Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉదయనిధి స్టాలిన్ విడుదల..  సంచలనం కాస్తా బెయిల్ తో సద్దుమణిగిందిలా..

ఉదయనిధి స్టాలిన్ విడుదల.. సంచలనం కాస్తా బెయిల్ తో సద్దుమణిగిందిలా..

Tupaki.com 5 days ago

మిళనాడు రాజకీయాల్లో ఎప్పుడు ఏ డ్రామా నడుస్తుందో ఊహించడం చాలా కష్టం. ఒకవైపు కావేరీ జలాలు.. మరోవైపు పొలిటికల్ సెగలు.. వీటన్నింటి మధ్యలోకి ఒక హీరోయిన్ పేరు రావడం..

దానిపై పెద్ద రాజకీయ రచ్చ జరగడం నిజంగా ఒక విచిత్రమైన ట్విస్ట్. సభలో ఎవరో డీఎంకే కార్యకర్తలు త్రిష అని అరిస్తే.. దానికి ఉదయనిధి స్టాలిన్ సరదాగా ఏదో సమధానం చెప్పడం.. అది కాస్తా ద్వంద్వార్థాల కామెంట్ అని పెద్ద వివాదం కావడం చూస్తుంటే మన పొలిటీషియన్లకు ఎంత ఖాళీ సమయం ఉందో అర్థమవుతుంది. "అయ్యా నేను అన్నది కావేరీ నీళ్ల గురించి, నటి గురించి కాదు" అని ఉదయనిధి గారు ఎంత మొత్తుకున్నా అధికార టీవీకే పార్టీ నాయకులు మాత్రం వదిలిపెట్టలేదు. సీఎం విజయ్ మార్క్ పొలిటికల్ మాస్ యాక్షన్ ప్లాన్ వెంటనే అమలులోకి వచ్చేసింది. మహిళల గౌరవం పేరిట టీవీకే ఫిర్యాదులు చేయడం పోలీసులు రంగంలోకి దిగిపోవడం క్షణాల్లో జరిగిపోయాయి.

మంగళవారం ఉదయాన్నే చెన్నైలోని ఉదయనిధి నివాసానికి పోలీసులు వెళ్లడం.. ఆయనను అదుపులోకి తీసుకుని తంజావూరు జిల్లా సెంగిపట్టి పోలీస్ స్టేషన్‌కు తరలించడం చూస్తే ఎదో రజనీకాంత్, విజయ్ సినిమాల్లో ఇంటర్వెల్ బ్యాంగ్ గుర్తుకొచ్చింది. గంటన్నర పాటు విచారణల పేరుతో పోలీస్ స్టేషన్‌లో హంగామా నడిచింది. బయట డీఎంకే శ్రేణుల నినాదాలు, హడావుడితో ప్రాంతమంతా మారుమోగిపోయింది. ఏదో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేద్దామని భావించిన టీవీకే ప్రభుత్వ ఆశలపై మద్రాస్ హైకోర్టు వచ్చి నీళ్లు చల్లింది. ఉదయనిధి న్యాయవాదులు అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించడంతో కథ మొత్తం ఒక్కసారిగా అడ్డం తిరిగింది.

కోర్టులో విచారణ సందర్భంగా ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ గారు లొంగిపోక తప్పలేదు. ఉదయనిధిని జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపే ఉద్దేశం పోలీసులకు ఎంతమాత్రం లేదని.. కేవలం విచారణ పూర్తి చేసి స్టేషన్ బెయిల్ ఇస్తామని కోర్టుకు వివరణ ఇచ్చారు. అంత పెద్ద హంగామా చేసి ఉదయాన్నే అరెస్ట్ చేసి, చివరికి స్టేషన్ బెయిల్ ఇస్తామని చెప్పడం చూసి కోర్టు కూడా విచారణ ముగియగానే వెంటనే విడుదల చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేసింది. దీంతో సాయంత్రానికి ఉదయనిధి హాయిగా బయటకు వచ్చేశారు. విచారణ పూర్తయి బయటకు వచ్చిన ఉదయనిధికి ఆయన అనుచరులు ఘన స్వాగతం పలికారు.

మొత్తానికి ఉదయాన్నే అరెస్ట్ డ్రామాతో భయపెడదామనుకున్న సీఎం విజయ్ వ్యూహం.. హైకోర్టు జోక్యంతో చిన్నబోయింది. రాజకీయాల్లో ఇటువంటి చిన్నచిన్న విషయాలకే కేసులు, అరెస్టుల దాకా వెళ్లడం రాబోయే రోజుల్లో టీవీకే, డీఎంకేల మధ్య ఎలాంటి పొలిటికల్ సినిమా చూపించబోతోందో ముందే సూచిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu