టాలీవుడ్ లో ఇప్పటివరకు ఉన్న వ్యూస్ రికార్డులను తిరగరాస్తూ రామ్ చరణ్ 'పెద్ది' సినిమా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ముంబై వేదికగా విడుదలైన ఈ చిత్రం అఫీషియల్ ట్రైలర్ కు సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ వచ్చింది.
కేవలం 24 గంటల టైమ్ లోనే అన్ని భాషల్లో కలిపి ఏకంగా 101 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి టాలీవుడ్ లోనే అత్యధిక వ్యూస్ సాధించిన ట్రైలర్ లలో ఒకటిగా నిలిచింది. ఇండియా మొత్తం మీద ప్రస్తుతం ఈ ట్రైలర్ నంబర్ వన్ పొజిషన్ లో ట్రెండ్ అవుతోంది.

ముంబైలో జరిగిన లాంచ్ ఈవెంట్ తర్వాత నేషనల్ మీడియా కూడా చరణ్ రగ్గడ్ లుక్ కి ఫుల్ గా కనెక్ట్ అయింది. ఈ మూడు నిమిషాల కట్ లో రామ్ చరణ్ విభిన్న క్రీడల్లో కనిపించిన విధానం, ఆయన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఒక పవర్ఫుల్ అథ్లెట్ గా చరణ్ చూపించిన ఇంటెన్సిటీ, అందులోని ఎమోషన్స్ సినిమాపై అంచనాలను పెంచేలా ఉన్నాయి. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా పల్లెటూరి నేపథ్యంలో సాగే బలమైన కథ ఇందులో ఉందని విజువల్స్ చూస్తే అర్థమవుతోంది.
ఈ రకమైన రికార్డ్ వసూళ్ల వేటను చూస్తుంటే జూన్ 4న థియేటర్లలో పూనకాలు రావడం ఖాయమని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ఈ విజువల్స్ వెనుక టెక్నికల్ టీమ్ వర్క్ చాలా బలంగా కనిపిస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు సన తన రా అండ్ ఇంటెన్స్ మేకింగ్ స్టైల్ తో కంటెంట్ ని బాగా ప్రెజెంట్ చేశారు. దానికి తోడు మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ప్రతి యాక్షన్ సీక్వెన్స్ ని రెహమాన్ మ్యూజిక్ ఇంకో లెవెల్ కి తీసుకెళ్లింది. రత్నవేలు సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాను చాలా రిచ్ గా చూపించబోతున్నాయని మేకర్స్ నమ్మకంగా చెప్తున్నారు. ఇక క్యాస్టింగ్ పరంగా చూస్తే, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ వంటి నటులు చాలా కీలకమైన పాత్రల్లో కనిపించబోతున్నారు.

