By - Sathwik |17 May 2026 2:15 PM IST
ఏపీ రాజధాని అందరినీ ఆకర్షిస్తోందన్న మంత్రి నారా లోకేశ్
అమరావతి కేవలం పరిపాలనా రాజధానిగా మాత్రమే కాకుండా, భవిష్యత్ సాంకేతిక అభివృద్ధికి కేంద్రంగా రూపుదిద్దుకుంటోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నిర్మాణ దశలో ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా వివిధ రంగాల నిపుణులు, పరిశోధకులు, సాంకేతిక నిపుణులను ఆకర్షించే దిశగా అమరావతి ముందుకు సాగుతోందని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతికతలకు వేదికగా నిలిచే అవకాశాలు ఈ నగరంలో కనిపిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. అమరావతి అభివృద్ధి ప్రయాణం కేవలం భౌతిక మౌలిక సదుపాయాలకే పరిమితం కాకుండా, విజ్ఞానం, సాంకేతికత, ఆవిష్కరణలకు ప్రాధాన్యం కల్పించే దిశగా సాగుతోందని ఆయన చెప్పారు. ఈ క్రమంలో వివిధ ప్రాంతాల నుంచి నిపుణులు ముందుకు రావడం నగర భవిష్యత్తుపై నమ్మకాన్ని మరింత పెంచుతోందన్నారు. శాస్త్రవేత్తలు, పరిశోధకులు, సాంకేతిక నిపుణులు అమరావతిని అవకాశాల కేంద్రంగా భావించడం సానుకూల పరిణామమని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా క్వాంటం రంగానికి సంబంధించిన పనుల్లో పాల్గొంటున్న నిపుణుల సేవలను లోకేశ్ ప్రస్తావించారు. క్వాంటం ఆపరేషన్స్‌కు సంబంధించి గోపాల్ ముంబయి నుంచి వచ్చి పనిచేస్తున్నారని తెలిపారు. అలాగే పరిశోధకుడు నాగలక్ష్మయ్య రేడియో ఫ్రీక్వెన్సీ వ్యవస్థల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. భవిష్యత్ సాంకేతిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని వీరు చేస్తున్న కృషి ప్రాధాన్యం సంతరించుకుందని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్‌పై నమ్మకంతో ఈ నిపుణులు, యువత భవిష్యత్ తరాల కోసం తమ వంతు సహకారం అందిస్తున్నారని లోకేశ్ పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక రంగాల్లో రాష్ట్రాన్ని ముందంజలో నిలబెట్టాలనే లక్ష్యంతో వివిధ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయని అన్నారు. ముఖ్యంగా క్వాంటం రంగం అభివృద్ధిలో యువత భాగస్వామ్యం అభినందనీయమని కొనియాడారు. డీప్-టెక్ రంగంలో అభివృద్ధికి అమరావతి క్వాంటం వ్యాలీ కీలక కేంద్రంగా మారే అవకాశం ఉందని లోకేశ్ అభిప్రాయపడ్డారు. అత్యాధునిక పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలకు ఇది స్ఫూర్తిదాయక వేదికగా నిలుస్తుందని తెలిపారు. భవిష్యత్‌లో అమరావతి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సాంకేతిక పెట్టుబడులు, పరిశోధనలకు కేంద్రబిందువుగా ఎదగాలని ఆకాంక్షించారు.
ప్రపంచ భవిష్యత్తుకు టెలీ కమ్యూనికేషన్ కీలకం: చంద్రబాబు
దేశాల భవిష్యత్‌కు ప్రపంచ టెలీకమ్యూనికేషన్ కీలకం కానుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఏప్రిల్ 14న 'క్వాంటం కంప్యూటింగ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్' ప్రారంభోత్సవం తర్వాత.. ప్రపంచస్థాయి క్వాంటం వ్యవస్థ దిశగా మరో ముఖ్యమైన అడుగు పడిందన్నారు. దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో క్వాంటం వ్యాలీ ఆవిష్కరణలు, పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. భారత ప్రభుత్వ టెలీకమ్యూనికేషన్ విభాగానికి చెందిన సీడాట్, అమరావతి క్వాంటం వ్యాలీ భాగస్వామ్యంతో దేశంలో తొలి క్వాంటం-సెక్యూర్ కమ్యూనికేషన్స్ టెస్ట్ బెడ్ ఏర్పాటు కానుందని చెప్పారు. ఇది పరిశోధనలకు, పరీక్షలకు తోడ్పడుతుందన్నారు.
అమరావతి కేవలం పరిపాలనా రాజధానిగా మాత్రమే కాకుండా, భవిష్యత్ సాంకేతిక అభివృద్ధికి కేంద్రంగా రూపుదిద్దుకుంటోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిర్మాణ దశలో ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా వివిధ రంగాల నిపుణులు, పరిశోధకులు, సాంకేతిక నిపుణులను ఆకర్షించే దిశగా అమరావతి ముందుకు సాగుతోందని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతికతలకు వేదికగా నిలిచే అవకాశాలు ఈ నగరంలో కనిపిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. అమరావతి అభివృద్ధి ప్రయాణం కేవలం భౌతిక మౌలిక సదుపాయాలకే పరిమితం కాకుండా, విజ్ఞానం, సాంకేతికత, ఆవిష్కరణలకు ప్రాధాన్యం కల్పించే దిశగా సాగుతోందని ఆయన చెప్పారు. ఈ క్రమంలో వివిధ ప్రాంతాల నుంచి నిపుణులు ముందుకు రావడం నగర భవిష్యత్తుపై నమ్మకాన్ని మరింత పెంచుతోందన్నారు. శాస్త్రవేత్తలు, పరిశోధకులు, సాంకేతిక నిపుణులు అమరావతిని అవకాశాల కేంద్రంగా భావించడం సానుకూల పరిణామమని ఆయన పేర్కొన్నారు.
ప్రపంచ భవిష్యత్తుకు టెలీ కమ్యూనికేషన్ కీలకం: చంద్రబాబు
ప్రపంచ భవిష్యత్తుకు టెలీ కమ్యూనికేషన్ కీలకం: చంద్రబాబు
ప్రపంచ భవిష్యత్తుకు టెలీ కమ్యూనికేషన్ కీలకం: చంద్రబాబు

