Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉండి.. వైసీపీలో ఏం జరుగుతోంది.. ?

ఉండి.. వైసీపీలో ఏం జరుగుతోంది.. ?

Tupaki.com 2 days ago

మ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గంలో వైసీపీ రాజకీయాలు ఎలా సాగుతున్నాయి? గత ఎన్నికల సమయంలో పోటీ చేసిన పీవీఎల్ నరసింహరాజు ప్రస్తుతం ఏం చేస్తున్నారు?

అసలు వాయిస్ వినిపిస్తున్నారా? అనే అంశాలు ఆసక్తిగా మారాయి. పార్టీ లోనే రాజుగారు ఉన్నప్పటికీ.. పార్టీ తరఫున కార్యక్రమాలు మాత్రం నిర్వహించలేక పోతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఆయనకు అనుకూలంగా లేవని చెబుతున్నారు.

నిజానికి ఉండి నియోజకవర్గంలో టీడీపీ హవా ఎక్కువగానే ఉంటుంది. తాజాగా ఇక్కడ నుంచి రఘురామ కృష్ణరాజువిజయం దక్కించుకున్నాక.. క్షత్రియ సామాజిక వర్గం మరింత ఎక్కువగా ఐకమత్యం చూపిస్తోంది. దీంతో రఘురామకే ఆ వర్గం జై కొడుతోంది. పైగా.. రఘురామ ఎప్పటికప్పుడు ఫైర్ బ్రాండ్ నాయకుడిగా దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి తోపాటు.. పార్టీ తరఫున కూడా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ పరిణామాలు టీడీపీలో జోష్ పెంచుతున్నాయి.

అయితే.. విపక్ష నేతగా.. లేదా.. గత ఎన్నికల్లో పోటీ చేసిన నాయకుడిగా.. నరసింహరాజు తన గ్రాఫ్‌ను పెంచు కునేందుకు ప్రయత్నాలు చేయాల్సి ఉంది. కానీ.. ఆయన తన సొంత సామాజిక వర్గంపైనే అక్కసుతో ఉన్నారన్న వాదన వినిపిస్తోంది. గత ఎన్నికల్లో తనను గెలిపిస్తామని చెప్పిన నాయకులు తనకు హ్యాండిచ్చారని.. చాల నష్టపోయానని ఆయన వాపోతున్నారు. వాస్తవానికి రాజకీయాల్లో ఇవన్నీ కామనే. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇస్తారు. అవన్నీ అవుతాయా? అంటే కష్టమే.

అలానే.. అండగా ఉంటామని చెప్పిన వారంతా.. అండగా ఉండాలని ఏమీ లేదు. అయినా.. అందరినీ కలుపుకొని పోయి.. రాజకీయాలను సుస్థిరం చేసుకునే దిశగా అడుగులు వేయాల్సిన రాజు గారు..ఇప్పుడు.. రెండు సంవత్సరాలు గడిచిపోయినా.. ఇంకా అలక పాన్పు దిగలేదని అంటున్నారు. ఇక, పార్టీ తరఫున కార్యక్రమాలు కూడా నిర్వహించడం లేదు. పైగా.. పార్టీకార్యాలయానికి (తాడేపల్లి) వచ్చి.. ఇక్కడే తిష్టవేస్తున్నారని.. నియోజకవర్గంలో పర్యటించడం లేదన్నవాదన కూడా వినిపిస్తుండడం గమనార్హం. సో.. ఈ పరిణామాలతో ఉండి నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి దిగజారుతోందని అంటున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu