Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
AP: అగ్రిగోల్డ్ బాధితుల దశాబ్దాల నిరీక్షణకు తెర

AP: అగ్రిగోల్డ్ బాధితుల దశాబ్దాల నిరీక్షణకు తెర

TV5 News 1 week ago

By - Sathwik |14 May 2026 7:30 PM IST

కీలక నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు.. సంబంధిత అధికారులతో కీలక చర్చ.. 6 నెలల్లో న్యాయం చేయాలని ఆదేశం

దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక, అంతర్జాతీయ సవాళ్ల మధ్య బాధ్యతాయుత పాలన అవసరమని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పొదుపు చర్యల నుంచి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం వరకు, భారీ పెట్టుబడుల నుంచి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల వరకు పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వ్యవహరించాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేస్తూ, ప్రజల్లోనూ బాధ్యత పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధాని మోదీ ఇచ్చిన పొదుపు పిలుపుపై మంత్రివర్గం ప్రత్యేకంగా చర్చించింది. 'నా దేశం - నా బాధ్యత' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, కేవలం ప్రభుత్వమే కాదు ప్రజలు కూడా పొదుపు చర్యల్లో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందన్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు తమ కాన్వాయ్‌లను తగ్గించుకోవడం సరిపోదని, అనవసర ఖర్చులను అన్ని స్థాయిల్లో నియంత్రించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జిల్లాల పర్యటనలు, విదేశీ పర్యటనల్లో ఖర్చులను తగ్గించుకోవాలని మంత్రులకు సూచించారు.

అగ్రిగోల్డ్ బాధితులపై కీలక నిర్ణయం

అగ్రిగోల్డ్ బాధితుల సమస్యపై కూడా కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దశాబ్దకాలంగా న్యాయం కోసం ఎదురు చూస్తున్న బాధితులకు త్వరితగతిన పరిష్కారం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్‌లోనే 11.5 లక్షలకు పైగా అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారని సీఎం తెలిపారు. మరో ఎనిమిది రాష్ట్రాల్లో కలిపి సుమారు 20 లక్షల మంది ఈ కుంభకోణం వల్ల నష్టపోయారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో కేసు దర్యాప్తులో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని సీఎం విమర్శించారు. సీఐడీ అధికారులు సైతం అగ్రిగోల్డ్ సొమ్మును దుర్వినియోగం చేశారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. గతంలో వివాదాల్లో చిక్కుకుని వేలం వేయకుండా మిగిలిపోయిన ఆస్తులను గుర్తించి, కోర్టు అనుమతితో పారదర్శకంగా వేలం వేసి వచ్చిన మొత్తాన్ని బాధితులకు పంపిణీ చేయాలని సూచించారు.

బాధితుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికీ చెల్లింపులు జరిగేలా కమిటీ పని చేయాలని సీఎం ఆదేశించారు. అగ్రిగోల్డ్ బాధితుల్లో ఎక్కువ మంది సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారేనని, వారి కష్టార్జిత సొమ్ము తిరిగి అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన హామీల మేరకు వడ్డీతో సహా కనీసం అసలు మొత్తాన్ని త్వరగా చెల్లించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఆరు నెలల్లో ఈ ప్రక్రియలో స్పష్టమైన పురోగతి కనిపించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇక రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చ జరిగింది. 40కు పైగా అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సుమారు రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులతో 25 ప్రధాన ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉపాధి అవకాశాల కల్పనతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడే రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. శుద్ధ ఇంధనం, గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, భారీ సోలార్ ప్రాజెక్టులు, పంప్డ్ స్టోరేజ్ యూనిట్లు, బయోగ్యాస్ ప్రాజెక్టుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పునరుత్పాదక ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టే దిశగా చర్యలు చేపడుతోంది.

