Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వీడియో: రష్మికను ఇంతగా ఏడిపించిన హీరో లేడు!

వీడియో: రష్మికను ఇంతగా ఏడిపించిన హీరో లేడు!

Tupaki.com 2 weeks ago

ప్రస్తుతం రష్మిక మందన్న తన కెరీర్ ని ముంబైలో షేపప్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో ఈ ట్యాలెంటెడ్ దక్షిణాది నటి వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

తాజాగా ముంబైలో జరిగిన `కాక్‌టెయిల్ 2` ఈవెంట్‌లో స్టార్ కాస్టింగ్ షాహిద్ కపూర్- రష్మిక మందన్న, కృతి సనోన్ సందడి హైలైట్ గా నిలిచింది. రెడ్ కార్పెట్‌పై వీరిద్దరూ కలిసి కెమెరాలకు ఇచ్చిన పోజులు..అక్కడ కొన్ని సరదా మూవ్ మెంట్స్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఫోటోషూట్ జరుగుతున్న సమయంలో రష్మిక మందన్న హావభావాలు, తన ప్రవర్తన తీరుపై షాహిద్ కపూర్ సోషల్ మీడియాలో చేసిన ఒక ఫన్నీ మూవ్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ ఇద్దరు క్రేజీ స్టార్ల కెమిస్ట్రీ త్వరలోనే వెండితెరపై కూడా మ్యాజిక్ చేయబోతోందనే సంకేతాలను ఈ ఈవెంట్ ఇచ్చింది.

ఈ ప్రతిష్టాత్మక వేడుకలో షాహిద్-రష్మిక జంటగా పక్కపక్కనే నిలబడి ఫోటోగ్రాఫర్లకు పోజులిచ్చారు. ఆ సమయంలో రష్మిక ఒక్కసారిగా షాహిద్ వైపు తిరిగి.. ఎంతో ఆశ్చర్యపోతూ .. ఎమోషనల్ అవుతున్నట్లుగా ముఖం పెట్టి తమాషాగా కనిపించింది. రష్మిక గత మీడియా సమావేశంలో చేసిన ఒక అల్లరి పనికి షాహిద్ కపూర్ కూడా నవ్వు ఆపుకోలేకపోయారు. ఆ మీడియా సమావేశంలో షాహిద్ అనాలోచితంగా తన చేతిని రష్మిక భుజంపై వేయడంతో రష్మిక తన షోల్డన్ ని మూవ్ చేస్తూ తప్పించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్‌లో హల్‌చల్ చేయడం.. ఆ తర్వాత దానిని షాహిద్ కపూర్ ఆటపట్టిస్తూ రష్మికలా మూవ్ మెంట్స్ ఇస్తూ భుజాన్ని తొలగిస్తూ తర్వాతి ప్రెస్ మీట్లలో ఆటపట్టించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ వీడియోను షేర్ చేస్తూ షాహిద్ ఇలా రాసాడు..``నువ్వు నన్ను చూసి అంతగా షాక్ అవ్వాల్సిన అవసరం లేదు రష్మిక.. నేను నిజంగానే నీ పక్కన ఉన్నాను!`` అంటూ చాలా ఆప్యాయంగా, చమత్కారంగా ఆటపట్టించారు.

ఈ వైరల్ మూమెంట్‌పై రష్మిక మందన్న కూడా అంతే సరదగా స్పందించింది. షాహిద్ పోస్ట్‌ను రీ-షేర్ చేస్తూ, తామిద్దరం కలిసి నటిస్తున్న తదుపరి చిత్రం షూటింగ్ అనుభవాలను గుర్తు చేసుకుంది. సెట్స్‌లో ప్రతిరోజూ తాను ఇలాగే షాహిద్‌ను చూసి సర్‌ప్రైజ్ అవుతుంటానని... ఆయనతో కలిసి పనిచేయడం ఎంతో అద్భుతమైన అనుభూతిని ఇస్తోందని రష్మిక పేర్కొంది. స్టార్ ల మధ్య ఉండే ఇటువంటి ఆరోగ్యకరమైన చమత్కారాలు - స్నేహసంబంధాలు అభిమానులకు సరికొత్త వినోదాన్ని అందిస్తుంటాయి. ఈ ఈవెంట్ ద్వారా వీరిద్దరి మధ్య ఉన్న మంచి బాండింగ్ మరోసారి బహిర్గతమైంది.

నిజానికి షాహిద్ కపూర్- రష్మిక మందన్న భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రంలో కలిసి నటించబోతున్నారు. ఇంకా శీర్షిక ఖరారు కాని ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ఇరు పరిశ్రమల అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముంబై ఈవెంట్‌లో వీరిద్దరి మధ్య కనిపించిన ఈ ఈజ్, ఆఫ్-స్క్రీన్ కెమిస్ట్రీ చూశాక, సినిమాలో వీరి జంట ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని సినీవిశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వైరల్ ఫోటోషూట్ మూమెంట్ సదరు సినిమాపై అంచనాలను - క్రేజ్‌ను మరింతగా పెంచిందని చెప్పవచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu