Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'విరూపాక్ష'తో కనకరాజు మ్యాజిక్.. క్రేజీ క్రేజీగా..

'విరూపాక్ష'తో కనకరాజు మ్యాజిక్.. క్రేజీ క్రేజీగా..

Tupaki.com 2 weeks ago

హారర్ కామెడీ జానర్‌కు తెలుగు ప్రేక్షకులలో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. భయపెడుతూనే నవ్వించే ఈ ఫార్మాట్‌లో పక్కా ఎంటర్టైన్మెంట్ అందిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడూ మంచి రిజల్ట్ వస్తూనే ఉంటుంది.

సరిగ్గా ఇదే స్టైల్ లో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'కొరియన్ కనకరాజు'. వెరైటీ టైటిల్ తోనే అందరినీ ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ డ్ గా విడుదలకు సిద్ధమైంది.

సినిమాకు సంబంధించిన యుఎస్ఏ ప్రీమియర్స్, థియేట్రికల్ రిలీజ్ హడావిడి మొదలవ్వడంతో ఆడియన్స్‌లో ఈ ప్రాజెక్ట్ పై మంచి క్యూరియాసిటీ నెలకొంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో లో సాయి ధరమ్ తేజ్ కూడా క్రేజీగా ఓ వీడియో వదిలాడు. ఆ క్రియేటివ్ వీడియో కంటెంట్ ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేస్తోంది. సాయి ధరమ్ తేజ్ తన గదిలో ఫోన్లో మాట్లాడుతూ.. "ఏంది దెయ్యాలు.. విరూపాక్షలో దెయ్యాన్ని లవ్ చేశా.. తొక్కలో దెయ్యాలు" అంటూ దెయ్యాలపై సెటైర్లు వేయడం ఈ వీడియోలో మెయిన్ హైలైట్ గా నిలిచింది.

అయితే సాయి తేజ్ క్యాజువల్ కాల్ మధ్యలో అకస్మాత్తుగా టేబుల్ పై ప్రత్యక్షమైన ఒక పాతకాలపు కొరియన్ డ్రాగన్ కుండ ఈ వీడియోలో అసలైన ట్విస్ట్ ఇచ్చింది. ఆ కుండలో ఏముందో అని దాన్ని తెరవగానే, అందులో నుంచి ఒక బ్లూ కలర్ మ్యాజికల్ ఎనర్జీ బయటకు వచ్చి అతడిని ఆవహిస్తుంది. ఆ వెంటనే కళ్లలో మెరుపులతో స్టైలిష్ లాంగ్ కోట్ ధరించి, పక్కా మాస్ యాటిట్యూడ్ తో 'కొరియన్ కనకరాజు' అవతార్ లోకి వరుణ్ మారిపోయిన తీరు థియేటర్లలో మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ కు హింట్ ఇస్తోంది.

దర్శకుడు మేర్లపాక గాంధీ తన సినిమాల్లో సిట్యువేషనల్ కామెడీని ఎంత సహజంగా డీల్ చేస్తారో ఎక్స్ ప్రెస్ రాజా లాంటి సినిమాల్లో చూశాం. ఆయన మార్క్ కామెడీ టైమింగ్ కి, ఇలాంటి ఫాంటసీ హారర్ ఎలిమెంట్స్ తోడవ్వడం ఈ సినిమాకు మెయిన్ హైలెట్. దీనికి తోడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన ట్రెండీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆ మ్యాజికల్ ట్రాన్స్ ఫార్మేషన్ కు పర్ఫెక్ట్ గా సింక్ అయింది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ కు జోడీగా రితికా నాయక్ నటిస్తోంది.

ఇక ఓవర్సీస్ మార్కెట్ లో ఈ సినిమా సందడి మొదలైంది అని చెప్పాలి. శ్లోక ఎంటర్టైన్మెంట్స్ సంస్థ 'కొరియన్ కనకరాజు' చిత్రాన్ని అమెరికాలో గ్రాండ్ గా రిలీజ్ చేసే బాధ్యతలు తీసుకుంది. ఆగస్టు 6వ తేదీన ప్రముఖ సినిమా థియేటర్ల చైన్ 'సినీమార్క్' లో భారీ ఎత్తున ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. హారర్ ఫాంటసీ కామెడీలకు ఓవర్సీస్ లో ఉండే డిమాండ్ వలన, మేకర్స్ ముందుగానే ఇనిషియల్ థియేటర్ల లిస్ట్ తో సహా బుకింగ్స్ ఓపెన్ చేసి అక్కడ మంచి బజ్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇక ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu