Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తున్న పెద్ది.. భారీ స్థాయిలో!

విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తున్న పెద్ది.. భారీ స్థాయిలో!

Tupaki.com 1 week ago

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా కాంబోలో వస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద ఇప్పుడే తన విశ్వరూపం చూపిస్తోంది.

సినిమా విడుదల కాకముందే నార్త్ అమెరికాలో రికార్డు స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్‌తో గ్లోబల్ స్టార్ రేంజ్ ఏంటో రామ్ చరణ్ మరోసారి నిరూపించాడు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ సాధిస్తున్న సరికొత్త రికార్డులు మరియు సినిమా విశేషాలు ఇప్పుడు చూద్దాం..

నార్త్ అమెరికాలో పెద్ది ఊచకోత:

సాధారణంగా ఏ సినిమాకైనా ట్రైలర్ రిలీజ్ అయ్యాక బుకింగ్స్ ఊపందుకుంటాయి.కానీ 'పెద్ది' సినిమా విషయంలో మాత్రం కేవలం పోస్టర్లు,రెండు పాటలతోనే నార్త్ అమెరికాలో రికార్డులు తిరగరాస్తోంది.ఇక అక్కడ జూన్ 4న ప్రీమియర్స్ జరగనుండగా,ఇంకా చాలా సమయం ఉండగానే అప్పుడే 10,000కు పైగా ప్రీమియర్ టికెట్లు అమ్ముడైపోయాయి.ఇక చరణ్ క్రేజ్ చూసి ట్రేడ్ వర్గాలు సైతం నోరెళ్లబెడుతున్నాయి.

గ్లోబల్ స్టార్ ఖాతాలో మరో రికార్డ్:

ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్, 'పెద్ది' చిత్రంతో తన గ్లోబల్ మార్కెట్‌ను మరింత పెంచుకున్నాడు. ట్రైలర్ రాకముందే ఈ స్థాయి బుకింగ్స్ జరిగాయంటే, ఇక ట్రైలర్ రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సునామీ రాబోతుందో ఊహించుకోవచ్చు. మెగా అభిమానులు ఇప్పుడే సోషల్ మీడియాలో కాలర్ ఎగరేస్తూ సందడి చేస్తున్నారు.

మెగా కాంబినేషన్:

క్లాసిక్ హిట్ అయిన 'ఉప్పెన' తర్వాత బుచ్చిబాబు సనా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, సత్య లాంటి భారీ తారాగణం నటిస్తున్నారు.ఇక వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి.

ఆస్కార్ లెవెల్ టెక్నీషియన్స్:

ఈ సినిమాకు మరో ప్రధాన బలం దీని సాంకేతిక విభాగం. ఇక ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, ఇప్పటికే విడుదలైన రెండు పాటలు చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఇక స్టార్ సినిమాటోగ్రాఫర్ ఆర్. రత్నవేలు విజువల్స్ ఈ సినిమాను విజువల్ వండర్‌గా మార్చబోతున్నాయని టాక్ నడుస్తోంది. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే రికార్డుల వేట మొదలుపెట్టిన 'పెద్ది' సినిమా, రాబోయే రోజుల్లో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. రామ్ చరణ్ మాస్ ఇమేజ్‌కు బుచ్చిబాబు మార్క్ ఎమోషన్స్ తోడైతే బాక్సాఫీస్ దగ్గర రికార్డులన్నీ చెల్లాచెదురు అవ్వడం ఖాయం. ఇక జూన్ మొదటి వారంలో థియేటర్లలోకి రాబోతున్న ఈ మెగా యాక్షన్ డ్రామా కోసం మనమూ ఎదురుచూద్దాం..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu