Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉదయనిధి చెప్పింది కరెక్ట్..మాది సేమ్ పాలసీ అంటూ..టీవీకే!

ఉదయనిధి చెప్పింది కరెక్ట్..మాది సేమ్ పాలసీ అంటూ..టీవీకే!

Tupaki.com 1 week ago

మిళనాడులో కొత్తగా అధికారంలోకి వచ్చిన టీవీకే పార్టీ తన ఫిలాసఫీని మరోసారి ఫుల్ క్లారిటీగా చెప్పింది. ఆ పార్టీ మంత్రి దీని మీద కీలక వ్యాఖ్యలు చేశారు.

నిజం చెప్పాలంటే ఇంత క్లారిటీగా ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కూడా ఎక్కడా చెప్పినది లేదు. రెండేళ్ళ వయసు ఉన్న ఆ పార్టీ విధానాలు సిద్ధాంతాలు అన్నీ కూడా యాంటీ బీజేపీగానే ఉన్నాయని అనుకున్నారు. ఇపుడు బలమైన ఫిలాసఫీ తమది అని టీవీకే స్ట్రాంగ్ గా చెప్పుకుంటోంది. తాము హిందుత్వను తీవ్రంగా వ్యతిరేకిస్తామని అంటోంది.

హిందువులకు కాదు :

తాము హిందువులకు వ్యతిరేకం కాదని హిందూత్వానికే అని టీవీకే మంత్రి ఆధవ్ అర్జున స్పష్టం చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూత్వ అంటే కూడా టీవీకే ఆలోచనల నుంచి నిర్వచనం కూడా చెప్పారు. ఒకే మతం ఉండాలని ఫోర్స్ చేసే విధానంగా ఆయన పేర్కొంటూ దానిని తాము వ్యతిరేకిస్తామని అన్నారు. అంతే కాదు హిందూత్వలో అసమానతలు ఉన్నాయని అన్నారు. కులాలు అలాగే మహిళలను బానిసలుగా చూసే ధోరణి ఉంటుందని అందుకే తాము వ్యతిరేకమని అన్నారు. అదే సమయంలో హిందువుల ఆలోచనలను మనోభావాలను తాము గౌరవిస్తామని అన్నారు.

అన్ని కులాలూ మతాలు సమానం :

టీవీకేకి అన్ని కులాలు మతాలు సమానమే అని ఆధవ్ అర్జున అన్నారు. భారత రాజ్యాంగం ఏదైతే నిర్వచించిందో దాని ప్రకారం తాము అందరినీ ఒకేలా చూస్తామని అన్నారు. ఈ విషయంలో తాము ఏ మాతానికి దగ్గర కానీ దూరం కానీ జరిగేది ఉండదని అన్నారు. ఇదిలా ఉంటే సనాతన ధర్మానికి కూడా ఆయన ఒక నిర్వచనం ఇచ్చారు. ఉత్తర భారతాన సనాతన ధర్మం అంటే హిందూత్వం కావచ్చు కానీ తమిళనాడులో అసమానతలు అని అన్నారు. అందుకే తాము సనాతన ధర్మ భావనకు వ్యతిరేకం అన్నారు.

ఉదయనిధి చెప్పింది కరెక్ట్ :

ఇదిలా ఉంటే అసెంబ్లీలో డీఎంకేకి చెందిన ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చెప్పినది కరెక్ట్ అని టీవీకే మంత్రి ఆధవ్ అర్జున సమర్ధించడం విశేషం. ఆయన చెప్పాలనుకున్నది వేరు అని కానీ సనాతన ధర్మ గురించి చెప్పారని అన్నారు. సనాతన ధర్మ అంటే వేరేది కాదని హిందూత్వమే అని ఆధవ్ అర్జున చెప్పారు. తాము కూడా ఆ విషయంలో సేమ్ పాలసీతో ఉన్నామని అన్నారు. అసమానతలతో కూడున్న దేనిని అయినా తాము వ్యతిరేకిస్తామని ఆయన చెప్పారు. సనాతన ధర్మ అంటే తమిళనాడులో కులాల విధానం అని అన్నారు. ఈ కులాల మధ్య అసమానతలు అలాగే మహిళల పట్ల చిన్న చూపు ఇవన్నీ తమిళనాడులో ఎప్పటి నుంచో వ్యతిరేకించే భావన ఉందని అన్నారు.

మాది సేమ్ పాలసీ అంటూ :

ఒక విచిత్రమైన కామెంట్ ని కూడా టీవీకే మంత్రి ఆధవ్ అర్జున చేశారు. తమది డీఎంకేది సేమ్ పాలసీ అంటూ ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలే చేశారు. ఒక అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఒకే విధానాలతో ఉంటోందని చెప్పడమూ రాజకీయ విశేషమే. అదే సమయంలో విపక్ష నేత అన్న మాటలలో తప్పు లేదని చెప్పడం ఇంకా విశేషం. అయితే ఉదయనిధి స్టాలిన్ తన వ్యాఖ్యల మీద మరింత క్లారిటీ ఇవ్వాలని ఆయన కోరారు. మొత్తం మీద చూస్తే కనుక హిందూత్వకు వ్యతిరేకం అని చెప్పడం అంటే హిందూత్వ మీద పూర్తి పేటెంట్ హక్కులతో ముందుకు సాగుతున్న బీజేపీకి కూడా పక్కా వ్యతిరేకం అన్నట్లుగానే టీవీకే తన పొలిటికల్ స్టాండ్ కూడా చెప్పినట్లు అయింది అని అంటున్నారు. చూడాలి మరి ముందు ముందు టీవీకే ఫిలాసఫీలోని మరెన్ని విశేషాలు ఉన్నాయో వాటిని మంత్రులు కానీ నాయకులు కానీ ఇంకెంత సీరియస్ గా విశ్లేషించి జనంలో చర్చ పెడతారో.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu