Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వేలానికి 'రాష్ట్రపతి కానుకలు'.. కొంటారా.. వివరాలు ఇవే!

వేలానికి 'రాష్ట్రపతి కానుకలు'.. కొంటారా.. వివరాలు ఇవే!

Tupaki.com 2 weeks ago

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు.. దేశవ్యాప్తంగానే కాకుండా.. ఆమె పలు విదేశాలలో పర్యటించిన సమయంలో లభించిన కానుకలు, శాలువాలు, జ్ఞాపికలు, పుస్తకాలను వేలం వేయనున్నారు.

దీనికి సంబంధించి రాష్ట్రపతి కార్యాలయం తాజాగా ప్రకటన జారీ చేసింది. 'ఉపహార్‌' పేరుతో నిర్వహిస్తున్న 'ఈ-వేలం' ప్రక్రియలో ఎవరైనా పాల్గొనవచ్చని తెలిపింది. అయితే.. టోకుగా కొనుగోలు చేసేవారికి తొలుత ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు పేర్కొంది. ఆన్‌లైన్‌లోనే ఈ ప్రక్రియను నిర్వహిస్తామని వెల్లడించింది.

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు వివిధ కార్యక్రమాలలో అందిన బహుమతులు, జ్ఞాపికలను పారదర్శకంగా ఆన్‌లైన్‌లో బహిరంగ వేలం వేసే ప్రక్రియ ప్రారంభమైందని రాష్ట్రపతి నిలయం తెలిపింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పదవీకాలం నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ-ఉపహార్ ప్రక్రియ ద్వారా 'ఆన్‌లైన్' పోర్టల్లో వీటిని వేలం వేయనున్నట్టు పేర్కొంది. వివరాలు నమోదు చేసుకున్నవారికి.. వేలం ప్రక్రియకు సంబంధించిన వివరాలను పంపించనున్నట్టు తెలిపింది. ప్రస్తుతం ఈ-వేలం ప్రక్రియ మూడో దని.. ఇప్పటికి రెండు సార్లు రాష్ట్రపతికానుకలను వేలం వేసినట్టు పేర్కొంది.

ఇదీ.. పోర్టల్‌

ఈ వేలంలో సుమారు 300 ఎంపిక చేసిన బహుమతులు అందుబాటులో ఉన్నాయని రాష్ట్రపతి కార్యాలయం పేర్కొంది. అలానే దుస్తులు, దుపట్టాలు, శాలువాలు, జ్ఞాపికలు వేర్వేరుగా ఉన్నట్టు పేర్కొంది. ఆసక్తి గలవారు upahaar.rashtrapatibhavan. gov.in అనే పోర్టల్‌లో తమ బిడ్‌లను నమోదు చేయవచ్చని వివరించింది. ఈ వేలం ద్వారా సమకూరే మొత్తం ఆదాయాన్ని సామాజిక సేవా కార్యక్రమాల కోసం వినియోగిస్తారని, బ్యాంకు చలానాల రూపంలో సొమ్మును జమ చేయాల్సి ఉంటుందని వివరించింది. ఇక, వేలంలో పాల్గొనేందుకు సరిహద్దులు ఏమీ లేవని పేర్కొనడం గమనార్హం.

దేశంలోని వారు విదేశాల్లోని ప్రవాసభారతీయులు సహా.. ఈ వేలంలో పాల్గొనవచ్చు. అలానే.. విదేశీయులు సైతం వేలం లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. అయితే.. వారికి ప్రత్యేక సూచనలు ఉంటాయని, దాని ప్రకారం ధరల నిర్ణయం జరుగుతుం దని వివరించింది. ఇక, రాష్ట్రపతి కానుకల్లో పట్టు చీరలు, దుస్తులు, శాలువాలు, వివిధదేశాలకు వెళ్లినప్పుడు.. అక్కడ బహూకరించిన పేయింట్స్‌, జ్ఞాపికలు, దేశంలోని పలు కళాఖండాలు వంటివి కూడా ఉన్నాయని రాష్ట్రపతి భవన్ వివరించింది. ఈ నగదును సేవా కార్యక్రమాలతోపాటు అనాథ ఆశ్రమాలకు విరాళాలుగా ఇవ్వనున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu