Monday, 28 Dec, 1.00 pm Tupaki.com

మూవీ న్యూస్
టీవీ నటి ఐస్ ఫ్రూట్ యాక్ట్ .. ఈవిడేమైనా సన్నీలియోనా?

ఏదో ఒక సెన్సేషన్ లేనిదే ఎవరూ గుర్తించరు. అందకే ఏదో ఒక సంచలనంతో యూత్ లోకి దూసుకెళ్లేందుకు ఈ సింగర్ కం టీవీ నటి ఎంతకు తెగిస్తోందో చూశారుగా..నిరంతరం ఏదో ఒక సెన్సేషన్ కోసం పాకులాడుతూ బికినీ బీచ్ యాక్ట్ తో.. పోల్ డ్యాన్స్ తో.. యోగా ఫీట్స్ తో మురిపిస్తున్న షామా సికందర్ ఈసారి ఏకంగా శృంగార తారనే తలపించే యాక్ట్ తో చర్చల్లోకొచ్చింది. ఇదిగో ఇలా ఐస్ ఫ్రూట్ యాక్ట్ తో దిమ్మతిరిగే ట్రీటిచ్చింది. ఈ ఫోటోలకు కామెంట్లు అంతే ఇదిగా ఉన్నాయి. మరీ టీవీ నటి ఇలా చెలరేగుతుంటే అభిమానుల మనోభావాలు గాయపడుతున్నాయి. ఈవిడేమైనా సన్నీలియోనా? ఎందుకింతగా చెలరేగిపోతోంది? అంటూ వ్యాఖ్యల్ని జోడిస్తున్నారు.

`మాయ` ఫేం షామా సికందర్ ఇటీవల బికినీలలో అద్భుతమైన ట్రీటిచ్చింది. తనదైన ఫిట్ బాడీతో వేడి పెంచుతున్న సదరు నటి ..
ఇటీవల `యే మేరీ లైఫ్ హై` పాత్రలో తన పాత్రకు మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ఈ బ్యూటీ నిరంతర బికినీ ట్రీట్ లో భాగంగా ఎరుపు- తెలుపు- నలుపు బికినీలలో హీట్ పెంచింది. మీరు బీచ్ విహారయాత్రకు వెళ్లాలని అనుకుంటే షామా మీకు డిజైనర్ బికినీల్ని ఎంపిక చేసేంత అనుభవజ్ఞురాలంటే అతిశయోక్తి కాదు. నిరంతరం ఇన్ స్టాగ్రామ్ లో అగ్గి రాజేయడంలో మేటి. హీటెక్కించే బికినీ ఫోటోలతో.. ఈత దుస్తులతో మెరుపులు మెరిపించేస్తుంది.

ఈ ఏడాదితో షామా సికందర్ కు 39 ఏళ్లు. టీవీ షో యే మేరీ లైఫ్ హై (2003-2005)లో పూజా మెహతా పాత్రలో భారతీయ స్టార్ బాగా ప్రసిద్ది చెందింది. ఆమె అమీర్ ఖాన్ `మన్ అండ్ ప్రేమ్ అగ్గన్` లలో కూడా కనిపించింది. బాలీవుడ్ సినిమాల్లోనూ కనిపించింది. ఆమె తన షార్ట్ ఫిల్మ్ `సెక్సాహోలిక్`.. `మాయా: స్లేవ్ ఆఫ్ హర్ డిజైర్స్`తో దుమారం రేపింది. షామా నిర్మాత గానూ మారింది. షామా సికందర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో తన సొంత సంస్థను కలిగి ఉంది. ఇందులో షామా మానసిక ఆరోగ్యం గురించి `అబ్ దిల్ కి సన్` అనే షార్ట్ మూవీ సిరీస్ ను నిర్మించింది.
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu
Top