Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ట్రెండ్ బ్రేక్ చేస్తున్న పాన్ ఇండియా స్టార్స్!

ట్రెండ్ బ్రేక్ చేస్తున్న పాన్ ఇండియా స్టార్స్!

Tupaki.com 3 weeks ago

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పాన్-ఇండియా అనే పదానికి సరికొత్త అర్థం తెచ్చిన అగ్రనాయకులు ప్రభాస్. ఒక సినిమా విజయం సాధించిన తర్వాత సంవత్సరాల తరబడి గ్యాప్ తీసుకునే పాత పద్ధతికి స్వస్తి పకుతున్నారు.

ఒకదాని తర్వాత ఒకటిగా భారీ బడ్జెట్ చిత్రాలను లైన్‌లో పెట్టి బాక్సాఫీస్ వద్ద సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. సినిమా మార్కెట్ పరిధులను చెరిపేస్తూ ఇద్దరు స్టార్స్ చేస్తున్న వరుస ప్రాజెక్ట్‌లు ఇండియన్ సినిమా స్టామినాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నాయి. పాన్-ఇండియా బాక్సాఫీస్‌ను శాసిస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ వరుస చిత్రాల ప్రకటనలతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.

`బాహుబలి`, `సలార్`, `కల్కి 2898 ఏడీ` వంటి బ్లాక్‌బస్టర్ల తర్వాత ప్రభాస్ జోరు మరింత పెరిగింది. మారుతి దర్శకత్వంలో వచ్చిన `ది రాజా సాబ్తో` పాటు తాజాగా లై న్ లో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందుతున్న `స్పిరిట్` ..హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న `ఫౌజి` వంటి విభిన్న జోనర్‌ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఒకే సమయంలో భిన్నమైన కథలను ఎంచుకుంటూ ఏడాదికి ఒకటి కంటే ఎక్కువ సినిమాలతో అభిమానులను అలరించేలా ప్లాన్ చేసుకోవడం విశేషం.

మరోవైపు `కేజీఎఫ్` చిత్రంతో కన్నడ పరిశ్రమ నుంచి వచ్చి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాకింగ్ స్టార్ యశ్ కూడా ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ `టాక్సిక్` చిత్రంతో పాటు, ఇండియన్ మైథలాజికల్ ప్రాజెక్ట్‌గా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న నితేష్ తివారీ `రామాయణ` చిత్రంలోనూ యశ్ నటిస్తున్నారు. నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాణ రంగంలోనూ భాగస్వామ్యమవుతూ గ్లోబల్ ఆడియన్స్‌ను టార్గెట్ చేసి సాగిస్తున్న ప్రయాణం టాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీలకు కూడా ఆదర్శంగా నిలుస్తోంది.

సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు అంటే షూటింగ్ పూర్తి కావడానికి, ప్రమోషన్స్‌కు చాలా సమయం పడుతుంది. కానీ ఇద్దరు పాన్-ఇండియా స్టార్లు మాత్రం ప్రీ-ప్రొడక్షన్ దశలోనే తదుపరి చిత్రాలను సెట్స్ పైకి తీసుకువెళ్లేలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. దీనివల్ల నిర్మాతలకు పెట్టుబడి పరంగా భద్రత కలగడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద సినిమాల మధ్య గ్యాప్ తగ్గి నిరంతరం సందడి నెలకొంటుంది. ఇండస్ట్రీలో ఎప్పుడూ ఒకే రకమైన హైప్ కంటిన్యూ కావడానికి ఈ స్ట్రాటజీ ఎంతగానో ఉపయోగపడుతోంది.

ఈ ట్రెండ్ కేవలం కమర్షియల్ సక్సెస్ పరంగానే కాకుండా టెక్నికల్ వాల్యూస్ పరంగా కూడా భారతీయ సినిమా స్థాయిని పెంచుతోంది. విభిన్న దర్శకులతో ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూనే కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా చూసుకోవడంలో ప్రభాస్, యశ్‌లు దిట్ట అనిపించుకుంటున్నారు. ఒక సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తదుపరి ప్రాజెక్ట్‌లపై వారు చూపిస్తున్న శ్రద్ధ, కమిట్‌మెంట్ ఇతర యంగ్ హీరోలకు కూడా పాన్-ఇండియా లెవెల్ వర్కింగ్ స్టైల్‌ను నేర్పుతు న్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu