Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
USలో 'పెద్ది'.. ఇది కదా చరణ్ క్రేజ్ అంటే..

USలో 'పెద్ది'.. ఇది కదా చరణ్ క్రేజ్ అంటే..

Tupaki.com 1 week ago

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ పెద్ది విడుదలకు ముందే ఓవర్సీస్ మార్కెట్‌ లో మంచి హైప్‌ సొంతం చేసుకుంటోంది.

జూన్ 4వ తేదీన వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఆ సినిమాకు నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ఓ రేంజ్ లో రెస్పాన్స్ రావడం.. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

సినిమా విడుదలకు ఇంకా సమయం ఉండగానే నార్త్ అమెరికా ప్రీమియర్స్‌ కు సంబంధించిన ప్రీ సేల్స్ ఫుల్ జోష్ లో సాగుతున్నాయి. తాజాగా మూవీ టీమ్ విడుదల చేసిన సమాచారం ప్రకారం, అక్కడి ప్రీమియర్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ 9 లక్షల డాలర్ల మార్క్‌ ను దాటాయి. మిలియన్ డాలర్ల దిశగా బుకింగ్స్ దూసుకెళ్తుండటంతో అభిమానుల్లో మరింత జోష్ ఇప్పుడు కనిపిస్తోంది.

ఓవర్సీస్ మార్కెట్‌ లో ముఖ్యంగా అమెరికా ప్రేక్షకుల నుంచి తెలుగు సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. స్టార్ హీరోల చిత్రాలకు అయితే రిలీజ్ కు ముందే భారీ స్థాయిలో టికెట్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు పెద్ది కూడా అదే లిస్ట్ లోకి చేరినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా రామ్ చరణ్‌ కు అమెరికాలో ఉన్న అభిమానులు.. సినిమాపై ఫుల్ గా ఆసక్తి చూపుతున్నట్లు క్లియర్ గా తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్‌ కు ఇంటర్నేషనల్ రేంజ్ లో గుర్తింపు మరింత పెరిగింది. ఆ సినిమా వరల్డ్ వైడ్ గా విజయాన్ని సాధించడంతో ఓవర్సీస్ లో కూడా ఆయనకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఆ ఎఫెక్ట్ పెద్ది అడ్వాన్స్ బుకింగ్స్‌ పై కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విడుదలకు ముందే భారీ రేంజ్ లో రెస్పాన్స్ రావడం సినిమాపై ఉన్న అంచనాలను చెబుతోంది.

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ ఎలిమెంట్స్ తో యాక్షన్ డ్రామాగా పెద్ది తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచాయి. రామ్ చరణ్ కొత్త లుక్, దర్శకుడు బుచ్చిబాబు సనా ప్రెజెంటేషన్, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిత్రంలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్‌ గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

అలాగే జగపతిబాబు, దివ్యేందు శర్మ, విజి చంద్రశేఖర్ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం మరో విశేషం. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కూడా సినిమాకు వర్క్ చేయడం విశేషం. భారీ స్థాయిలో రూపొందిన ఆ చిత్రం టాలీవుడ్‌ లో అత్యధిక బడ్జెట్ సినిమాల్లో ఒకటిగా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే నార్త్ అమెరికాలో జరుగుతున్న బుకింగ్స్ చూస్తుంటే, పెద్దికి ఓపెనింగ్స్ స్ట్రాంగ్ గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రీ సేల్స్ ట్రెండ్ ఇదే రేంజ్ లో కంటిన్యూ అయితే విడుదలకు ముందే మిలియన్ డాలర్ల మార్క్ చేరుకునే అవకాశం ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా.. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద పెద్ది ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో జూన్ 4న తేలనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu