Dailyhunt
యనమలకు టీడీపీ కీలక బాధ్యతలు

యనమలకు టీడీపీ కీలక బాధ్యతలు

Tupaki.com 4 days ago

నమల రామకృష్ణుడు టీడీపీలో కీలక నాయకుడు అన్నది తెలిసిందే. 1983 నుంచి ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఎన్టీఆర్ మెచ్చిన నాయకుడిగా ఎదిగి ఆయన మంత్రివర్గంలో న్యాయ శాఖ మంత్రిగా పనిచేశారు.

ఇక చంద్రబాబు సమకాలీనుడుగా టీడీపీలో అత్యంత ముఖ్య స్థానంలో ఉన్నారు. తాజా పొలిట్ బ్యూరోలో కూడా యనమలకు స్థానం అలాగే ఉంది ఇక యనమల రాజకీయంగా రిటైర్ అయిపోయారు ఆయనను పార్టీ దూరం పెట్టింది అని వార్తలు వచ్చిన నేపధ్యంలో ఆయనకు పార్టీ సముచిత స్థానం ఇస్తూ వస్తోంది. తాజాగా చూస్తే ఈ నెలలో జరగనున్న టీడీపీ మహానాడుకి సంబంధించి తీర్మానాలు ఎంతో కీలకంగా ఉంటాయి.

కన్వీనర్ గా బాధ్యతలు :

తెలుగుదేశం పార్టీ జాతీయ అంశాలను రాష్ట్ర స్థాయి అంశాలను కూడా మహానాడులో చర్చిస్తూ ఉంటుంది. ప్రతీ విషయం మీద తీర్మానాలు పెడతారు. రాజకీయ ఆర్ధిక సామాజిక అంశాల మీద తీర్మానాలు ఉంటాయి. వీటిని తయారు చేసే బాధ్యతలను సీనియర్ నేతగా యనమలకు అప్పగించారు. టీడీపీకి మార్గదర్శకుడిగా సిద్ధాంత కర్తగా వెన్నెముకగా ఉన్న యనమలకు ఇపుడు ఈ పదవిని ఇవ్వడం ద్వారా ఆయన బాధ్యతలను మరింత పెంచారని అంటున్నారు.

కూలకషంగా చర్చ :

యనమల ప్రస్తుతం దేశంలో రాజకీయ పరిస్థితులతో పాటు ప్రాంతీయ పరిస్థితులు తెలుగు రాష్ట్రాల రాజకీయంతో పాటు కీలకమైన ఆర్ధిక అంశాల మీద కూలంకషమైన చర్చ మహానాడులో చర్చ సాగుతుంది. దాంతో మహానాడులో ప్రతీ అంశం ఆసక్తిగా ఉంటుంది. వీటిని తయారు చేసే కమిటీకి యనమల కన్వీనర్ గా ఉంటే కో కన్వీనర్లుగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, గురజాల మాల్యాద్రి, సభ్యులుగా పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, ఎస్ సవిత, ఎం ఏ షరీఫ్, నక్క ఆనందబాబు, వర్ల రామయ్య, కిమిడి కళా వెంకట్రావు, పి అశోక్ బాబు, పంచుమర్తి అనూరాధ, పి క్రిష్ణయ్య, ఎస్ విజయ్ కుమార్, సిరివేరు కాశీనాధ్, సోమ భూపాల్ రెడ్డి, నెల్లూరి దుర్గా ప్రసాద్ వ్యవహరిస్తారు.

ప్రతిష్టాత్మకంగా :

ఈసారి మహానాడుని టీడీపీ నెల్లూరు వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. నారా లోకేష్ టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక జరుగుతున్న ఈ సమావేశం పైన అందరి దృష్టి ఉంది. దాంతో మహానాడు ఏ విషయాల మీద తీర్మానాలు చేస్తుంది అన్నది కూడా చూస్తున్నారు. యనమల అనుభవంతో సభ్యుల సలహా సూచనలతో ఏ తీర్మానాలు రూపొందిస్తారు అన్నది చూడాల్సి ఉంది. మొత్తానికి యనమలకు టీడీపీ టాప్ ప్రయారిటీ ఇస్తోంది. వచ్చే నెలలో రాజ్యసభ సీట్లలో ఒకటి ఆయనకు దక్కుతుందా అన్న చర్చ కూడా నడుస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu