Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ట్రంప్ జలసంధి...ఎక్కడ ఉంది ఏమా కధ ?

ట్రంప్ జలసంధి...ఎక్కడ ఉంది ఏమా కధ ?

Tupaki.com 3 days ago

మెరికా అగ్ర రాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్ మామూలు వారు కాదు అన్నది తెలిసిందే. ఆయన తలుచుకుంటే అర్ధరాత్రి యుద్ధాలు చేయగలరు, రాత్రికి రాత్రి వెనిజుల ప్రెసిడెంట్ ని ఏకంగా ఆయన పడక గదికి వెళ్ళి మరీ బంధీగా తెచ్చేయగలరు, చడీ చప్పుడు లేకుండా ఇరాన్ దేశాధినేత భవనాల మీద బాంబుల వర్షం కురిపించి లేపేయగలరు, ఇంకా చాలా చేయగలరు అన్నది ప్రపంచానికి తెలిసిన విషయమే.

ఇంకా తాను ఎన్నో చేయగలను అని తరచూ ట్రంప్ చెప్పుకుంటూ ఉంటారు కూడా. అంతే కాదు చిటిక వేస్తే యుద్ధాలు ఆపేస్తారు, అలాగే నీటిలో అగ్గి పుట్టించి యుద్ధాలు కూడా మొదలెట్టగలరు అని కూడా అంటారు.

శాంతి కాముకుడిగా :

ట్రంప్ లో రెండవ కోణం శాంతి కాముకుడిగా ఉండడం. తాను అనేక దేశాల మధ్య యుద్ధాలను ఆపి మరీ శాంతిని పరిరక్షించాను అని ట్రంప్ చెబుతూ ఉంటారు. అలా ఎన్నో దేశాలు ఉన్నాయని ఆయన చెప్పారు కూడా అదే సమయంలో యుద్ధాలను కూడా చేస్తారు, అయితే అది కూడా శాంతి కోసమే అని ట్రంప్ చెబుతూంటారు. ఇలా ట్రంప్ ఏది చేసినా ప్రపంచం కోసం ప్రపంచ శాంతి కోసమే అన్నది అంతా గుర్తెరగాలి. ఒకవేళ ఎవరికైనా డౌట్లు వస్తే తరచూ మళ్ళీ పెద్దన్న చెబుతూనే ఉంటారు కాబట్టి అపుడు క్లారిఫై చేసుకోవచ్చు. ఇక లేటెస్ట్ గా ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు.

హార్మూజ్ కాదు అంటూ :

ఇరాని వైఖరి మీద తరచూ మండిపడుతూ ఆ మీదటనే మెత్తబడుతూ ట్రంప్ చేసే రాజకీయ వ్యూహాలు అనబడే విన్యాసాలు ఎన్నో ఉంటాయని కూడా తెలిసిందే. ఇపుడు మరోసారి ఇరాన్ మీద ట్రంప్ మహాశయుడికి కోపం వచ్చింది. అంతే ఆయన లేటెస్ట్ గా ట్రంప్ హాట్ కామెంట్స్ చేశారు. హర్మూజ్‌ పేరు మారుస్తామంటూ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. దాని పేరుని ట్రంప్ జలసంధిగా మార్చాలా అంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే హర్మూజ్‌ జలసంధి మా కంట్రోల్‌లో ఉంది అని గట్టిగా చెప్పుకున్న ట్రంప్ హర్మూజ్‌ ఇంతకుముందు కంటే హాట్‌ హాట్‌గా ఉందిపుడు అని కూడా అన్నారు. సో తమ ఆధీనంలో ఉన్న హార్మూజ్ జలసంధికి వేరే పేరు ఎందుకు అని ఏకంగా ట్రంప్‌ జలసంధీగా పిలిస్తే పోలా అన్నదే పెద్దన్న ఆలోచన. ఆయన అంటున్నది ఎవరికైనా తమాషాగా అనిపిస్తే అది వారి తప్పు కావచ్చేమో కానీ ట్రంప్ మాత్రం యమ సీరియస్ గానే చెబుతున్నారు. సో హర్మూజ్ జల సంధి కాదు ట్రంప్ జల సంధి అని రేపటి నుంచి పిలిచినా ఆశ్చర్యం పోనవసరం లేదని అంటున్నారు.

అధికారం ఉందా :

అయితే ట్రంప్ జల సంధిగా పేరు మారుస్తామని ఆయన అన్నట్లుగా ప్రచారం అవుతున్న వార్తలను బట్టి చూస్తే అలా జరిగేందుకు వీలు ఉందా అన్న చర్చ వస్తోంది. హర్మూజ్ జలసంధి అనేది ఒమన్ ఇరాన్ దేశాల మధ్య ఉన్న ఒక వ్యూహాత్మక సముద్ర మార్గం. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో దాదాపు ఐదో వంతు అంటే 20 శాతం ఈ మార్గం గుండానే రవాణా అవుతుంది. ఈ నేపధ్యంలో ఒక అంతర్జాతీయ జలసంధి పేరును మార్చే అధికారం ఏ ఒక్క దేశ అధ్యక్షునికి లేదా అమెరికాకో ఉండదని అంటున్నారు. భౌగోళిక ప్రాంతాల పేర్లను మార్చడానికి అంతర్జాతీయ ఒప్పందాలు, ఐక్యరాజ్యసమితి నియమావళి ఉంటాయి అని గుర్తు చేస్తున్నారు. డోనాల్డ్ ట్రంప్ తన అధ్యక్ష కాలంలో ఇరాన్‌పై కఠినమైన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఇరాన్ పలుమార్లు హర్మూజ్ జలసంధిని మూసివేస్తామని హెచ్చరించడం దానికి ప్రతిగా అమెరికా కూడా గట్టి కౌంటర్లు ఇవ్వడం వల్ల ఈ ప్రాంతం ఎప్పుడూ హాట్ హాట్ గా ఉంటోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu