Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వీడియో: రేంజ్ రోవర్ కే చెమటలు పట్టిస్తున్న తమన్

వీడియో: రేంజ్ రోవర్ కే చెమటలు పట్టిస్తున్న తమన్

Tupaki.com 1 week ago

టాలీవుడ్ అగ్ర సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ రేంజ్ ఏంటో ఇప్పుడు ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. దశాబ్ధాల కెరీర్ లో అతడి ఎదుగుదల స్కై ఈజ్ లిమిట్ అన్న చందం.

అతడి రేంజ్ ఎంతో తెలియజేసే ఒక లేటెస్ట్ వీడియో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. అతడు ఇటీవల ఒక ముఖ్యమైన పర్యటనను ముగించి విమానాశ్రయం (ఎయిర్‌పోర్ట్) నుండి బయటకు వెళుతూ కనిపించాడు. అత్యంత స్టైలిష్‌గా చకచకా నడుచుకుంటూ తన లగ్జరీ రేంజ్ రోవర్ కార్ వైపు దూసుకొస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. ఆయన వెంటే ఉన్న పరివారం కూడా అంతే వేగంగా ఫాలో అవుతూ ఆ రేంజ్ రోవర్ కార్ ఎక్కి కూర్చోవడం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. నేటితరం సంగీత దర్శకుల్లో ఒక ఫ్యాషనిస్టాగా, ఎప్పుడూ మోడ్రన్ అప్పీల్ మరియు పెప్పీ లుక్‌తో కనిపించే తమన్.. ఈ తాజా ఎయిర్‌పోర్ట్ వీడియోలోనూ తన స్టైల్ కంటెంట్‌తో మరోసారి ప్రత్యేకంగా నిలిచారు.

ఇటీవలి కాలంలో టాలీవుడ్ అగ్ర హీరోలు, దర్శకులు మరియు నిర్మాతలకు తమన్ ఒక్కడే ప్రైమరీ ఆప్షన్‌గా కనిపిస్తున్నాడు. ఆయన అందించే కొన్ని సాంగ్స్ ట్యూన్స్ రెగ్యులర్‌గా లేదా రొటీన్‌గా ఉన్నాయనే విమర్శలు ఉన్నప్పటికీ.. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (బీజీఎం) విషయంలో ఆయన ఎక్కడా రాజీకి రారు గనుకే నిర్మాతలు తమన్‌ను అత్యంత 'సేఫ్ హ్యాండ్'గా భావిస్తారు. తన అద్భుతమైన రీ-రికార్డింగ్, బీజీఎంతో సాధారణ సినిమాల రేంజ్‌ను సైతం ఎక్కడికో తీసుకెళ్లడం తమన్ ప్రత్యేకత. టాలీవుడ్ ఇండస్ట్రీలోని బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ల వెనుక ఒక ముఖ్యమైన పిల్లర్‌గా నిలిచిన తమన్‌కు పరిశ్రమలో ఉండే గౌరవమే వేరు.

మ్యూజిక్ పరంగా తమన్ హవా ఎలా ఉందో ఆయన లైనప్ చూస్తేనే స్పష్టమవుతుంది. ఈ ఏడాది (2026)లో అతడు సంగీతం అందించిన ప్రభాస్ భారీ చిత్రం `ది రాజా సాబ్`.. పవన్ కళ్యాణ్ `ఉస్తాద్ భగత్ సింగ్` (బ్యాక్‌గ్రౌండ్ స్కోర్) చిత్రాలు ఇప్పటికే విడుదలై బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ఇవే కాకుండా విడుదలకు రెడీ అవుతునున్న సాయి ధరమ్ తేజ్ `S సరస్వతి`, లెనిన్, ఏకే 47 (ఆదర్శ కుటుంబం), కొరియన్ కనకరాజు, ఇట్లు అర్జున్, .. తమిళంలో రూపొందుతున్న `ఇదయం మురళి`, `సిగ్మా` వంటి క్రేజీ ప్రాజెక్టులు ప్రస్తుతం తమన్ చేతిలోనే ఉన్నాయి.

వరుస భారీ చిత్రాలకు బ్యాక్-టు-బ్యాక్ సంగీతం అందిస్తూ ప్రస్తుతం టాలీవుడ్‌లోనే మోస్ట్ బిజీయెస్ట్ సంగీత దర్శకుడిగా తమన్ దూసుకుపోతున్నారు. వరుసగా క్రేజీ ప్రాజెక్టులతో సరికొత్త లగ్జరీ కార్లతో హల్చల్ చేస్తున్న తమన్ రేంజ్.. మునుముందు రోజుల్లో మరిన్ని భారీ విజయాలతో టాలీవుడ్‌లో ఎప్పటికీ తగ్గేదేలే అనే రేంజు అని నిరూపిస్తున్నాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu