Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
3 languages: అమల్లోకి 'త్రిభాషా సూత్రం

3 languages: అమల్లోకి 'త్రిభాషా సూత్రం

TV5 News 6 days ago

By - Sathwik |18 May 2026 6:30 PM IST

60 ఏళ్ల నిరీక్షణకు తెర!

దేశీయ విద్యావ్యవస్థలో సుదీర్ఘ కాలంగా నలుగుతున్న ఒక చారిత్రక ప్రతిపాదన ఎట్టకేలకు క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చబోతోంది.

నూతన విద్యా సంవత్సరంలో భాగంగా జూలై 1 నుంచి తొమ్మిదో తరగతిలో 'త్రిభాషా సూత్రాన్ని' తప్పనిసరిగా అమలు చేయాలని 'కేంద్ర మాధ్యమిక విద్యా మండలి' (సీబీఎస్‌ఈ) కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో దాదాపు 60 ఏళ్ల క్రితం నాటి ప్రతిపాదన అమలుకు మార్గం సుగమమైంది. కనీసం రెండు భారతీయ భాషలతో పాటు విద్యార్థులు మొత్తం మూడు భాషలు నేర్చుకోవడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో, దేశంలో మాతృభాషల వికాసానికి, ప్రాంతీయ భాషల బలోపేతానికి ఇది ఎంతగానో మేలు చేయనుంది.

అసలు ఏమిటీ త్రిభాషా సూత్రం?

విద్యార్థులు పాఠశాల స్థాయిలోనే మూడేసి భాషలను అభ్యసించడం వారి మేధోవికాసానికి, దేశంలోని వివిధ సంస్కృతులపై అవగాహనకు ఎంతో మేలని 'జాతీయ విద్యా విధానం' (ఎన్‌ఈపీ)-2020 బలంగా సిఫార్సు చేసింది. ఈ నిబంధన దేశంలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకు సమానంగా వర్తిస్తుంది. అయితే, ఇందులో ఎలాంటి బలవంతం లేదని, రాష్ట్రాలు తమ భౌగోళిక, సాంస్కృతిక పరిస్థితులకు అనుగుణంగా తమకు కావాల్సిన భాషలను స్వేచ్ఛగా ఎంచుకునే వీలుందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ త్రిభాషా సూత్రానికి దశాబ్దాల చరిత్ర ఉంది. దేశంలో భాషా వైవిధ్యాన్ని కాపాడుతూనే జాతీయ సమైక్యతను పెంపొందించాలనే లక్ష్యంతో 1964-66లో విద్యా కమిషన్ (దీనినే కొఠారి కమిషన్ అని పిలుస్తారు) తొలిసారిగా దీనిని ప్రతిపాదించింది. తదనంతరం, ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో, 1968లో రూపొందించిన 'విద్యపై జాతీయ విధానం' (ఎన్‌పీఈ)లో దీనిని చేర్చారు. ఆ తర్వాత 1986లో రాజీవ్ గాంధీ ప్రభుత్వ హయాంలో దీనిని పునరుద్ఘాటించగా, 1992లో పీవీ నరసింహారావు ప్రభుత్వం కొన్ని కీలక సవరణలు చేసింది. మాతృభాష లేదా ప్రాంతీయ భాష, అధికారిక భాష, మరియు ఒక ఆధునిక భారతీయ లేదా ఐరోపా భాషను ఈ మూడు భాషల జాబితాలో చేర్చి నాడు మార్పులు తెచ్చారు.

ఎన్‌ఈపీ-2020 ప్రధాన లక్ష్యం

పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులలో బహుళ భాషా నైపుణ్యాలను ప్రోత్సహించేలా, త్రిభాషా సూత్రాన్ని సత్వరం అమలు చేయాలని ఎన్‌ఈపీ-2020 ప్రతిపాదించింది. ఇది రాజ్యాంగ నిబంధనలను దృష్టిలో ఉంచుకుంటూనే, దేశ ప్రజల మధ్య జాతీయ సమైక్యతను, పరస్పర సోదరభావాన్ని పెంపొందించేలా ఉండాలని స్పష్టం చేసింది.

విదేశీ భాషల ఎంపికలో సరికొత్త 'మెలిక'

నూతన విద్యా విధానం ప్రకారం విద్యార్థులు భారతీయ భాషలు, ఆంగ్లం కాకుండా కొరియన్, జపనీస్, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్ వంటి అంతర్జాతీయ విదేశీ భాషలలో దేనినైనా ఎంచుకుని నేర్చుకోవచ్చు. అయితే, ఇక్కడే ఒక విలక్షణమైన మెలిక ఉంది. ఈ విధానంలో ఆంగ్లాన్ని కూడా విదేశీ భాషగానే వర్గీకరించారు. నిబంధనల ప్రకారం మొత్తం మూడు భాషలలో ఒకే ఒక్క విదేశీ భాషకు చోటు ఉంటుంది. దీనివల్ల ఆంగ్లంతో పాటు మరో విదేశీ భాషను (ఉదాహరణకు ఫ్రెంచ్ లేదా జర్మన్) ఒకేసారి నేర్చుకోవాలనుకునే విద్యార్థులకు ఇబ్బందులు ఎదురుకానున్నాయి. మరోవైపు మూడు భాషలకు సంబంధించిన ప్రత్యేక పాఠ్యపుస్తకాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేవరకు, తాత్కాలికంగా 2026-27 విద్యా సంవత్సరపు ఆరో తరగతి 'ఆర్3' పుస్తకాలను ఆయా భాషల బోధన కోసం వాడుకోవచ్చని సీబీఎస్‌ఈ పాఠశాలలకు సూచించింది. త్రిభాషా సూత్రంపై దేశంలో సుదీర్ఘ కాలంగా రాజకీయ వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం ఈ సూత్రంపై కేంద్రంతో తీవ్ర ఘర్షణకు దిగింది.

దేశీయ విద్యావ్యవస్థలో సుదీర్ఘ కాలంగా నలుగుతున్న ఒక చారిత్రక ప్రతిపాదన ఎట్టకేలకు క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చబోతోంది. నూతన విద్యా సంవత్సరంలో భాగంగా జూలై 1 నుంచి తొమ్మిదో తరగతిలో 'త్రిభాషా సూత్రాన్ని' తప్పనిసరిగా అమలు చేయాలని 'కేంద్ర మాధ్యమిక విద్యా మండలి' (సీబీఎస్‌ఈ) కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో దాదాపు 60 ఏళ్ల క్రితం నాటి ప్రతిపాదన అమలుకు మార్గం సుగమమైంది. కనీసం రెండు భారతీయ భాషలతో పాటు విద్యార్థులు మొత్తం మూడు భాషలు నేర్చుకోవడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో, దేశంలో మాతృభాషల వికాసానికి, ప్రాంతీయ భాషల బలోపేతానికి ఇది ఎంతగానో మేలు చేయనుంది.

అసలు ఏమిటీ త్రిభాషా సూత్రం?

ఎన్‌ఈపీ-2020 ప్రధాన లక్ష్యం

విదేశీ భాషల ఎంపికలో సరికొత్త 'మెలిక'

అసలు ఏమిటీ త్రిభాషా సూత్రం?

ఎన్‌ఈపీ-2020 ప్రధాన లక్ష్యం

విదేశీ భాషల ఎంపికలో సరికొత్త 'మెలిక'

అసలు ఏమిటీ త్రిభాషా సూత్రం?

ఎన్‌ఈపీ-2020 ప్రధాన లక్ష్యం

విదేశీ భాషల ఎంపికలో సరికొత్త 'మెలిక'

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TV5 Telugu