ఇంధన ఆదాపైనా చర్చలు

పా­ల­నా వ్య­వ­స్థ­లో సాం­కే­తి­కత వి­ని­యో­గా­న్ని పెం­చి, వర్చు­వ­ల్ వి­ధా­నా­ల­కు ప్రా­ధా­న్యం ఇవ్వా­ల­ని సీఎం అధి­కా­రు­ల­కు ది­శా­ని­ర్దే­శం చే­శా­రు. సమా­వే­శా­లు, సమీ­క్ష­లు వీ­లై­నం­త­వ­ర­కు ఆన్‌­లై­న్‌­లో ని­ర్వ­హిం­చ­డం ద్వా­రా సమయం, ఇం­ధ­నం, ప్ర­భు­త్వ వ్య­యం ఆదా అవు­తుం­ద­ని అభి­ప్రా­య­ప­డ్డా­రు. ఎల­క్ట్రి­క్ వా­హ­నాల వి­ని­యో­గా­న్ని ప్రో­త్స­హిం­చా­ల­ని, ప్ర­భు­త్వ శా­ఖ­లు కూడా ఈ ది­శ­గా ముం­దు­కు సా­గా­ల­ని సూ­చిం­చా­రు. ప్ర­భు­త్వ కా­ర్యా­ల­యా­ల్లో వి­ద్యు­త్ వి­ని­యో­గా­న్ని ని­యం­త్రిం­చేం­దు­కు ఎయి­ర్ కం­డీ­ష­న­ర్ల ఉష్ణో­గ్ర­త­ను 24 నుం­చి 26 డి­గ్రీల మధ్య ఉం­చా­ల­ని సీఎం ఆదే­శిం­చా­రు. అలా­గే 'వర్క్ ఫ్ర­మ్ హోమ్' వి­ధా­నం­పై అధ్య­య­నం చేసి, అవ­స­ర­మైన చోట అమలు చేసే అవ­కా­శా­ల­ను పరి­శీ­లిం­చా­ల­ని అధి­కా­రు­ల­ను కో­రా­రు. సౌ­ర­శ­క్తి వి­ని­యో­గా­న్ని పె­ద్దఎ­త్తున వి­స్త­రిం­చా­ల్సిన అవ­స­రం ఉం­ద­ని, భవి­ష్య­త్తు­లో పు­న­రు­త్పా­దక ఇంధన వన­రు­లే కీలక పా­త్ర పో­షి­స్తా­య­ని సీఎం పే­ర్కొ­న్నా­రు. దేశం మనకు ఎంతో ఇచ్చిం­ద­ని, ఇప్పు­డు దే­శా­ని­కి తి­రి­గి బా­ధ్యత చూ­పిం­చా­ల్సిన సమయం వచ్చిం­ద­ని ఆయన వ్యా­ఖ్యా­నిం­చా­రు. ప్ర­జ­లు అవ­స­రం లేని ఖర్చు­లు తగ్గిం­చు­కో­వా­ల­ని అన్నారు.

దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక, అంతర్జాతీయ సవాళ్ల మధ్య బాధ్యతాయుత పాలన అవసరమని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పొదుపు చర్యల నుంచి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం వరకు, భారీ పెట్టుబడుల నుంచి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల వరకు పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వ్యవహరించాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేస్తూ, ప్రజల్లోనూ బాధ్యత పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధాని మోదీ ఇచ్చిన పొదుపు పిలుపుపై మంత్రివర్గం ప్రత్యేకంగా చర్చించింది. 'నా దేశం - నా బాధ్యత' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, కేవలం ప్రభుత్వమే కాదు ప్రజలు కూడా పొదుపు చర్యల్లో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందన్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు తమ కాన్వాయ్‌లను తగ్గించుకోవడం సరిపోదని, అనవసర ఖర్చులను అన్ని స్థాయిల్లో నియంత్రించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జిల్లాల పర్యటనలు, విదేశీ పర్యటనల్లో ఖర్చులను తగ్గించుకోవాలని మంత్రులకు సూచించారు.

అగ్రిగోల్డ్ బాధితులపై కీలక నిర్ణయం

ఇంధన ఆదాపైనా చర్చలు

అగ్రిగోల్డ్ బాధితులపై కీలక నిర్ణయం

ఇంధన ఆదాపైనా చర్చలు

అగ్రిగోల్డ్ బాధితులపై కీలక నిర్ణయం

ఇంధన ఆదాపైనా చర్చలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TV5 Telugu