నైతికతకు నిదర్శనంగా చెప్పొచ్చు. ఇంత పెద్ద సినిమాలో ఛాన్స్ వస్తే ఏనటుడు వదలుకోడు. కానీ టివినో థామస్ మాత్రం చాలా ఈజీగా వదిలేసాడు. దీనికి సంబంధించి కొన్ని విలువైన కారణాలు కూడా చెప్పాడు. టాలీవుడ్‌లో ఒక సినిమా పూర్తి చేసే సమయానికి తాను మలయాళంలో నాలుగు నుండి ఐదు సినిమాలు చేయగలనని అభిప్రాయపడ్డాడు.

తెలుగు సినిమాల మేకింగ్ స్టైల్ , భారీ బడ్జెట్ చిత్రాలకు పట్టే సమయం తన కెరీర్ వేగానికి అడ్డంకిగా మారుతుందని ఆయన భావిస్తున్నాడు. మాతృభాషలో చిన్న , మధ్య తరహా బడ్జెట్ చిత్రాలతో నిరంతరం ప్రేక్షకులను అలరించడమే తనకిష్టమని టివినో థామస్ స్పష్టం చేశాడు. అక్కడ నిర్మాతల పట్ల ఆయన చూపిస్తున్న అంకితభావం ప్రశంసనీయం. ఒక పెద్ద ప్రాజెక్ట్ కోసం తన మాతృభాషలో కమిట్ అయిన చిత్రాలను వాయిదా వేయడం లేదా రద్దు చేయడం నిర్మాతలకు తీరని నష్టం కలిగిస్తుందని టొవినో బలంగా నమ్ముతున్నాడు.

అందుకే ఎంతటి భారీ రెమ్యునరేషన్ లేదా క్రేజీ కాంబినేషన్ ఎదురైనా తనను నమ్మి పెట్టుబడి పెట్టిన మలయాళ నిర్మాతలకు ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఈ నిజాయితీనే మలయాళ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోగానూ ముందుకు తీసుకెళ్లింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu