Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వెండి తెరకు దూరంగా మర్చంట్ నేవీ ఆఫీసర్!

వెండి తెరకు దూరంగా మర్చంట్ నేవీ ఆఫీసర్!

Tupaki.com 1 week ago

ప్రపంచ సుందరి, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన భారతీయ నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్ జీవితం ఎప్పుడూ మీడియా వెలుగుల్లోనే ఉంటుంది. అయితే ఆమె కుటుంబానికి చెందిన వారు మాత్రం చాలావరకు పబ్లిసిటీకి దూరంగా, ప్రశాం తమైన వ్యక్తిగత జీవితాన్ని గడపడానికే ప్రాధాన్యత ఇస్తారు.

ఈ క్రమంలోనే ఐశ్వర్యా రాయ్ సొంత అన్నయ్య ఆదిత్యా రాయ్ జీవిత విశేషాలు, ఆయన వృత్తిపరమైన ప్రయాణం ఇటీవల అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చగా మారింది.

క్యాపిటల్ కృష్ణరాజ్ రాయ్ - బృందా రాయ్ దంపతులకు జన్మించిన ఆదిత్యా రాయ్ చెల్లెలు ఐశ్వర్య కంటే పెద్దవారు. గ్లామర్ ప్రపంచానికి ఏమాత్రం సంబంధం లేని రంగంలో కెరీర్‌ను ప్రారంభించిన ఆదిత్య సుదీర్ఘ కాలం పాటు మర్చంట్ నేవీలో ఇంజనీర్‌గా సేవలు అందించారు. సముద్ర ప్రయాణాలు , అత్యంత క్రమశిక్షణతో కూడిన నేవీ ఉద్యోగంలో ఆయన సంవత్సరాల తరబడి విజయవంతంగా కొనసాగుతున్నారు.

మర్చంట్ నేవీలో వృత్తిపరమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నప్పటికీ చెల్లెలి సినీ ప్రయాణానికి మద్దతుగా నిలిచేందుకు ఆయన కొద్దికాలం చలనచిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. 2003లో ఐశ్వర్యా రాయ్ - అర్జున్ రాంపాల్ జంటగా నటించిన `దిల్ కా రిష్తా` చిత్రానికి ఆదిత్యా రాయ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాకు వారి తల్లి బృందా రాయ్ కథను అందించడం విశేషం.

ఆ తర్వాత కూడా చిత్ర పరిశ్రమలోనే స్థిరపడే అవకాశాలు ఉన్నప్పటికీ ఆదిత్యా రాయ్ గ్లామర్ రంగానికి దూరంగా ఉండటానికే మొగ్గు చూపారు. `దిల్ కా రిష్తా` తర్వాత ఆయన పూర్తిస్థాయి నిర్మాణానికి స్వస్తి చెప్పి తిరిగి తన వ్యక్తిగత వ్యాపారాలు ..కుటుంబ బాధ్యతలపైనే దృష్టి సారించారు. ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉంటూ సొంత ప్రయాణాన్ని సాగించడంలో ఆదిత్యా రాయ్ ప్రత్యేకతను చాటుకున్నారు.

ఇక ఆదిత్యా రాయ్ వైవాహిక జీవిత విషయానికి వస్తే ఆయన 1999 మోడల్ అండ్ మిసెస్ ఇండియా రన్నరప్ శ్రీమా రాయ్‌ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. శ్రీమా రాయ్ ప్రస్తుతం ప్రముఖ డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌గా .. లైఫ్‌స్టైల్ బ్లాగర్‌గా రాణిస్తున్నారు. ఆదిత్య మాత్రం చాలా అరుదుగా మాత్రమే ఆమె సోషల్ మీడియా పోస్టుల్లో కనిపిస్తారు. వీలైనంత వరకూ ప్రైవేట్ లైఫ్‌నే ఆదిత్య ఎక్కువగా ఇష్టపడతారు.

మొత్తానికి చెల్లెలు గ్లోబల్ ఐకాన్‌గా దేశదేశాల్లో గుర్తింపు పొందినా? ఆదిత్యా రాయ్ మాత్రం మర్చంట్ నేవీ ఆఫీసర్‌గా తనదైన గుర్తింపును సంపాదించుకుని..కుటుంబ విలువలకు పెద్దపీట వేస్తున్నారు. గ్లామర్ ప్రపంచపు నీడ పడకుండా లైమ్‌లైట్‌కు దూరంగా గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్న ఆదిత్య ప్రయాణం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu