Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విడాకులు తీసుకున్న భర్తకు మద్దతుగా హీరోయిన్లు!

విడాకులు తీసుకున్న భర్తకు మద్దతుగా హీరోయిన్లు!

Tupaki.com 6 days ago

కోలీవుడ్ హీరో జయం రవి భార్య ఆర్తి రవితో ఎదుర్కొంటున్న వైవాహిక వివాదం రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. తన విడాకుల ప్రక్రియ ముగిసే వరకు ఏ సినిమాలోనూ నటించనని సంచలన ప్రకటన చేశారు.

తనపై బ్లాక్ మ్యాజిక్ ప్రయోగాలు జరిగాయని, మానసిక క్షోభతో రక్తం కూడా కక్కుకున్నానని ఆయన చేసిన ఆరోపణలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో రవికి తోటి సినీ ప్రముఖుల నుండి ఊహించని మద్దతు లభిస్తోంది. తాజాగా ప్రియాంక చోప్రా కజిన్ నటి మీరా చోప్రాతో పాటు సీనియర్ నటి అంబిక కూడా రవికి సపోర్ట్‌గా తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

`సౌత్ సినిమాల్లో పనిచేస్తున్నప్పటి నుండి నాకు జయం రవి తెలుసు. ఆయన ఎంతో మంచివాడు. నిరాడంబరుడు. ప్రస్తుతం ఆయన ఎదుర్కొంటున్న పరిస్థితులు చూశాక నేను చెప్పదలచుకున్నది ఒక్కటే. ప్రతిసారీ పురుషుడే తప్పు చేస్తాడనుకోవడం కరెక్ట్ కాదు. మహిళలకు అనుకూలంగా ఉన్న చట్టాలను కొంతమంది మహిళలు దుర్వినియోగం చేయడం నేను చాలా చోట్ల చూస్తున్నాను` అంటూ మీరా సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయపోరాటంలో రవికి ఖచ్చితంగా న్యాయం దక్కుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

అలాగే 80వ దశకంలో చిరంజీవి, రజనీకాంత్ వంటి అగ్ర హీరోలతో నటించిన సీనియర్ నటి అంబిక కూడా రవి పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రెస్ మీట్‌లో రవిని అలా చూడటం తనకు చాలా బాధ కలిగించిందన్నారు. మానసిక ఒత్తిడి వల్ల రవి ముఖంలో కళ తప్పిందని, కళ్లలోనే ఆ బాధ కనిపిస్తోందని అంబిక పేర్కొన్నారు. రవి జీవితంలో ఈ నరకం త్వరలోనే ముగిసిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆయన సమస్యలను ఆయనే పరిష్కరించుకోగలరని ప్రస్తుతానికి సమాజం , మీడియా ఆయనను ఒంటరిగా వదిలేయడం మంచిదని సూచించారు.

బాధకు ఆడ, మగ అనే తేడా ఉండదు. అది ఎవరికైనా ఒకేలా ఉంటుంది. ప్రస్తుతం ఎవరినీ విమర్శించడం లేదా ఒకరి వైపే మాట్లాడటం సరికాదు. అసలు విషయం ఏంటో పూర్తిగా తెలియకుండా కామెంట్లు చేయడం మానేసి వారి సమస్యలను వారే పరిష్కరించుకునేలా వదిలేయాలి అని అంబిక హితవు పలికారు. ఇద్దరు భాగస్వాములకు కూడా మంచి జరగాలని, దేవుడే వారికి సహాయం చేయాలని ప్రార్థించారు. మరోవైపు నిర్మాత సుజాత విజయ్‌కుమార్ కూడా స్పందించారు. రవి మోహన్ చేస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. ఈ వివాదాల వల్ల తన మనవడు (రవి కుమారుడు) తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.

రవి తన కుమారులను కలవడానికి కూడా ఆర్తి అనుమతించడం లేదనే ఆరోపణలు కూడా రావడంతో ఫ్యామిలీ డ్రామా ఇరు కుటుంబాల మధ్య పెద్ద యుద్ధానికే దారితీసినట్లు తెలుస్తోంది. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు ప్రజాక్షేత్రంలోకి వచ్చినప్పుడు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఎలా విడిపోతాయో? ఈ సంఘటన నిరూపిస్తోంది. ఒకప్పుడు ఆదర్శ దంపతులుగా ఉన్న రవి-ఆర్తిల వివాదం ఇప్పుడు చట్టపరమైన సవాళ్లు, వ్యక్తిగత ఆరోపణల మధ్య నలుగుతోంది. రాబోయే రోజుల్లో ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో? రవి మోహన్ మళ్లీ కెమెరా ముందుకు ఎప్పుడు వస్తారా? అన్నది కోలీవుడ్ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu