By - TV5 Entertainment |18 May 2026 1:26 PM IST
ఐకన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ రాకాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. అట్లీ డైరెక్ట్ చేస్తోన్న ఈ ఇంటర్నేషనల్ రేంజ్ మూవీ ఓ రేంజ్ లో ఉండబోతోంది అనిపిస్తోంది.
అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్ కే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తవుతోంది. ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు. లీక్స్ అనే మాటే అస్సలు వినిపించడం లేదు. అంటే ఎంత జాగ్రత్త తీసుకుంటే అది సాధ్యం అవుతుంది. పుష్ప, పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ రేంజ్ ప్యాన్ ఇండియాకు వెళ్లింది. రాకాతో అది ఇంటర్నేషనల్ రేంజ్ కు వెళ్లడం గ్యారెంటీ అనిపించేలా ఉంది. దీపికా పదుకోణ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె పోర్షన్ ఆల్రెడీ పూర్తయింది. మరో హీరోయిన్ గా జాన్వీ కపూర్ కూడా నటిస్తోంది అని చెబుతున్నారు. కాకపోతే ఇది ఇంకా అఫీషియల్ గా చెప్పడం లేదు. సరే ఇవన్నీ ఎలా ఉన్నా.. ఒక ప్రధానమైన విషయం మాత్రం అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో కంగారు పుట్టిస్తోంది.
ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీత దర్శకుడు. అతని గత చిత్రం వీరభద్రుడు. బట్ ఈ మ్యూజిక్ లో ఎలాంటి ప్రత్యేకత లేదు అని ఆడియన్స్ తో పాటు విమర్శకులు సైతం తేల్చారు. అతని గురించి ఓ రేంజ్ లో చెబుతూ వస్తున్నారు చాలామంది. మనోడి గురించి ఇచ్చిన బిల్డప్పులకు భిన్నంగా వీరభద్రుడు సంగీతం ఉండటం మాత్రం చాలా పెద్ద మైనస్ గా ఉంది. పాటలు అస్సలే మాత్రం ఆకట్టుకోలేదు. నేపథ్య సంగీతం అయితే అనిరుధ్ ను ఫాలో అయినట్టుగా ఉంది తప్ప తనదైన ముద్ర మాత్రం కనిపించలేదు అనేది క్లియర్. దీంతో రాకా మూవీ విషయంలో కూడా ఇదే రిపీట్ అవుతుందా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. చాలా చిన్న వయసులోనే సంగీతం మొదలు పెట్టాడు అభ్యంకర్. బట్ అతని స్థాయికి మించిన బిల్డప్ ల కారణంగా వీరభద్రుడు మూవీ సంగీతం లేదు అని ఖచ్చితంగా చెబుతున్నారు చాలామంది. మరి ఈ మూవీ వల్ల వచ్చిన విమర్శలను తీసుకుని రాకాకు మంచి సంగీతం అందిస్తాడా లేదా అనేది చూడాలి. బట్ అదే మ్యూజిక్ అయితే మాత్రం ఈ మూవీ నుంచి ఎలాంటి మ్యూజికల్ మ్యాజిక్ ను ఎక్స్ పెక్ట్ చేయలేం.
ఐకన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ రాకాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. అట్లీ డైరెక్ట్ చేస్తోన్న ఈ ఇంటర్నేషనల్ రేంజ్ మూవీ ఓ రేంజ్ లో ఉండబోతోంది అనిపిస్తోంది. అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్ కే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తవుతోంది. ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు. లీక్స్ అనే మాటే అస్సలు వినిపించడం లేదు. అంటే ఎంత జాగ్రత్త తీసుకుంటే అది సాధ్యం అవుతుంది. పుష్ప, పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ రేంజ్ ప్యాన్ ఇండియాకు వెళ్లింది. రాకాతో అది ఇంటర్నేషనల్ రేంజ్ కు వెళ్లడం గ్యారెంటీ అనిపించేలా ఉంది. దీపికా పదుకోణ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె పోర్షన్ ఆల్రెడీ పూర్తయింది. మరో హీరోయిన్ గా జాన్వీ కపూర్ కూడా నటిస్తోంది అని చెబుతున్నారు. కాకపోతే ఇది ఇంకా అఫీషియల్ గా చెప్పడం లేదు. సరే ఇవన్నీ ఎలా ఉన్నా.. ఒక ప్రధానమైన విషయం మాత్రం అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో కంగారు పుట్టిస్తోంది.

